గురువారం, 15 అక్టోబర్ 2026 --:--:-- | 📍 వాతావరణం తెలుసుకుంటోంది...
International

Russia Earthquake : రష్యాలో భారీ భూకంపం – 7.8 తీవ్రతతో భూమి కంపనం, సునామీ హెచ్చరిక

Keerthanaa News Deskప్రచురణ తేదీ: శుక్రవారం, 19 సెప్టెంబర్ 2025

Russia Earthquake : రష్యాలో మరోసారి ప్రకృతి విపత్తు భయాందోళన కలిగించింది. కమ్చాట్‌స్కా ద్వీపం సమీపంలో 7.8 తీవ్రతతో భారీ భూకంపం నమోదైంది. ఈ ప్రభావంతో అధికారులు వెంటనే సునామీ హెచ్చరిక జారీ చేశారు. రాత్రి వేళ భూమి కంపడంతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు.

భూకంపం వివరాలు
భూకంపం పెట్రోపావ్లోవ్స్‌క్-కమ్చాట్‌స్కీ ప్రాంతంలో సెప్టెంబర్ 18 అర్ధరాత్రి తర్వాత సంభవించింది.
కేంద్రం భూమి ఉపరితలానికి 10 కి.మీ లోతులో ఉన్నట్లు యుఎస్ జియోలాజికల్ సర్వే (USGS) తెలిపింది.
ఆ తరువాత కూడా 5.8 తీవ్రతతో పలు ఆఫ్టర్‌షాక్స్ నమోదయ్యాయి.
ఇప్పటి వరకు ఎటువంటి ప్రాణనష్టం, ఆస్తినష్టం జరగలేదని అధికారులు వెల్లడించారు.

ప్రజల ఆందోళన
భూకంపం సమయంలో ఇళ్లలోని ఫర్నిచర్, లైట్లు, కార్లు వణికిపోతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. గవర్నర్ వ్లాదిమిర్ సోలోడోవ్ టెలిగ్రామ్ ద్వారా ప్రజలను అప్రమత్తం చేస్తూ, తూర్పు తీరం వెంబడి సునామీ ముప్పు పొంచి ఉందని హెచ్చరించారు.

గతంలోనూ వరుస భూకంపాలు
కమ్చాట్‌స్కా ద్వీపం భూకంపాలకు అతీతం కాదు.
సెప్టెంబర్ 13 → 7.4 తీవ్రతతో భూకంపం.
సెప్టెంబర్ 15 → 6.0 తీవ్రతతో భూకంపం.
జూలై 20 → 7.4 తీవ్రత.
జూలై 30 → 8.8 తీవ్రత.

ఈ నెలలో (సెప్టెంబర్ 2025) ఇప్పటికే మూడవసారి భూకంపం సంభవించడంతో, ఈ ప్రాంతం ఎంత ప్రమాదకరమో మళ్లీ స్పష్టమైంది.

ఇవీ చదవండి: Alexei Navalny : రష్యా ప్రతిపక్ష నేత అలెక్సీ నవాల్నీ మృతి.. విషప్రయోగం?
Russian Plane : రష్యాలో విమాన ప్రమాదం.. కొండల్లో శకలాలు.. వీడియో వైరల్
Russia Warns US : అమెరికాకు గట్టి వార్నింగ్ ఇచ్చిన రష్యా.. ఎందుకంటే?

ట్యాగ్స్: , , , , , , ,
AIతో కథనాన్ని సంక్షిప్తంగా చదవండి

ఎంపిక చేసిన AI సేవలో ఈ కథనం లింక్‌తో సమ్మరీ తెరుచుకుంటుంది.

Discover more from keerthanaanews.com

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading