HomeNationalVote Chori : ఓటు చోరీపై రాహుల్ గాంధీ ఆందోళన.. ఈసీపై సంచలన ఆరోపణలు

Vote Chori : ఓటు చోరీపై రాహుల్ గాంధీ ఆందోళన.. ఈసీపై సంచలన ఆరోపణలు

Vote Chori : కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత రాహుల్ గాంధీ ఓటు చోరీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజాస్వామ్యాన్ని రక్షించాల్సిన ఎలక్షన్‌ కమిషన్‌ (ఈసీ) స్వయంగా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న వారిని కాపాడుతోందని ఆయన తీవ్రంగా విమర్శించారు. తన ఆరోపణలకు వందశాతం ఆధారాలు ఉన్నాయని స్పష్టం చేస్తూ, ఓటర్ల జాబితాలపై జరుగుతున్న మోసపూరిత చర్యలను రాహుల్ గాంధీ ఎత్తిచూపారు.

ఫేక్ అప్లికేషన్లతో ఓట్లు తొలగింపు
రాహుల్ గాంధీ వెల్లడించిన వివరాల ప్రకారం, ఫేక్ అప్లికేషన్లు ఫైల్ చేసి, నకిలీ లాగిన్‌ ఐడీలతో లక్షలాది ఓటర్ల పేర్లను డిలీట్‌ చేస్తున్నారని ఆరోపించారు. ముఖ్యంగా కాంగ్రెస్‌కు బలమైన ప్రాతినిధ్యం ఉన్న ప్రాంతాల్లోనే ఈ మోసాలు జరిగాయన్నారు. ఓటర్ల అనుమతి లేకుండానే వారి పేర్లను తొలగించే విధంగా దరఖాస్తులు సమర్పించడం జరిగిందని పేర్కొన్నారు.

కర్ణాటకలో అన్యాయం
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే ఈ పెద్ద ఎత్తున మోసాలు జరిగాయని రాహుల్ గుర్తు చేశారు. అక్కడ 6,800 ఓట్లు తొలగించబడ్డాయని, వేలాది మంది కాంగ్రెస్‌ అనుకూలులు ఈ కుట్రకు బలైపోయారని తెలిపారు. ఈ ప్రక్రియను ఒక సెంట్రలైజ్డ్‌ సిస్టమ్‌ ద్వారా నడిపారని, ఇతర రాష్ట్రాల నుంచి ఫోన్‌ సెంటర్లు ఉపయోగించి కర్ణాటకలో ఓట్లు తొలగించారని ఆరోపించారు.

తప్పుడు మొబైల్‌ నంబర్ల వాడకం
ఓటర్ల మొబైల్‌ నంబర్లను లింక్‌ చేసినట్లు చూపించినా, అవి అన్నీ తప్పుడు నంబర్లేనని రాహుల్ గాంధీ అన్నారు. ఆ నంబర్ల వెనుక ఎవరున్నారు? వాటిని ఎవరు ఆపరేట్‌ చేశారు? అన్న ప్రశ్నలు ఇంకా సమాధానం రాలేదన్నారు. ఉదాహరణకు, ఒక సూర్యకాంత్‌ అనే పేరుతో కేవలం 12 నిమిషాల్లో 14 దరఖాస్తులు వెళ్లడం ఈ మోసానికి నిదర్శనమని తెలిపారు.

దళితులు, ఆదివాసీల ఓట్లు లక్ష్యం
ఈ కుట్రలో ప్రధానంగా దళితులు, ఆదివాసీల ఓట్లను తొలగించే ప్రయత్నం జరుగుతోందని రాహుల్ గాంధీ ఆరోపించారు. అధికారులకు తెలియకుండా ఓట్లు ఎలా తొలగించగలుగుతున్నారు? అనే ప్రశ్నను లేవనెత్తారు. వ్యవస్థను కొందరు వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా హైజాక్‌ చేసి, ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తున్నారని ఆయన విమర్శించారు.

ప్రజాస్వామ్య భవిష్యత్తు పై ఆందోళన
“ప్రజాస్వామ్యం అంటే ప్రజల హక్కు. ఆ హక్కును రక్షించాల్సిన సంస్థలే, ప్రజల ఓటును దోచుకునే పనిలో ఉంటే.. ఈ దేశ భవిష్యత్తు ఏ దిశగా వెళ్తుంది?” అని రాహుల్ గాంధీ ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై తక్షణమే సమగ్ర దర్యాప్తు జరపాలని, ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు అన్ని రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు కలసి పోరాడాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు.

ఇవీ చదవండి: Jagan on Rahul : చంద్రబాబు.. రాహుల్.. రేవంత్ @ హాట్‌లైన్: జగన్ చురకలు
Rahul Gandhi on EC : రాహుల్ గాంధీ సంచలనం.. ఈసీపై ఆటమ్ బాంబ్!
Revanth Reddy : స్కూల్ మోదీ, కాలేజీ చంద్రబాబు, ఉద్యోగం రాహుల్ గాంధీ!

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు