HomeAndhra PradeshJagan on Rahul : చంద్రబాబు.. రాహుల్.. రేవంత్ @ హాట్‌లైన్: జగన్ చురకలు

Jagan on Rahul : చంద్రబాబు.. రాహుల్.. రేవంత్ @ హాట్‌లైన్: జగన్ చురకలు

Jagan on Rahul : కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైయస్సార్ సీపీ అధినేత వైయస్ జగన్ చురకలంటించారు. ఓట్ చోరీ అంటూ మాట్లాడుతున్న రాహుల్ గాంధీ అనే వ్యక్తి ఎందుకు ఆంధ్రా గురించి మాట్లాడరు అని జగన్ ప్రశ్నించారు. పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో అధికార పార్టీ అక్రమాలపై తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో జగన్ ఇవాళ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఎక్కడెక్కడ దొంగ ఓట్లు వేయడానికి టీడీపీ నాయకులు ప్రయత్నించారన్నది ఆధారాలతో సహా వీడియోలు, ఫొటోలు ప్రదర్శించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అన్యాయాలు చేస్తున్నారని, ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు జరగలేదని జగన్ మండిపడ్డారు. (Jagan on Rahul)

చంద్రబాబు వయా రేవంత్, మాణిక్కం ఠాగూర్, రాహుల్..
చంద్రబాబు హాట్ లైన్లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ద్వారా రాహుల్ గాంధీతో టచ్ లో ఉంటారని జగన్ విమర్శించారు. ఏపీ కాంగ్రెస్ ఇన్ చార్జ్ మాణిక్కం ఠాగూర్ అనేటోడు ఎందుకు చంద్రబాబు అక్రమాల గురించి, స్కాముల గురించి మాట్లాడరని జగన్ ప్రశ్నించారు. ఏపీలో లిక్కర్ ఎమ్మార్పీ రేట్ల కన్నా ఎక్కువ రేట్లకు అమ్ముతున్నారని, ఏ వీధిలో చూసినా బెల్ట్ షాపులు ఉన్నాయన్నారు. దీని గురించి ఎందుకు మాణిక్కం ఠాగూర్ ఎందుకు మాట్లాడని ప్రశ్నించారు. చంద్రబాబు స్కాముల గురించి ఎందుకు నోరెత్తరని ప్రశ్నించారు. కారణం.. హాట్ లైన్. రేవంత్ ద్వారా, మాణిక్కం ఠాగూర్ ద్వారా చంద్రబాబు రాహుల్ గాంధీతో టచ్ లో ఉంటారని, అందుకే ఆంధ్రా గురించి, చంద్రబాబు గురించి ఠాగూర్ మాట్లాడరని జగన్ విమర్శించారు. కానీ, తన గురించి మాత్రం మాణిక్కం ఠాగూర్ ప్రతిసారీ మాట్లాడతారని గుర్తు చేశారు.

ఓట్ చోరీ ఏపీలో కనపడలేదా?
ఓట్ చోరీ అని ఇప్పుడు హడావుడి చేస్తున్న రాహుల్ గాంధీ.. ఏపీ గురించి ఎందుకు మాట్లాడలేదని జగన్ ప్రశ్నించారు. ఏపీలో 12.5 శాతం ఓట్ల శాతం అధికంగా లెక్క చూపారని, దీనిపై తాము కేంద్ర ఎన్నికల సంఘానికి ఆధారాలతో సహా సమర్పించామని జగన్ గుర్తు చేశారు. కానీ, రాహుల్ గాంధీ ఆంధ్రా గురించి మాట్లాడకపోవడానికి కారణం.. చంద్రబాబుతో హాట్ లైన్ లో టచ్ లో ఉండటమేనన్నారు. వీళ్లో పార్టీలు, వీళ్లదో ఎంజెండా… అంటూ జగన్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఏపీ, తెలంగాణ రాజకీయ పార్టీలు, అటు కేంద్రంలోనూ జగన్ కామెంట్స్ ప్రకంపనలు పుట్టిస్తున్నాయి.

ఇవీ చదవండి: YSRCP Legal Cell Meeting : చంద్రబాబు పాలనంతా అన్యాయం: జగన్‌ ధ్వజం
YS Jagan in Nellore : నా పర్యటనపై ఎందుకీ ఆంక్షలు? : నెల్లూరులో జగన్
YSRCP Meets Governor : జగన్ భద్రతపై ప్రభుత్వం కుట్రలు: గవర్నర్‌కు వైసీపీ ఫిర్యాదు

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు