HomeAndhra PradeshDJ Sound : గణేష్‌ నిమజ్జన వేడుకలో విషాదం.. డీజే సౌండ్స్‌తో డ్యాన్స్‌.. యువకుడికి గుండెపోటు

DJ Sound : గణేష్‌ నిమజ్జన వేడుకలో విషాదం.. డీజే సౌండ్స్‌తో డ్యాన్స్‌.. యువకుడికి గుండెపోటు

DJ Sound : విజయనగరం జిల్లా బొబ్బాదిపేటలో గణేష్‌ నిమజ్జన ఊరేగింపు సందర్భంగా దుర్ఘటన చోటుచేసుకుంది. బుధవారం (సెప్టెంబర్‌ 3) రాత్రి వినాయక విగ్రహాన్ని ఊరేగింపుగా తీసుకెళ్తున్న సమయంలో, డీజే సౌండ్స్ మధ్యలో డ్యాన్స్‌ చేస్తున్న ఓ యువకుడు అకస్మాత్తుగా కుప్పకూలి మరణించాడు. (DJ Soungs)

మృతుడిని బొబ్బాది హరీశ్‌ (22)గా గుర్తించారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం, డీజే సౌండ్స్ శబ్దం అధికంగా ఉండటంతో, డ్యాన్స్‌ చేస్తూ ఒక్కసారిగా ఆయన కుప్పకూలిపోయారు. వెంటనే తోటి స్నేహితులు హుటాహుటీన సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, వైద్యులు అప్పటికే మరణించినట్లు ధృవీకరించారు.

హరీశ్‌ ఇటీవలే డిగ్రీ పూర్తి చేసి, హైదరాబాద్‌లో కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌ కోసం కోచింగ్ తీసుకుంటూ ఉన్నారు. వినాయక చవితి సందర్భంగా ఊరికి వచ్చిన ఆయన, నిమజ్జన వేడుకలో ప్రాణాలు కోల్పోవడంతో కుటుంబ సభ్యులు, గ్రామస్థులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.

ఈ ఘటనపై స్థానికులు స్పందిస్తూ, అధిక శబ్దంతో డీజే సౌండ్స్ వాడకం ప్రజల ప్రాణాలకు ప్రమాదకరమని, ఇలాంటి సంఘటనలు మళ్లీ జరగకుండా అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది.

ఇవీ చదవండి: Heart Attack : దేశంలో 30 శాతం పెరిగిన గుండెపోటు జబ్బు.. ఎందుకిలా?
Telangana crime news: గుండెపోటుతో 12 ఏళ్ల బాలిక మృతి.. పండుగ వేళ విషాదం

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు