IND vs PAK: ఆసియా కప్ 2025లో టీమిండియా పాకిస్థాన్‌పై ఘన విజయం సాధించింది. అయితే మ్యాచ్ గెలిచిన వెంటనే భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ చేసిన చర్య ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది.
పహల్గామ్ ఉగ్రదాడి తరువాత భారత్–పాక్ సంబంధాలపై తీవ్ర ఉద్రిక్తత కొనసాగుతుండగా, ఈ మ్యాచ్ ఆడడమే పెద్ద వివాదంగా మారింది. కానీ బీసీసీఐ నిర్ణయంతో యంగ్ టీమిండియా మైదానంలో అడుగుపెట్టింది. ఆటలో భారత్ అద్భుతంగా రాణించి పాక్ జట్టును ఓడించింది.
అయితే మ్యాచ్ ముగిసిన తర్వాత సాధారణంగా ఆటగాళ్లు ఒకరితో ఒకరు హ్యాండ్‌షేక్ చేసుకోవడం ఆనవాయితీ. కానీ ఈసారి సూర్యకుమార్ యాదవ్ ఆ ప్రోటోకాల్‌ను పాటించలేదు. నాటౌట్‌గా నిలిచిన ఆయనతో పాటు శివమ్ దూబే కూడా పాక్ ఆటగాళ్లతో చేతులు కలపకుండా నేరుగా డ్రెస్సింగ్‌రూమ్ వైపు వెళ్లిపోయారు. ఇది పాక్‌పై ఒక రకమైన నిరసనగా భావిస్తున్నారు.
టాస్ సమయంలో కూడా సూర్యకుమార్ పాక్ కెప్టెన్‌తో హ్యాండ్‌షేక్ చేయలేదు. ఈ వ్యవహారాన్ని కొంతమంది అభిమానులు మద్దతు పలుకుతుండగా, కొందరు దీనిపై చర్చిస్తున్నారు. అయినప్పటికీ, మైదానంలో పాక్‌ను చిత్తుచేసిన విజయం భారత అభిమానులను ఆనందంలో ముంచేసింది.
ఇవీ చదవండి: IND vs PAK : టీమ్ ఇండియా చారిత్రాత్మక ఘనవిజయం.. తేలిపోయిన పాక్
IND vs PAK: బీసీసీఐ అధికారులు, సెలెబ్రిటీలు భారత్-పాక్ మ్యాచ్‌కు దూరం.. కారణం?
Team India : పాక్‌తో పోరు.. టీమిండియా కొత్త ఫీల్డింగ్ వ్యూహాలు
