Fahadh Faasil: సోషల్ మీడియాలో సెలబ్రిటీలు చేసే ప్రతి చిన్న పనీ క్షణాల్లో వైరల్ అవుతుంటుంది. సినిమా అప్‌డేట్స్‌తో పాటు స్టార్ హీరోల వ్యక్తిగత విషయాలు, లైఫ్‌స్టైల్ కూడా ఎప్పుడూ హాట్ టాపిక్‌గా మారుతుంటాయి. తాజాగా మలయాళ స్టార్ హీరో, పుష్ప 2 విలన్ ఫహద్ ఫాసిల్ ఒక లగ్జరీ వాహనాన్ని కొనుగోలు చేసి మరోసారి చర్చల్లోకి వచ్చారు. (Fahadh Faasil)
కేరళలో మొదటి ఫెరారీ SUV ఓనర్
ఫహద్ ఫాసిల్ తాజాగా ఇటాలియన్ లగ్జరీ బ్రాండ్ ఫెరారీ తయారు చేసిన తొలి పెర్ఫార్మెన్స్ SUV పురోసంజ్వాను సొంతం చేసుకున్నారు. కేరళలో ఈ వాహనాన్ని సొంతం చేసుకున్న మొదటి వ్యక్తిగా నిలిచారు.
13.75 కోట్ల విలువైన లగ్జరీ SUV
సాధారణంగా ఫెరారీ మోడల్స్ ధర కోట్లలో ఉంటాయని తెలిసిందే. అయితే ఈ SUV ధర వినగానే ఎవరికైనా షాక్ అవ్వాల్సిందే. ఒకటి కాదు, రెండు కాదు.. దాదాపు ₹13.75 కోట్లు. ఈ కారును ఇప్పటికే తమిళ స్టార్ విక్రమ్, ఇండస్ట్రీ దిగ్గజం ముఖేష్ అంబానీ కూడా తమ గ్యారేజీలోకి చేర్చుకున్నారు.
ఫహద్–నజ్రియా గ్యారేజ్ కలెక్షన్
ఫహద్, నజ్రియా దంపతుల వద్ద ఇప్పటికే లగ్జరీ వాహనాల జాబితా ఉంది. వారి గ్యారేజీలో ఉన్న కొన్ని విలాసవంతమైన కార్లు:
లంబోర్గిని ఉరుస్
మెర్సిడెస్-బెంజ్ G63 AMG
రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ
ల్యాండ్ రోవర్ డిఫెండర్
పోర్స్చే 911 కారెరా
టయోటా వెల్‌ఫైర్
మినీ కంట్రీమ్యాన్
వోక్స్‌వ్యాగన్ గోల్ఫ్
ఫహద్ తాజా చిత్రం
ప్రస్తుతం ఫహద్ నటించిన ఒడుం కుతిరా చదుం కుతిరా సినిమాను థియేటర్లలో చూడొచ్చు. ఆషిక్ ఉస్మాన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై అల్తాఫ్ సలీమ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కళ్యాణి ప్రియదర్శన్ హీరోయిన్‌గా నటించింది. రేవతి పిళ్లై, వినయ్ ఫోర్ట్, లాల్, సురేష్ కృష్ణ, బాబు ఆంటోని, జానీ ఆంటోని, లక్ష్మీ గోపాలస్వామి తదితరులు కీలక పాత్రల్లో కనిపించారు. సంగీతం జస్టిన్ వర్గీస్ అందించారు.
ఇవీ చదవండి: Maruti 5 star rating car: ఫైవ్ స్టార్ సేఫ్టీ.. మారుతీ కారు ప్రత్యేకతలు తెలుసా?
Tesla car: టెస్లా అత్యాధునిక డ్రైవర్ లెస్ కారు ఆవిష్కరణ
