AP Police : ఆంధ్రప్రదేశ్ లో సోషల్ మీడియా యాక్టివిస్టుల అరెస్టుల పర్వం మళ్లీ ఊపందుకుంది. ప్రభుత్వం మారిన తర్వాత నేతల ఆదేశాలతో విచ్చలవిడిగా అక్రమ అరెస్టులు కొనసాగాయి. అర్ధరాత్రి, తెల్లవారుజామున అని చూడకుండా చాలా మందిని అరెస్టులు చేసి స్టేషన్ల చుట్టూ తిప్పిన ఉదంతాలు కోకొల్లలు ఉన్నాయి. కోర్టులు హెచ్చరిస్తున్నా పోలీసులు ఖాతరు చేయలేదన్న విమర్శలు వచ్చాయి. (AP Police)
తాజాగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారన్న కారణంగా సోషల్ మీడియా యాక్టివిస్టులను అరెస్టు చేయడం మొదలైంది. అయితే, తెలంగాణ రాష్ట్రంలోనూ ఇదే విధంగా అరెస్టులు జరిగితే అక్కడి హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఆ తీర్పును సూచిస్తూ.. అక్రమ అరెస్టులకు పాల్పడితే తమకు కోర్టుల్లో చీవాట్లు తప్పవని ఏపీలో జనసేన నేతలకు పోలీసులు హితబోధ చేసిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.
ఏం జరిగింది?
ఏపీలో 30 వేల మంది అమ్మాయిలు మిస్సింగ్ అయ్యారని గతంలో పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలను వైఎస్సార్ సీపీ యాక్టివిస్టు గిరిధర్ ఓ యూట్యూబ్ ఛానల్లో గుర్తు చేశాడు. దీంతో జనసేన నేతలు అతడి షాపు వద్దకు వెళ్లి రణరంగం సృష్టించారు. అతడిపై దాడి చేసి మోకాళ్లపై కూర్చోబెట్టి దండన చేశారు. వీడియో చిత్రీకరించి క్షమాపణలు చెప్పించుకున్నారు. ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది.
తెలంగాణ హైకోర్టు తీర్పు
సెప్టెంబర్ 10, 2025న తెలంగాణ హైకోర్టు జస్టిస్ ఎన్.తుకారాంజీ ధర్మాసనం ఇచ్చిన తీర్పు, బీఆర్ఎస్ (భారత్ రాష్ట్ర సమితి) సోషల్ మీడియా యాక్టివిస్ట్ నల్ల బాలు (అలియాస్ దుర్గం శశిధర్ గౌడ్)పై దాఖలైన మూడు ఎఫ్‌ఐఆర్‌లను రద్దు చేసింది. ఈ కేసులు, కాంగ్రెస్ పార్టీ, ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని విమర్శించిన ట్వీట్లపై దాఖలయ్యాయి.
కోర్టు తీర్పు ముఖ్య అంశాలు
సోషల్ మీడియా పోస్టులపై ‘మెకానికల్’ లేదా స్వయంచాలక అరెస్టులు చేయకూడదు. సుప్రీంకోర్టు ‘అర్నేష్ కుమార్ vs స్టేట్ ఆఫ్ బిహార్’ (2014) తీర్పులోని మార్గదర్శకాలను పాటించాలి. అరెస్టు అవసరాన్ని స్పష్టంగా రికార్డ్ చేయాలి.
ఎఫ్‌ఐఆర్ దాఖలు ముందు ప్రిలిమినరీ ఇంక్వైరీ
‘లలితా కుమారి vs గవర్నమెంట్ ఆఫ్ ఉత్తరప్రదేశ్’ తీర్పు ప్రకారం, కాగ్నిజబుల్ ఆఫెన్స్‌లలో కూడా ప్రాథమిక విచారణ చేయాలి. డిఫమేషన్ (భారతీయ న్యాయ సంహిత 2023లో సెక్షన్ 356) నాన్-కాగ్నిజబుల్ ఆఫెన్స్, కాబట్టి పోలీసు నేరుగా ఎఫ్‌ఐఆర్ దాఖలు చేయకూడదు – కంప్లైనెంట్ మ్యాజిస్ట్రేట్‌ను సంప్రదించాలి.
