HomeAndhra PradeshPawan warning: వైయస్సార్ సీపీ సోషల్ మీడియాకు పవన్ కల్యాణ్ వార్నింగ్

Pawan warning: వైయస్సార్ సీపీ సోషల్ మీడియాకు పవన్ కల్యాణ్ వార్నింగ్

Pawan warning: సోషల్ మీడియాలో అసభ్యకరంగా పోస్టులు పెడుతున్న వారికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వార్నింగ్ (Pawan warning) ఇచ్చారు. వ్యక్తిగతంగా కించపరిచేలా పోస్టులు పెట్టే ముందు ఒకటికి వంద సార్లు ఆలోచించుకోవాలన్న ఆయన.. చివరికి కర్మ పట్టుకుంటుందని, తప్పించుకోలేరంటూ హెచ్చరించారు.

ఇటీవలి కాలంలో సోషల్ మీడియా కార్యకర్తలపై ఏపీ ప్రభుత్వం ఫోకస్ పెంచింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రశ్నించిన వారిని, సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్, డీసీఎం పవన్, వారి కుటుంబ సభ్యులు, ఆడవాళ్లపై గతంలో పోస్టులు పెట్టిన వారిని ఇప్పుడు కటకటాలకు నెట్టుతున్నారు పోలీసులు. దీంతో వైయస్సార్ సీపీ సోషల్ మీడియా సైనికులు భయపడుతున్నారు. ఎప్పుడు ఏ కేసులో పోలీసులు నోటీసులిస్తారో, ఫోన్లు చేస్తారో, అరెస్టులు చేస్తారోనని కాలం గడుపుతున్నారు. ఈ నేపథ్యంలో డిప్యూటీసీఎం పవన్ కీలక ట్వీట్ చేశారు.

చివరికి కర్మ పట్టుకుంటుంది!

‘‘నిర్మాణాత్మక విమర్శలు ప్రజాస్వామ్యానికి ఆరోగ్యకరం. కానీ రాజకీయ నాయకులకే కాదు ఏ వ్యక్తికైనా దుర్వినియోగాలు, హత్య బెదిరింపులు మరియు అత్యాచార బెదిరింపులు మంచిది కాదు.

ప్రజాస్వామ్యంలో, మనమందరం అనేక విషయాలపై విభేదించవచ్చు. అసమ్మతిని వ్యక్తం చేయడం ఒక పద్ధతికి పరిమితం కావాలి. కుటుంబాలు, వ్యక్తులు, కుల దూషణలు, ఒకరి విశ్వాసం, వారి దేవతలు, దేవాలయాలు, నిస్సహాయులు, సాత్వికమైన వ్యక్తులపై దాడి చేయవద్దు. మీకు కండ బలం, డబ్బు బలం, క్రిమినల్ ముఠాలు ఉన్నాయి. అలాంటి ధోరణిని ఈ భారత్‌లోని సగటు పౌరుడిని ఎప్పటికీ భయపెట్టదు.

కాబట్టి గత పాలనలోని క్రిమినల్ గ్యాంగ్‌లు, సోషల్ మీడియా దుర్వినియోగదారులందరికీ నా అభ్యర్థన ఒక్కటే. ‘మీరు దుర్వినియోగం చేసే ముందు ఒకటికి 100 సార్లు ఆలోచించండి. కర్మ మిమ్మల్ని పట్టుకుని తీరుతుంది..’ అని పవన్ ట్వీట్ చేయడం సంచలనం రేపుతోంది.

ఇవీ చదవండి: Pawan Kalyan: బయటకొస్తే ప్రజలు తిడుతున్నారు.. నేను హోంశాఖ తీసుకుంటే..
Pawan: ‘సరస్వతి పవర్’లో అటవీ భూములపై పవన్ వాకబు
Pawan in Vizianagaram: గుర్లలో చనిపోయిన ప్రతి ఒక్క కుటుంబానికీ రూ.1లక్ష
Pawan Kalyan: స్వతంత్ర సిట్ ఏర్పాటును స్వాగతిస్తున్నాం: పవన్

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు