Maruti 5 star rating car: ఎట్టకేలకు మారుతీ కారు సేఫ్టీ విషయంలో డెవలప్ మెంట్ కనిపించింది. గ్లోబల్ NCAP క్రాష్ టెస్ట్‌లలో మారుతీ సుజుకి కారు ఫైవ్ స్టార్ సేఫ్టీ (Maruti 5 star rating car) రేటింగ్ సాధించింది. ఈ ఘనత సాధించిన మోడల్ రాబోయే డిజైర్. మారుతి సుజుకి కార్లు ఎప్పుడూ ఇండియాలో వర్తించే భద్రతా నిబంధనలకు అనుగుణంగా ఉన్నప్పటికీ, గ్లోబల్ NCAP నిర్వహించిన భద్రతా అంచనా పరీక్షల్లో అవి పేలవంగా ఉండేవి.
నాల్గవ తరం మారుతి సుజుకి డిజైర్, నవంబర్ 11న ఇండియాలో రాబోతోంది. గ్లోబల్ NCAPలో వయోజన ఆక్యుపెంట్ ప్రొటెక్షన్ కేటగిరీలో 5 స్టార్‌లను, పిల్లల ఆక్యుపెంట్ ప్రొటెక్షన్ విభాగంలో 4 స్టార్‌లను పొందింది.
పాయింట్ల పరంగా, కొత్త మారుతి సుజుకి డిజైర్ పెద్దల భద్రతలో 34కి 31.24, పిల్లల భద్రతలో 49కి 39.20 పొందింది. మారుతి సుజుకి స్వచ్ఛంద పరీక్ష కోసం డిజైర్ 2024ను గ్లోబల్ ఎన్‌సీఏపీకి సమర్పించింది.
మారుతి సుజుకి 2024లో కారు భద్రతపై ఫోకస్ పెంచింది. కొత్త డిజైర్ 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC) మరియు పాదచారుల రక్షణ ప్రమాణాలతో రాబోతోంది. మేలో మార్కెట్లోకి వచ్చిన కొత్త స్విఫ్ట్ కూడా ఈ భద్రతా ఫీచర్లను ప్రామాణికంగా కలిగి ఉండేలా చర్యలు తీసుకుంది.
2024 డిజైర్ హిల్ హోల్డ్ అసిస్ట్, EBDతో కూడిన ABS, బ్రేక్ అసిస్ట్, అన్ని సీట్లకు 3 పాయింట్ సీట్‌బెల్ట్, వెనుక డీఫాగర్, ఐసోఫిక్స్ మౌంట్‌లను స్టాండర్డ్‌గా అందిస్తోంది. కారు నిర్మాణం 45% అధిక టెన్సైల్ స్టీల్‌తో తయారు చేశారు. ఇది సరికొత్త హార్ట్‌టెక్ ప్లాట్‌ఫారమ్ (5వ తరం) ఆధారంగా తయారు చేశారు.
గ్లోబల్ ఎన్సీఏపీ డిజైర్ 2024 నిర్మాణం, ఫుట్‌వెల్ ప్రాంతాన్ని స్థిరంగా రేట్ చేసింది. “ఫ్రంటల్ టెస్ట్‌లో డ్రైవర్ డమ్మీ ఛాతీ మార్జినల్ ప్రొటెక్షన్‌ను చూపింది. పోల్ టెస్ట్‌లో పూర్తి హెడ్ ప్రొటెక్షన్, సైడ్ ఇంపాక్ట్ టెస్ట్‌లో పెద్దలకు పూర్తి రక్షణ కనిపించింది” అని గ్లోబల్ ఎన్సీఏపీ తెలిపింది. గ్లోబల్ ఎన్సీఏపీ క్రాష్ టెస్ట్ ప్రోటోకాల్‌లు అన్ని కార్లకు ఫ్రంటల్ ఇంపాక్ట్ ప్రొటెక్షన్, సైడ్ ఇంపాక్ట్ ప్రొటెక్షన్, సైడ్ పోల్ ఇంపాక్ట్ ప్రొటెక్షన్‌ను అంచనా వేస్తాయి.
2024 డిజైర్‌లో కొత్త Z12E 1.2-లీటర్ 3-సిలిండర్ పెట్రోల్ ఇంజన్ (81.58PS గరిష్ట శక్తి, 111.7Nm గరిష్ట టార్క్) ఉంది. దీనిని 2024 స్విఫ్ట్ కూడా ఉపయోగిస్తుంది. ట్రాన్స్‌మిషన్ ఎంపికలలో 5-స్పీడ్ MT మరియు 5-స్పీడ్ AMT ఉన్నాయి.
ఎలాంటి ఫీచర్లున్నాయంటే..
కొత్త డిజైర్‌లో LED DRLలతో LED క్రిస్టల్ విజన్ హెడ్‌ల్యాంప్‌లు, LED రియర్ కాంబినేషన్ ల్యాంప్స్, 15-అంగుళాల అల్లాయ్ వీల్స్, షార్క్ ఫిన్ యాంటెన్నా, బూట్ లిడ్ స్పాయిలర్, 9-అంగుళాల SmartPlay Pro+ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వైర్‌లెస్ Apple CarPlay, Android Auto, Arkamys సరౌండ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. సెన్స్, 360-డిగ్రీ కెమెరా, ఆటోమేటిక్ AC, క్రూయిజ్ కంట్రోల్, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, వెనుక AC వెంట్స్, వెనుక ఆర్మ్‌రెస్ట్, సుజుకి కనెక్ట్ ఉన్నాయి.
కొత్త మారుతి సుజుకి డిజైర్ ధర రూ.6.99 లక్షల నుంచి రూ.10 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉండవచ్చని చెబుతున్నారు. ఈ కారు హ్యుందాయ్ ఆరా, హోండా అమేజ్, టాటా టిగోర్‌లకు పోటీగా ఉంటుంది.
ఇవీ చదవండి: Car care: మన కారుపై తెలియకుండా గీతలు పడితే మనసంతా చివుక్కుమంటుంది.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే..
Tesla car: టెస్లా అత్యాధునిక డ్రైవర్ లెస్ కారు ఆవిష్కరణ
Credit card: క్రిడిట్ కార్డులు వినియోగిస్తున్నారా? ఎన్ని రకాల ఫీజులుంటాయో తెలుసా?