రాజకీయ విమర్శలు రక్షణ
“హార్ష్ పొలిటికల్ క్రిటిసిజం, ఆఫెన్సివ్‌గా ఉన్నా, ఆర్టికల్ 19(1)(a)లో రక్షితం” అని కోర్టు స్పష్టం చేసింది. ఎనిమిటీ, సెడిషన్, పబ్లిక్ ఆర్డర్ థ్రెట్ వంటి కేసులకు ‘హై థ్రెషోల్డ్’ – వయలెన్స్ ఇన్‌సైట్‌మెంట్ లేకపోతే కేసు దాఖలు చేయకూడదు.
కోర్టు 8 మార్గదర్శకాలు ఇచ్చింది – కంప్లైనెంట్ లెగల్ స్టాండింగ్ వెరిఫై చేయాలి, ప్రాపోర్షనాలిటీ ప్రిన్సిపల్ పాటించాలి, మ్యాజిస్ట్రేట్ కంప్లైన్‌ట్ మాత్రమే డిఫమేషన్ కోసం, మొదలైనవి.
ఏపీ పోలీసులు జన సైనికులకు హితబోధ
తెలంగాణ తీర్పు తర్వాత, ఆంధ్రప్రదేశ్ పోలీసులు అప్రమత్తమైనట్లు తెలుస్తోంది. వైఎస్సార్ సీపీ యాక్టివిస్టు గిరిపై దాడి చేసిన జనసేన నేతతో ఓ పోలీసు సంభాషణ చేస్తూ.. సోషల్ మీడియా పోస్టులపై అక్రమ అరెస్టులు చేస్తే హైకోర్టు మమ్మల్ని చీవాట్లు పెడుతుంది.. అని హితబోధ చేశారు. అయితే, చట్టంతో మాకేం పని, మా ప్రభుత్వం అంటూ జనసేన నేతలు రెచ్చిపోయారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటామన్నట్టుగా జనసేన నేత వ్యాఖ్యానించడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
అరెస్టులపై చట్టం ఏం చెబుతోంది?
పోలీసు అధికారులు అరెస్టు ముందు ప్రిలిమినరీ ఎంక్వైరీ (14 రోజుల్లోపు, DSP అప్రూవల్‌తో) చేయాలి. ‘ఇమ్రాన్ ప్రతాప్‌గఢి vs స్టేట్ ఆఫ్ గుజరాత్’ (2025) మరియు ‘అర్నేష్ కుమార్’ తీర్పులు పాటించాలి. అరెస్టు అవసరాన్ని మ్యాజిస్ట్రేట్‌కు స్పష్టంగా తెలియజేయాలి, లేకపోతే కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ లేదా డిపార్ట్‌మెంటల్ ఎంక్వైరీ ఎదుర్కోవాలి. ఏపీలో YSRCP సపోర్టర్లు TDP నాయకులపై డిరోగేటరీ పోస్టులు చేస్తున్నారని 680+ నోటీసులు, 147 కేసులు, 49 అరెస్టులు జరిగాయి. హైకోర్టు ఇటీవల PILను డిస్మిస్ చేస్తూ “హేట్ స్ప్రెడింగ్ యాక్టివిజం కాదు” అని చెప్పింది. అక్రమ అరెస్టులు నిషేధించింది.
మొత్తానికి ఏపీ పోలీసుల హితబోధ రెండు రాష్ట్రాల్లో చర్చనీయాంశమైంది. నేతల ఆదేశాలతో చట్టాన్ని ఉల్లంఘించే పోలీసులు ఆలోచనలో పడాల్సిన పరిస్థితి ఏర్పడిందని విశ్లేషకులు చెబుతున్నారు. చంద్రబాబు ప్రభుత్వం సోషల్ మీడియాపై ఉక్కుపాదం మోపుతున్న తరుణంలో, టార్గెట్ చేసి అరెస్టులు చేస్తున్న తరుణంలో ఈ పరిణామం కీలకంగా మారనుంది.
ఇవీ చదవండి: Nepal : సోషల్ మీడియా పవర్.. నేపాల్ ప్రధాని కేపీ ఓలీ రాజీనామా
Pawan warning: వైయస్సార్ సీపీ సోషల్ మీడియాకు పవన్ కల్యాణ్ వార్నింగ్
