HomeCinemaPawan Kalyan : పవన్ ప్రేయసి.. రామ్ చరణ్ అక్కగా నటించిన భామ ఎవరో తెలుసా?

Pawan Kalyan : పవన్ ప్రేయసి.. రామ్ చరణ్ అక్కగా నటించిన భామ ఎవరో తెలుసా?

Pawan Kalyan : మెగా ఫ్యామిలీ హీరోలతో నటించే అదృష్టం చాలా కొద్ది మంది హీరోయిన్‌లకే దక్కుతుంది. పవన్ కల్యాణ్, రామ్ చరణ్‌లతో చాలామంది నటించినా, ఒక హీరోయిన్ మాత్రం ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఒక సినిమాలో పవన్ కల్యాణ్‌కు ప్రేయసిగా, మరొక సినిమాలో రామ్ చరణ్‌కు అక్కగా నటించింది. ఆసక్తికరంగా రెండు సినిమాలు హిట్ అయ్యాయి. ఆ హీరోయిన్ మరెవరో కాదు బాలీవుడ్ బ్యూటీ కృతి కర్బందా. Pawan Kalyan

టాలీవుడ్‌లో కృతి కర్బందా
కృతి కర్బందా టాలీవుడ్‌లో బోణి సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. తొలి సినిమాతోనే అందం, నటనలో మంచి మార్కులు సాధించింది.
ఆ తర్వాత అలా మొదలైంది సినిమాలో చిన్న కానీ గుర్తుండిపోయే పాత్ర పోషించింది.
తీన్ మార్ చిత్రంలో పవన్ కల్యాణ్ ప్రేయసిగా నటించి ఫుల్ క్రేజ్ సంపాదించింది.
ఆ తర్వాత రామ్ చరణ్ బ్రూస్ లీ సినిమాలో ఆయన అక్క పాత్రలో నటించి ప్రేక్షకుల మెప్పు పొందింది.
అదేకాక రామ్ ఒంగోలు గిత్త, కల్యాణ్ రామ్ 3D వంటి చిత్రాల్లోనూ కనిపించింది.

ప్రస్తుతం బాలీవుడ్‌లో బిజీ
టాలీవుడ్‌లో కొన్ని మంచి సినిమాలు చేసిన తర్వాత కృతి ముంబైకి మకాం మార్చింది. బాలీవుడ్‌లో వరుసగా సినిమాలు చేస్తూ గుర్తింపు తెచ్చుకుంది. గతేడాది నటుడు పులకిత్ సామ్రాట్ ను వివాహం చేసుకుంది. వీరిద్దరూ చాలా ఏళ్లుగా ప్రేమలో ఉండి, చివరకు వివాహ బంధంతో ఒక్కటయ్యారు.

ఇవీ చదవండి: Mumbai Police : నటి అనుష్కను అరెస్ట్ చేసిన ముంబై పోలీసులు
New Zealand MP: న్యూజిలాండ్ యువ ఎంపీ, 22 ఏళ్ల అమ్మడు.. మళ్లీ వైరలైపోయింది

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు