Malavika Mohanan : దక్షిణ భారత చిత్ర పరిశ్రమలో తక్కువ కాలంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అందాల భామ మాళవిక మోహనన్. 2013లో మలయాళ సినిమా బట్టం బోలేతో సినీప్రవేశం చేసిన ఈ భామ, రజనీకాంత్ హీరోగా కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో వచ్చిన పెట్టాతో తమిళ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆ తర్వాత వరుసగా కోలీవుడ్‌లో అవకాశాలు అందుకుంటూ స్టార్ హీరోల సరసన నటించింది. Malavika Mohanan

ధనుష్, విజయ్ దళపతి వంటి ప్రముఖులతో స్క్రీన్ షేర్ చేసుకున్న మాళవిక, ఇప్పుడు టాలీవుడ్ వైపు అడుగులు వేస్తోంది. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న రాజాసాబ్లో ఆమె కీలక పాత్రలో కనిపించనుంది. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా కొనసాగుతోంది. దీంతో త్వరలోనే మాళవిక తెలుగు ప్రేక్షకులను మెప్పించనుందనే అంచనాలు మొదలయ్యాయి.

ఇక వ్యక్తిగత అనుభవాల విషయానికొస్తే, తన లుక్‌పై గతంలో ఎదుర్కొన్న ట్రోల్స్ గురించి మాళవిక ఓపెన్‌గా చెప్పింది. మలయాళంలో తాను చాలా సన్నగా ఉన్నందుకు ట్రోల్స్ ఎదుర్కొన్నానని, అయితే తెలుగు, తమిళంలో మాత్రం అదే విషయం కాంప్లిమెంట్స్‌గా మారిందని తెలిపింది. “బరువు తగ్గినా, పెరిగినా ఇక్కడ ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ బాలీవుడ్‌లో రాణించాలంటే స్లిమ్‌గా ఉండటం తప్పనిసరి. అక్కడ ఫిట్నెస్‌కి చాలా ప్రాధాన్యం ఉంటుంది” అని చెప్పింది.

మాళవిక చివరిసారిగా విక్రమ్ హీరోగా వచ్చిన తంగళాన్లో నటించింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద హిట్‌గా నిలిచింది. అలాగే హిందీలో సిద్ధాంత్ చతుర్వేది సరసన యాక్షన్ మూవీ యుద్రలో కూడా కనిపించింది.

ప్రస్తుతం ఆమె చేతిలో ఉన్న ప్రాజెక్టుల్లో తమిళ స్పై థ్రిల్లర్ సర్దార్ 2, ప్రభాస్‌తో చేస్తున్న రొమాంటిక్ కామెడీ హారర్ మూవీ ది రాజా సాబ్ ఉన్నాయి. ఈ రెండు ప్రాజెక్టులు పూర్తయితే, మాళవిక సౌత్‌లో మరింత స్థిరపడే అవకాశం ఉందనే చెప్పొచ్చు.
ఇవీ చదవండి: The Raja Saab Teaser : ప్రభాస్ ‘ది రాజా సాబ్’ టీజర్ రిలీజ్.. కేకో కేక
The Raja Saab: ప్రభాస్ సినిమాలో ఐకానిక్ సాంగ్‌కి రీమేక్!
HBD Prabhas: 45 టర్న్ అయిన ప్రభాస్.. చిరు, రామ్ చరణ్ సహా ప్రముఖల గ్రీటింగ్స్
