HomeSportsRinku Singh: 5 సిక్సర్లతో మారిపోయిన జీవితం.. కాబోయే భార్య ఎమోషనల్

Rinku Singh: 5 సిక్సర్లతో మారిపోయిన జీవితం.. కాబోయే భార్య ఎమోషనల్

Rinku Singh: టీమిండియా స్టార్ క్రికెటర్ రింకూ సింగ్ ప్రస్తుతం దుబాయ్‌లో ఉన్నాడు. సెప్టెంబర్ 14న ఆసియా కప్ 2025లో భారత్-పాకిస్థాన్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ ముందు రింకూ తన వ్యక్తిగత జీవితంపై ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. ఇటీవల ఆయన తన కాబోయే భార్య ప్రియా సరోజ్తో నిశ్చితార్థం చేసుకున్నారు. మొదట నవంబర్‌లో పెళ్లి జరగాల్సి ఉండగా, ఇప్పుడు అది వచ్చే ఏడాదికి వాయిదా పడింది. అయితే ఐపీఎల్‌లో తాను కొట్టిన 5 సిక్సర్లు, ప్రియాతో తన బంధాన్ని ఎలా బలపరిచాయో రింకూ వెల్లడించాడు. Rinku Singh

5 సిక్సర్ల మ్యాజిక్
ఐపీఎల్ 2023లో కోల్‌కతా నైట్‌రైడర్స్ తరపున ఆడిన రింకూ సింగ్, గుజరాత్ టైటాన్స్‌పై అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. చివరి ఓవర్‌లో గెలవడానికి 29 పరుగులు అవసరం. మొదటి బంతికి ఉమేశ్ యాదవ్ సింగిల్ తీసి రింకూకి స్ట్రైక్ ఇచ్చాడు. అక్కడి నుంచి వరుసగా 5 సిక్సర్లు బాదిన రింకూ, అసాధ్యాన్ని సాధ్యం చేశాడు. ఆ మ్యాచ్ తర్వాత అతని పేరు దేశమంతా మార్మోగింది.

రెండు ఏళ్ల తర్వాత గుర్తు చేసుకున్న రింకూ
రాజ్ షమనీ యూట్యూబ్ ఛానెల్‌లో మాట్లాడుతూ రింకూ, ఆ సిక్సర్లు తన వ్యక్తిగత జీవితాన్నే మార్చేశాయని తెలిపాడు. ఆ సమయంలో ప్రియాకు తాను ఎవరో పెద్దగా తెలియదని, ముఖ్యంగా ఆమె తండ్రి తుఫానీ సింగ్ (మాజీ ఎంపీ, ప్రస్తుత ఎమ్మెల్యే) క్రికెట్‌పై ఆసక్తి లేకపోవడంతో తన గురించి తెలియలేదని చెప్పాడు.

అయితే ఆ ఇన్నింగ్స్ చూసిన ప్రియా చాలా ఎమోషనల్ అయ్యిందని, ఫోన్‌లో ఏడ్చిందని రింకూ చెప్పాడు. ఈ విషయాన్ని తనకు క్రికెటర్ నితీశ్ రాణా భార్య సాచి రాణా చెప్పిందని వెల్లడించాడు. అదే రోజు తన జీవితంలో కీలక మలుపు అని రింకూ అన్నాడు.

జీవితాన్ని మార్చిన ఆ ఇన్నింగ్స్
యశ్ దయాల్ బౌలింగ్‌లో వచ్చిన ఆ 5 సిక్సర్ల తర్వాత రింకూ సింగ్ రాత్రికి రాత్రే స్టార్ అయ్యాడు. ప్రజలు తనను గుర్తించడం మొదలుపెట్టారు. సోషల్ మీడియాలో ఫాలోవర్స్ సంఖ్య పెరిగిపోయింది. తాను చేసిన కష్టానికి ఫలితం ఆ మ్యాచ్‌తో దొరికిందని రింకూ సంతోషం వ్యక్తం చేశాడు.

ఇక రింకూ సింగ్ – ప్రియా సరోజ్ జంట ఈ ఏడాది జూన్‌లో నిశ్చితార్థం చేసుకున్నారు. వచ్చే ఏడాదిలో పెళ్లి జరగనుంది.

ఇవీ చదవండి: Shreyas Iyer : ఆసియా కప్‌లో ఆడే అర్హత శ్రేయస్‌కు లేదా?
Asia Cup 2025 : ఆసియా కప్‌కు టీమిండియా జట్టు ఇదే.. కెప్టెన్ సూర్య!

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు