Japan : జపాన్‌లో ఒక వృద్ధురాలు రొమాన్స్ స్కామ్ బారినపడి భారీ మొత్తాన్ని కోల్పోయింది. హొక్కైడో పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, 80 ఏళ్ల మహిళ జూలైలో సామాజిక మాధ్యమాల ద్వారా ఒక వ్యక్తిని పరిచయం చేసుకున్నారు. తాను వ్యోమగామి అని చెప్పిన ఆ వ్యక్తి, నెమ్మదిగా ఆమె నమ్మకం సంపాదించాడు. Japan
తర్వాత ఒక రోజు ఆమెతో మాట్లాడుతూ, “నేను ఇప్పుడు అంతరిక్షంలో ఉన్నాను, నాకు ఆక్సిజన్ అత్యవసరం” అని చెప్పాడు. ఆక్సిజన్ కొనడానికి డబ్బు కావాలని కోరాడు. తనతో నిజాయితీతో కూడిన మానసిక అనుబంధం ఉందని నమ్మిన ఆమె, అతనికి ఆన్‌లైన్ ద్వారా రూ.6 లక్షలు పంపింది.
ఈ మోసం బహిర్గతం కావడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఇటువంటి రొమాన్స్ స్కామ్‌ల విషయంలో జాగ్రత్తగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
ఇవీ చదవండి: Telangana Crime : అన్న వరసయ్యే వ్యక్తితో యువతి ప్రేమ.. వద్దన్నందుకు!
Cyber Attack : జాగ్వార్ ల్యాండ్ రోవర్‌పై సైబర్ అటాక్.. కోట్ల విలువైన దెబ్బ!
