HomeCinemaKrish Jagarlamudi: అందుకే హరి హర వీరమల్లు నుంచి బయటకు రావాల్సి వచ్చింది: క్రిష్

Krish Jagarlamudi: అందుకే హరి హర వీరమల్లు నుంచి బయటకు రావాల్సి వచ్చింది: క్రిష్

Krish Jagarlamudi: తెలుగు సినిమాల్లో వైవిధ్యమైన కంటెంట్‌తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు క్రిష్ జాగర్లమూడి. గమ్యం, వేదం, కృష్ణం వందే జగద్గురుం, కంచె, గౌతమీ పుత్ర శాతకర్ణి, కొండ పొలం వంటి సినిమాలతో తనకంటూ ఓ ప్రత్యేకమైన క్రియేటివ్ మార్క్ ఏర్పరుచుకున్నారు. అయితే శాతకర్ణి తర్వాత ఆయన చేసిన ప్రాజెక్టులు అంతగా విజయవంతం కాలేదు. Krish Jagarlamudi

కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో వచ్చిన మణికర్ణిక సినిమా మధ్యలోనే ఆయన తప్పుకున్న సంగతి తెలిసిందే. అదే విధంగా పవన్ కల్యాణ్ హీరోగా రూపొందుతున్న హరి హర వీరమల్లు చిత్రంలో కూడా చరిత్ర పునరావృతమైంది. కొంత షూటింగ్ పూర్తయినా చివరకు క్రిష్ ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారు.

ఇప్పుడు ఆయన కొత్తగా ‘ఘాటి’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. చింతకింది శ్రీనివాసరావు రాసిన కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో అనుష్క ప్రధాన పాత్రలో నటించింది. ఇప్పటికే అన్ని పనులు పూర్తి చేసుకున్న ఈ సినిమా సెప్టెంబర్ 5న పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది.

ఈ సందర్భంగా ఆదివారం జరిగిన ఘాటి ప్రెస్ మీట్‌లో క్రిష్‌తో పాటు నటులు విక్రమ్ ప్రభు, జగపతి బాబు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఒక విలేకరి హరి హర వీరమల్లు సినిమా గురించి ప్రశ్నించగా, క్రిష్ నిజమైన కారణం బయటపెట్టారు.

“పవన్ కల్యాణ్ అంటే నాకు ఇష్టం, ఆయనపై అపారమైన ప్రేమ ఉంది. నిర్మాత ఎ.ఎం. రత్నం గారిపైనా నాకు ఎంతో గౌరవం ఉంది. ఆయన సినిమాల పోస్టర్లు చూసి నేను డైరెక్టర్ కావాలనుకున్నా. హరి హర వీరమల్లులో నేను కొంత భాగం చిత్రీకరించాను. కానీ కోవిడ్, కొన్ని వ్యక్తిగత సమస్యల కారణంగా షూటింగ్ షెడ్యూళ్లలో మార్పులు రావడంతో నేను తప్పుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత ఆ ప్రాజెక్ట్‌ను జ్యోతికృష్ణ కొనసాగించారు,” అని క్రిష్ తెలిపారు.

జూలై 24న విడుదలైన హరి హర వీరమల్లు సినిమా మాత్రం ఆశించినంత స్థాయిలో విజయం సాధించకపోయినా, పవన్ కల్యాణ్ నటనతో మోస్తరుగా నడిచింది. నిధి అగర్వాల్ ఇందులో హీరోయిన్‌గా నటించింది.

ఇక క్రిష్ కొత్త సినిమా ఘాటిలో చైతన్య రావు, జిషు సేన్ గుప్తా, జాన్ విజయ్, రవీంద్ర విజయ్, దేవికా ప్రియదర్శిని, వీటీవీ గణేష్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.

ఇవీ చదవండి: Harihara Veeramallu Andhra Nizam Collection: హరిహర వీరమల్లు 2 రోజుల కలెక్షన్స్
Harihara Veeramallu Box Office Day 1: హరిహర వీరమల్లు తొలి రోజు కలెక్షన్స్
Harihara Veeramallu Review : హరిహర వీరమల్లు రివ్యూ.. అంచనాలకు అందుకుందా?

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు