Mirai Movie: హనుమాన్ సూపర్ బ్లాక్‌బస్టర్ తర్వాత తేజ సజ్జా విరామం తీసుకుని చేసిన సినిమా మిరాయ్. ఫాంటసీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రానికి కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించారు. రుతిక హీరోయిన్‌గా, మంచు మనోజ్ విలన్‌గా నటిస్తుండగా, అందాలతార శ్రియా శరణ్ కీలక పాత్రలో కనిపించనుంది. (Mirai Movie)
ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్లు, గ్లింప్స్ ట్రైలర్‌కి మంచి స్పందన వచ్చింది. దీంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. సెప్టెంబర్ 12న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో ఈ సినిమా రిలీజ్ అవుతోంది.
రిలీజ్‌కు కొన్ని గంటల ముందు హీరో తేజ సజ్జా తన సోషల్ మీడియాలో ఒక పోస్టు పెట్టాడు. ఆయన ఇలా రాశాడు:
“ఇంకొన్ని గంటల్లో మిరాయ్ మీ ముందుకు రానుంది. రెబల్ స్టార్ ప్రభాస్ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఆయన వల్ల ఈ సినిమా మరింత ప్రత్యేకమైంది. మీరు మాత్రం రెబలియస్ సర్ప్రైజ్‌ను మిస్ అవ్వొద్దు.”
దీంతో మిరాయ్ సినిమాలో ప్రభాస్ స్పెషల్ రోల్ ఉన్నట్టు స్పష్టమైంది. అయితే ఆయన కెమియోలో కనిపిస్తారా? లేక వాయిస్ ఓవర్ ఇస్తారా? అన్నది థియేటర్లలో మాత్రమే తెలుస్తుంది.
ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించింది. ఇదే బ్యానర్‌లో ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న ది రాజా సాబ్ కూడా రూపొందుతోంది. కాబట్టి మిరాయ్‌లో డార్లింగ్ ఎంట్రీతో ఫ్యాన్స్‌కు పండుగ కానుంది.
ఇవీ చదవండి: Teja Sajja : తేజ సజ్జా.. మార్కెట్లో పాతుకుపోయేందుకు కుర్రహీరో స్ట్రాటజీ!
PVT 04: రుద్రకాళేశ్వర్ రెడ్డిగా పంజా వైష్ణవ్ తేజ్.. ఫస్ట్ గ్లింప్స్ అదిరింది!
