HomeCinemaUstaad Bhagat Singh: షూటింగ్ పూర్తి చేసిన పవన్.. మెగా అభిమానుల్లో సంబరాలు

Ustaad Bhagat Singh: షూటింగ్ పూర్తి చేసిన పవన్.. మెగా అభిమానుల్లో సంబరాలు

Ustaad Bhagat Singh: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజాగా ప్రేక్షకుల ముందుకు హరిహర వీరమల్లుతో వచ్చారు. ప్రస్తుతం ఆయన హీరోగా నటించిన మరో భారీ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’. హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఆదివారం విజయవంతంగా ముగిసింది. ఈ విషయాన్ని మేకర్స్ ప్రత్యేక వీడియో ద్వారా అధికారికంగా ప్రకటించారు.

‘గబ్బర్ సింగ్’ బ్లాక్‌బస్టర్ తర్వాత మళ్లీ పవన్–హరీష్ శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న ఈ చిత్రం పై అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. పవన్ కళ్యాణ్ తన తీరికలేని రాజకీయ షెడ్యూల్‌కి మధ్య కూడా చిత్రీకరణకు పూర్తి సమయాన్ని కేటాయించి, అంకితభావం చూపినట్లు చిత్రబృందం తెలిపింది.

ప్రధాన టాకీ పార్ట్‌తో పాటు కీలకమైన సన్నివేశాలన్నీ ఈ షెడ్యూల్‌లో పూర్తి అయ్యాయి. హరీష్ శంకర్ సిబ్బందితో కలిసి అహర్నిశలు శ్రమించి షూటింగ్ సజావుగా కొనసాగించాడు. దీనిపై నిర్మాతలు ఆనందం వ్యక్తం చేశారు. ప్రస్తుతం సినిమా తుదిదశ పనులు పూర్తిచేసి నిర్మాణాంతర కార్యక్రమాలకు సిద్ధమవుతోంది.

ఈ చిత్రంలో శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటిస్తుండగా, పార్థిబన్, కె.ఎస్. రవికుమార్, ఎల్.బి. శ్రీరామ్, సత్యం రాజేష్, నవాబ్ షా వంటి పలువురు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. రామ్–లక్ష్మణ్ యాక్షన్ సన్నివేశాలను కొరియోగ్రఫీ చేస్తుండగా, అయనంక బోస్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. నీతా లుల్లా కాస్ట్యూమ్స్, ఆనంద్ సాయి ఆర్ట్ డైరెక్షన్ చేస్తున్నారు.

మెగా అభిమానులు, మాస్ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ చిత్రం త్వరలోనే నిర్మాణాంతర పనులు పూర్తి చేసుకుని ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇవీ చదవండి: Pawan Kalyan : పవన్ ప్రేయసి.. రామ్ చరణ్ అక్కగా నటించిన భామ ఎవరో తెలుసా?
Pawan Kalyan : సూపర్ సిక్స్-సూపర్ హిట్.. పార్టీలు వేరైనా ప్రజాశ్రేయస్సే లక్ష్యం : పవన్ కల్యాణ్

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు