మంగళవారం, 20 అక్టోబర్ 2026 --:--:-- | 📍 వాతావరణం తెలుసుకుంటోంది...
Sports

Mohammed Siraj : మహ్మద్ సిరాజ్ అదరహో.. రెండు వికెట్లు.. వీడియో వైరల్!

Keerthanaa News Deskప్రచురణ తేదీ: శనివారం, 5 జూలై 2025
Mohammed Siraj

Mohammed Siraj : ఇంగ్లాండ్ పర్యటనలో మొదటి టెస్టులో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయిన టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్‌పై విమర్శలు వెల్లువెత్తాయి. సోషల్ మీడియాలో అభిమానులు ఆయనను రెండో టెస్టుకు ఎంపిక చేయవద్దని డిమాండ్ చేశారు. అయితే బుమ్రా ‘వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్’ కారణంగా మ్యాచ్‌కు దూరంగా ఉండడంతో, సిరాజ్‌కు మళ్లీ అవకాశమొచ్చింది. (Mohammed Siraj) ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ సిరాజ్ అద్భుత ప్రదర్శనతో అందర్నీ ఆశ్చర్యపరిచాడు.

భారత జట్టు మొదటి ఇన్నింగ్స్‌లో భారీగా 587 పరుగులు సాధించింది. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన ఇంగ్లాండ్‌కు భారత బౌలర్లు దిమ్మతిరిగే షాకిచ్చారు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. మూడో రోజు ప్రారంభానికే సిరాజ్ జాదూ చూపించాడు.

మూడో రోజు 22వ ఓవర్‌లో సిరాజ్ వేసిన మూడో బంతికి జో రూట్ ఔటయ్యాడు. లెగ్ సైడ్‌కు వెళ్లే బంతిని వికెట్ కీపర్ రిషబ్ పంత్ అందుకుని అవుట్‌గా తేల్చాడు. రూట్ 22 పరుగులు చేశాడు. వెంటనే క్రీజులోకి వచ్చిన ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్‌కి మాత్రం సిరాజ్ స్వాగతం ఘోరంగా దక్కింది — తొలి బంతికే పంత్ చేతికి క్యాచ్ ఇచ్చి గోల్డెన్ డక్‌ అయ్యాడు.

ఈ రెండు బంతుల్లో రెండు కీలక వికెట్లు సాధించిన సిరాజ్‌పై సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది. హ్యాట్రిక్‌ వికెట్ ఆశించిన అభిమానులకు కొంత నిరాశే ఎదురైంది. ఎందుకంటే తర్వాతి బంతికి జేమీ స్మిత్ ఫోర్ కొట్టి హ్యాట్రిక్‌ను దెబ్బతీశాడు. అయినా రెండు కీలక వికెట్లు తీసి మ్యాచ్‌ను భారత్ వైపు తిప్పే కీలక ఘట్టాన్ని సృష్టించిన సిరాజ్ ప్రదర్శనకు ‘అదరహో!’ అనే కామెంట్లే వినిపిస్తున్నాయి.

Star Sports కూడా సిరాజ్ బౌలింగ్‌ను హైలైట్ చేస్తూ ట్వీట్ చేసింది —
“That’s two in twooooo 🔥🔥… బెన్ స్టోక్స్‌కి గోల్డెన్ డక్! యెహ్ సీఖ్నే నహీ, సీఖానే ఆయే హై 😎👊🏻” అంటూ వీడియో షేర్ చేసింది.

సిరాజ్ ఈ దశలో చూపిన స్పెల్‌ భారత్ విజయం దిశగా సాగేందుకు బలం చేకూర్చింది. భారత్‌కు ఇదో జైపథం ఖరారు చేసే కీలక మోమెంట్‌గా నిలిచింది.

ఇవీ చదవండి: IND vs ENG: టీమిండియాకు షాక్.. రెండో టెస్టుకు కీలక ప్లేయర్ దూరం?
Eng vs Ind : సెంచరీలతో చెలరేగిన భారత యువ బ్యాటర్లు.. తొలి టెస్ట్ ఫస్ట్ డే హైలెట్స్

ట్యాగ్స్: , , , , , , , , ,
AIతో కథనాన్ని సంక్షిప్తంగా చదవండి

ఎంపిక చేసిన AI సేవలో ఈ కథనం లింక్‌తో సమ్మరీ తెరుచుకుంటుంది.

Discover more from keerthanaanews.com

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading