HomeAndhra PradeshTirumala News : తిరుమలలో 6న అనంత పద్మనాభ వ్రతం

Tirumala News : తిరుమలలో 6న అనంత పద్మనాభ వ్రతం

Tirumala News : తిరుమల శ్రీవారి ఆలయంలో భాద్రపద మాసం శుక్ల చతుర్దశి నాడు ప్రతి ఏడూ ఆనవాయితీగా నిర్వహించే పుణ్యకాల వేడుక — అనంత పద్మనాభ వ్రతం. ఈ ఏడాది సెప్టెంబర్ 6న ఉదయం ఈ వ్రతాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ఆధ్వర్యంలో శోభాయమానంగా నిర్వహించనుంది. (Tirumala News)

ఈ సందర్భంగా ఉదయం 6 గంటలకు శ్రీవారి సుదర్శన చక్రత్తాళ్వారు ఆలయం నుండి ఊరేగింపుగా శ్రీభూవరాహస్వామి ఆలయం సమీపంలో ఉన్న పవిత్ర పుష్కరిణికి తీసుకెళ్లబడతారు. అక్కడ అర్చకులు ఆగమోక్తంగా పూజా కార్యక్రమాలు నిర్వహించి, స్వామి పుష్కరిణిలో అభిషేకాదులను నిర్వహిస్తారు. అనంతరం తిరిగి ఆలయానికి సుదర్శన చక్రత్తాళ్వార్లను వేంచేపు చేస్తారు.

అనంతుడు అంటే ఆదిశేషుడని పూరాణ గ్రంథాలు పేర్కొంటున్నాయి. ఆదిశేషుడుపై అనంతపద్మనాభస్వామివారి అవతారంలో ఉన్న శ్రీమహావిష్ణువును ప్రార్థిస్తూ గృహస్థులు సౌభాగ్యంకోసం ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. ఆదిశేషుని శ్రీమహావిష్ణువు అనంత పద్మనాభ స్వామి రూపంలో ఉన్నారనే విశ్వాసంతో, గృహస్థులు సౌభాగ్యం, శాంతి కోసమే ఈ వ్రతాన్ని శ్రద్ధగా ఆచరిస్తారు.

ఇవీ చదవండి: Tirumala News: సెప్టెంబర్ నెలలో తిరుమలలో విశేష పర్వదినాలు
Tirumala Hotels : తిరుమలలో హోటళ్ల ధరలపై ఆ ప్రచారం అవాస్తవం
Sri Padmavati: మే 6 నుండి 8వ తేదీ వరకు తిరుమలలో శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు