HomeNationalViral video : పిల్లల్ని సన్ రూఫ్ పైకి ఎక్కిస్తున్నారా? ఈ వీడియో చూడండి!

Viral video : పిల్లల్ని సన్ రూఫ్ పైకి ఎక్కిస్తున్నారా? ఈ వీడియో చూడండి!

Viral video : సరదాగా చేసే కొన్ని పనులు క్షణాల్లో ప్రమాదకరంగా మారవచ్చని బెంగళూరులో జరిగిన ఒక సంఘటన స్పష్టం చేస్తోంది. కారు సన్‌రూఫ్‌ నుంచి బయటకు వచ్చి ఆనందించడం ఎంత ప్రమాదకరమో ఈ ఘటన తెలియజేస్తుంది. (Viral video)

బెంగళూరుకు చెందిన ఒక బాలుడు తన తల్లిదండ్రులతో కారులో ప్రయాణిస్తుండగా, నగర దృశ్యాలను చూసేందుకు సన్‌రూఫ్‌ తెరిచి బయటకు వచ్చాడు. ఈ సమయంలో రోడ్డుపై ఉన్న హెవీ వెహికల్స్‌ కంట్రోల్‌ బారియర్‌కు ఒక్కసారిగా తగిలి కారులో పడిపోయాడు.ఈ ప్రమాదాన్ని గమనించిన ఇతర వాహనదారులు వెంటనే కారును ఆపి, బాలుడిని ఆస్పత్రికి తరలించారు.

ఈ ఘటన మొత్తం వెనక వస్తున్న కారు డ్యాష్‌ కెమెరాలో రికార్డ్ అయింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది, నెటిజన్లు దీనిపై వివిధ రీతుల్లో స్పందిస్తున్నారు.తల్లిదండ్రుల జాగ్రత్తలు

ఈ సంఘటన పిల్లల విషయంలో తల్లిదండ్రుల బాధ్యత మరియు డ్రైవర్ అప్రమత్తతపై చర్చకు దారితీసింది. ప్రయాణ సమయంలో ఇలాంటి ప్రమాదాలను గుర్తుంచుకొని, పిల్లలను తల్లిదండ్రులు జాగ్రత్తగా చూసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. సన్‌రూఫ్‌ను హైవేల వంటి అడ్డంకులు లేని ప్రాంతాల్లో మాత్రమే ఉపయోగించాలని వారు సలహా ఇస్తున్నారు.

ఇవీ చదవండి: Amity University : అమిటీ వర్సిటీ.. 26 సార్లు చెంపదెబ్బలు కొట్టించిన విద్యార్థిని.. వీడియో వైరల్
TRUMP IS DEAD : ట్రంప్ ఈజ్ డెడ్ అంటూ వైరల్.. ఏం జరిగింది?

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు