HomeTelanganaRevanth Reddy : సౌర విద్యుత్ వినియోగాన్ని ప్రోత్సహిద్దాం: రేవంత్

Revanth Reddy : సౌర విద్యుత్ వినియోగాన్ని ప్రోత్సహిద్దాం: రేవంత్

Revanth Reddy : రాష్ట్రంలో సౌర విద్యుత్ వినియోగాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని, అందుకు అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఇంధన శాఖ అధికారులకు ఆదేశించారు.

ఇంధన శాఖపై ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతో కలిసి ఉన్నతస్థాయి సమావేశంలో సమీక్షించారు. ఈ సందర్భంగా అధికారులు కొండారెడ్డిపల్లిలో పైలట్ ప్రాజెక్టుగా చేపట్టిన మోడల్ సోలార్ రూఫ్ టాప్ విలేజ్ పనుల వివరాలను తెలియజేశారు.

ఇందిరా సోలార్ గిరి జల వికాసం ద్వారా రైతులకు సోలార్ పంప్ సెట్లను అందించాలని ముఖ్యమంత్రి గారు చెప్పారు. వ్యవసాయ పంపుసెట్లకు కంటైనర్ బేస్డ్ సోలార్ ప్యానెల్ ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలని అన్నారు. ముఖ్యంగా మహిళా రైతులకు సోలార్ విద్యుత్ తో పాటు వారికి ఆదాయం అందించేందుకు ఈ విధానం ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పారు.

రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు, భవనాలను సోలార్ విద్యుత్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని సూచించారు. ఇప్పటికే గుర్తించిన ప్రభుత్వ భవనాలు, పాఠశాలల సమాచారాన్ని అధికారులు సమావేశంలో వివరించారు.

పునరుత్పాదక విద్యుత్ తయారీలో వీలైనంత ఎక్కువ పెట్టుబడులను ఆహ్వానించాలని, అందుకు అవసరమైన ప్రణాళికలతో పాటు, బడ్జెట్ అంచనాలను రూపొందించాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఆదేశించారు.

ఇవీ చదవండి: Revanth Reddy: ఆ ఎమ్మెల్యేలతో రేవంత్ రెడ్డి భేటీ వెనుక ఆంతర్యం?
Kamma Community : బీఆర్ఎస్‌కు క‌మ్మ సామాజిక వ‌ర్గం దూరం! కేటీఆర్ వ్యాఖ్య‌లే అందుకు నిద‌ర్శ‌నం!
Jubilee Hills By Poll | జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక: బీఆర్ఎస్‌ను టెన్ష‌న్ పెడుతున్న క‌విత‌!

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు