Kingdom : విజయ్ దేవరకొండ హీరోగా నటించిన తాజా చిత్రం ‘కింగ్‌డమ్’ విడుదలకు ముందు నుంచే మంచి హైప్ క్రియేట్ చేస్తోంది. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ మరియు ఫార్చూన్ ఫోర్ సినిమాస్ సంస్థలు కలిసి నిర్మించాయి. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సూర్యదేవర నాగ వంశీ మరియు సాయి సౌజన్య నిర్మాణ బాధ్యతలు చేపట్టారు. (Kingdom)
ఈ సినిమాలో భాగ్యశ్రీ బోర్సే, సత్యదేవ్, వెంకటేష్ కీలక పాత్రలు పోషిస్తుండగా, మ్యూజిక్ డిపార్ట్‌మెంట్‌ను అనిరుధ్ రవిచందర్ పట్టు బిగించింది. ట్రైలర్, సాంగ్స్ అన్నీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఇదే కారణంగా సినిమాపై అంచనాలు మామూలుగా లేవు. జూలై 31న థియేటర్లలో విడుదల కాబోతున్న ఈ సినిమా, రిలీజ్ ముందు నుంచే ఓవర్సీస్ మార్కెట్‌లో సత్తా చాటుతోంది.
ఓవర్సీస్ ప్రీమియర్లలో రికార్డ్ సృష్టించిన కింగ్‌డమ్:
యూఎస్‌లో జూలై 30న ప్రీమియర్ షోలు ప్లాన్ చేయగా, ఇప్పటివరకు అక్కడ 20 వేలకు పైగా టికెట్లు అమ్ముడుపోయినట్టు మేకర్స్ తెలిపారు. ఇదే కాకుండా, కెనడాలో 1534కి పైగా టికెట్లు ఇప్పటికే సేల్ అయినట్లు సమాచారం. ఇండియాలో బుక్ మై షో వేదికగా లక్షకు పైగా టికెట్లు ఇప్పటికే అమ్ముడవ్వడం విశేషం. ఈ వివరాలను చిత్రబృందం స్వయంగా సోషల్ మీడియాలో షేర్ చేశారు.
విజయ్ మాస్ లుక్, హై ఎమోషనల్ కంటెంట్:
ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ చాలా కాలం తర్వాత మాస్, రగ్గడ్ లుక్‌లో కనిపించనుండటం అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ట్రైలర్‌లో ఆయన, సత్యదేవ్ మధ్య ఉన్న ఎమోషనల్ సీన్లు, యాక్షన్ ఎలిమెంట్స్ ప్రేక్షకులను బాగా కనెక్ట్ అయ్యేలా చేశాయి. ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో విజయ్ స్పష్టంగా చెప్పారు – “అభిమానులు కోరుకున్న విజయం కింగ్‌డమ్‌తోనే వస్తుంది.”
ఈ పోరాటానికి సిద్ధంగా ఉన్నట్టుగా, విజయ్ దేవరకొండ ఇప్పుడు మరోసారి తన మార్క్ చూపించబోతున్నాడు!
ఇవీ చదవండి: Kingdom: విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ కౌంట్ డౌన్.. భాగ్యశ్రీబోర్సే
Bhagyashri Borse: రామ్ సరసన భాగ్యశ్రీ బోర్సే.. RAPO22 ఎప్పుడంటే?
Bhagyashri Borse : అదరగొడుతున్న ముద్దుగుమ్మ.. రెడీ ఫర్ కింగ్‌డమ్!
Kayadu Lohar : కాయడు లోహర్.. వరుస ఆఫర్లతో ముద్దుగుమ్మ బిజీ!
