HomeSportsShubman Gill : శుభ్‌మన్ గిల్.. 3 ఫార్మాట్లలో టీమిండియా కెప్టెన్‌?

Shubman Gill : శుభ్‌మన్ గిల్.. 3 ఫార్మాట్లలో టీమిండియా కెప్టెన్‌?

Shubman Gill : భారత క్రికెట్‌లో మళ్లీ ‘ఒకే కెప్టెన్’ విధానానికి రంగం సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఇప్పటివరకు వేర్వేరు ఫార్మాట్లకు వేర్వేరు కెప్టెన్లు ఉన్నప్పటికీ, ఇప్పుడు సెలక్టర్లు అన్ని ఫార్మాట్లకు ఒకే నాయకుడిని నియమించే దిశగా ఆలోచిస్తున్నారని తెలుస్తోంది. ఈ క్రమంలో యువ క్రికెటర్ శుభ్‌మన్ గిల్ పేరు బలంగా వినిపిస్తోంది. (Shubman Gill)

ఇటీవల టెస్ట్ కెప్టెన్‌గా గిల్ అద్భుత ప్రదర్శన కనబరిచాడు. ఇంగ్లండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌ను 2-2తో సమం చేస్తూ, తన నాయకత్వ నైపుణ్యాలను ప్రదర్శించాడు. అతని ఈ ప్రదర్శన చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్కు మరింత నమ్మకాన్ని ఇచ్చినట్లు తెలుస్తోంది. టెస్ట్ కెప్టెన్‌గా గిల్‌ను ఎంపిక చేయడంలో కూడా అగార్కర్ కీలక పాత్ర పోషించారు.

ఒకప్పుడు ధోనీ, కోహ్లీ, రోహిత్ శర్మ వంటి ఆటగాళ్లు అన్ని ఫార్మాట్లలో టీమిండియా కెప్టెన్లుగా వ్యవహరించారు. అయితే, రోహిత్ శర్మ టెస్టులు, టీ20లకు వీడ్కోలు పలకడం, ప్రస్తుతం మూడు ఫార్మాట్లకు మూడు వేర్వేరు కెప్టెన్లు ఉండటంతో, సెలక్టర్లు ఈ విధానంపై సంతృప్తిగా లేరు. ఒకే కెప్టెన్ ఉంటే జట్టులో ఐక్యత పెరుగుతుందని, భవిష్యత్ ప్రణాళికలు సులభమవుతాయని భావిస్తున్నారు.

ప్రస్తుతం:
టెస్టులు – శుభ్‌మన్ గిల్
వన్డేలు – రోహిత్ శర్మ (38 ఏళ్లు, త్వరలో రిటైర్మెంట్ అవకాశముంది)
టీ20లు – సూర్యకుమార్ యాదవ్ (34 ఏళ్లు)

భవిష్యత్తులో యువ కెప్టెన్‌ను కొనసాగించాలన్న ఆలోచనతో, 25 ఏళ్ల గిల్‌కు మూడు ఫార్మాట్ల బాధ్యతలు అప్పగించే ప్రణాళికపై చర్చలు జరుగుతున్నాయి. గిల్ ఇప్పటికే ఐపీఎల్, టెస్టుల్లో తన నాయకత్వాన్ని రుజువు చేసుకున్నాడు. త్వరలో టీ20 జట్టులోకి తీసుకుని కెప్టెన్‌గా నియమించే అవకాశం కూడా ఉందని సమాచారం.

వచ్చే నెల జరిగే ఆసియా కప్ టీ20లో గిల్ తప్పకుండా ఆడతాడు. ఆ టోర్నీ తర్వాత, అతనికి టీ20 కెప్టెన్సీ దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తోంది. దీంతో, సమీప భవిష్యత్తులో టీమిండియా శుభ్‌మన్ గిల్ నాయకత్వంలో అన్ని ఫార్మాట్లలో ముందుకు సాగే సూచనలు కనిపిస్తున్నాయి.

ఇవీ చదవండి: Shubman Gill : శుభమన్ గిల్.. టీమిండియాను మరోస్థాయికి తీసుకెళ్తాడా?
Shubman Gill: శుభ్‌మన్ గిల్‌తో ప్రేమ.. స్టార్ హీరోయిన్ ఏమందంటే..

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు