Kingdom: కింగ్‌డమ్ సినిమా థియేటర్లలో భారీ హిట్‌గా దూసుకెళ్తోంది. చాలా గ్యాప్ తర్వాత విజయ్ దేవరకొండకి ఓ మాసివ్ విజయం దక్కింది. అన్ని ఏరియాల్లోనూ ఈ మూవీకి పాజిటివ్ టాక్ వస్తోంది. థియేటర్ల వద్ద అభిమానులు ఫుల్ జోష్‌లో సెలబ్రేట్ చేస్తున్నారు. Kingdom
గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్‌లో వచ్చిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్, ఆయన కెరీర్‌లో కొత్త రూట్‌కి అడుగుపెట్టినట్టు చెప్పుకోవచ్చు. ‘‘మళ్లీ రావా’’, ‘‘జెర్సీ’’ లాంటి క్లాసిక్స్ తర్వాత గౌతమ్ ఈసారి మాస్-యాక్షన్ స్టైల్‌కి షిఫ్ట్ అయ్యారు. జూలై 31న విడుదలైన కింగ్‌డమ్ సినిమా చూసిన ప్రేక్షకులు “బ్లాక్‌బస్టర్ కొట్టేశాం!” అంటూ కామెంట్లు పెడుతున్నారు.
కేవలం ప్రేక్షకులే కాదు, పలువురు సినీ సెలబ్రిటీలు కూడా ఈ మూవీపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఇప్పటికే నేచురల్ స్టార్ నాని, దుల్కర్ సల్మాన్, కేటీఆర్ కుమారుడు హిమాన్షు ఈ సినిమాపై ప్రశంసలు తెలిపారు.
తాజాగా స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న కూడా స్పందించింది. సోషల్ మీడియాలో ఆమె చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. “ఈ సక్సెస్ నీకు, నిన్ను ప్రేమించే వారికెలా అర్థమవుతుందో నాకు తెలుసు విజయ్ దేవరకొండ.. మనం కొట్టినమ్..!” అని ట్విటర్‌లో (X) రాసింది. వెంటనే విజయ్ కూడా “మనం కొట్టినమ్!” అంటూ రిప్లై ఇచ్చాడు. ఈ ట్వీట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
ఈ సినిమాతో విజయ్ దేవరకొండ మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడు అన్నది ఓపెనింగ్ రిస్పాన్స్ చెబుతోంది. ఇప్పుడు కింగ్‌డమ్ ఫీవర్ ఫ్యాన్స్ మధ్య కొనసాగుతోంది!
ఇవీ చదవండి: Rashmika Mandanna : రష్మిక మంధన్న.. 2025-27లో బ్లాక్‌బస్టర్ లైనప్
Kingdom Review : కింగ్‌డమ్ రివ్యూ.. విజయ్ దేవరకొండ గర్జించాడా?
Kingdom : కింగ్‌డమ్ ఓవర్సీస్‌లో దుమ్మురేపుతున్న విజయ్ దేవరకొండ
Bhagyashri Borse : అదరగొడుతున్న ముద్దుగుమ్మ.. రెడీ ఫర్ కింగ్‌డమ్!
Vijay Rashmika: లంచ్ డేట్‌లో విజయ్ దేవరకొండ, రష్మిక.. ఫొటో వైరల్
Rashmika: I4Cs నేషనల్ బ్రాండ్ అంబాసిడర్‌గా రష్మిక.. డీప్ ఫేక్‌పై కామెంట్స్!
