HomeCrime NewsTelangana: నల్గొండ కోర్టు కఠిన తీర్పు.. కామాంధులకు షాక్!

Telangana: నల్గొండ కోర్టు కఠిన తీర్పు.. కామాంధులకు షాక్!

Telangana: నల్గొండ జిల్లా పోక్సో కోర్టు సంచలనాత్మక తీర్పు వెలువరించింది. మైనర్ బాలికలపై అఘాయిత్యాలకు పాల్పడిన ఇద్దరు నిందితులకు కోర్టు కఠిన శిక్షలు విధించింది. రెండు వేర్వేరు కేసుల్లో నిందితులకు దీర్ఘకాల జైలు శిక్షలతో పాటు జరిమానాలు కూడా విధించగా, బాధిత కుటుంబాలకు ఆర్థిక పరమైన పరిహారం ఇవ్వాలని ఆదేశించింది. (Telangana)

చండూరు ఘటన – 22 ఏళ్ల జైలు శిక్ష
2018లో చండూరు మండలంలోని ఓ గ్రామంలో 11 ఏళ్ల బాలికపై గ్రామస్థుడు తిప్పర్తి యాదయ్య దారుణానికి పాల్పడ్డాడు. తల్లిదండ్రులు పనుల నిమిత్తం బయట ఉండగా ఇంట్లో ఒంటరిగా ఉన్న చిన్నారిని కత్తితో బెదిరించి అత్యాచారం చేశాడు. పోలీసుల దర్యాప్తు అనంతరం కేసు కోర్టులోకి వెళ్లింది. విచారణలో నిందితుడు దోషిగా నిర్ధారించబడటంతో కోర్టు 22 ఏళ్ల జైలు శిక్షతో పాటు రూ.35,000 జరిమానా విధించింది. బాధితురాలికి రూ.10 లక్షల పరిహారం ఇవ్వాలని కూడా ఆదేశించింది.

దేవరకొండ ఘటన – 20 ఏళ్ల జైలు శిక్ష
ఇక మరో కేసులో దేవరకొండ పరిధిలో 8 ఏళ్ల బాలికపై భాస్కరాచారి అనే వ్యక్తి అత్యాచారం చేశాడు. టీవీ చూపిస్తానని మోసపూరితంగా ఇంట్లోకి తీసుకెళ్లి చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. 2018 మార్చిలో ఈ కేసు నమోదు కాగా, దీర్ఘ విచారణ తర్వాత కోర్టు తీర్పు ఇచ్చింది. నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్షతో పాటు రూ.25,000 జరిమానా విధించింది. బాధితురాలికి రూ.10 లక్షల పరిహారం చెల్లించాలని కూడా పేర్కొంది.

న్యాయం సాధించిన బాధితులు
ఈ రెండు కేసుల్లోనూ పబ్లిక్ ప్రాసిక్యూటర్ వేముల రంజిత్ కుమార్ బలమైన వాదనలు వినిపించారు. పోలీసుల సమగ్ర దర్యాప్తుతో పాటు, సరైన ఆధారాల సమర్పణ కారణంగా నిందితులకు కఠిన శిక్షలు విధించగలిగామని తెలిపారు. కోర్టు తీర్పుతో బాధిత చిన్నారుల కుటుంబాలకు న్యాయం సాధ్యమైందని పేర్కొన్నారు.

ఇవీ చదవండి: Vikarabad Crime : అవమానించాడని.. ప్రియుడితో కలిసి భర్త హత్య!
Telangana Crime News : భార్యపై అనుమానంతో.. కూతురి ముందే భర్త ఘాతుకం
Konaseema Crime : రెండేళ్లలో 12 పెళ్లిళ్లు.. కోనసీమలో కిలాడీ లేడీ..!

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు