HomeCinemaUrvashi Rautela Mimi Chakraborty : ఊర్వశి, మిమీలకు ఈడీ నోటీసులు

Urvashi Rautela Mimi Chakraborty : ఊర్వశి, మిమీలకు ఈడీ నోటీసులు

Urvashi Rautela Mimi Chakraborty : బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా, మాజీ ఎంపీ, నటి మిమి చక్రవర్తిలకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) నోటీసులు జారీ చేసింది. ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కేసులో విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో ఈ చర్య తీసుకున్నారు.

వారిద్దరినీ ఢిల్లీ ప్రధాన కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని ఈడీ ఆదేశించింది. మిమి చక్రవర్తి సెప్టెంబర్ 15న, ఊర్వశి రౌతేలా సెప్టెంబర్ 16న విచారణకు హాజరవ్వాల్సి ఉంది. బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కోసం డబ్బు ఎలా అందుకున్నారనే విషయంపై ప్రశ్నించనుంది.

ఈ కేసు భారీ మనీలాండరింగ్ నెట్‌వర్క్‌లో భాగమని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే క్రికెటర్లైన శిఖర్ ధావన్, సురేష్ రైనా వాంగ్మూలాలు రికార్డ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో మరికొంతమంది సినీ తారలకు కూడా త్వరలో సమన్లు జారీ అయ్యే అవకాశం ఉంది. అక్రమంగా నడుస్తున్న ఈ నెట్‌వర్క్ మొత్తాన్ని నిర్వీర్యం చేయడమే ఈడీ లక్ష్యం అని తెలుస్తోంది.

ఇవీ చదవండి: Betting Apps : బెట్టింగ్ యాప్ కేసులో మిస్టర్ ఐపీఎల్ పేరు? ఈడీ సమన్లు!
Mahesh Babu Case : ఈడీ ముందుకు మహేష్‌బాబు.. ఏం జరిగింది?

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు