HomeAndhra PradeshYS Sharmila: షర్మిల కంట తడి.. అన్నపై హాట్ కామెంట్స్.. దౌర్భాగ్యుడు, శాడిస్ట్ అంటూ... పూర్తి...

YS Sharmila: షర్మిల కంట తడి.. అన్నపై హాట్ కామెంట్స్.. దౌర్భాగ్యుడు, శాడిస్ట్ అంటూ… పూర్తి ప్రసంగం ఇదీ

YS Sharmila: కాంగ్రెస్ ఏపీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల కంట తడి పెట్టుకున్నారు. తన సోదరుడు, మాజీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డిపై ఆమె తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశారు. మీడియా సమావేశంలో మాట్లాడిన ఆమె.. (YS Sharmila) ఆస్తుల గొడవ గురించి తన వర్షన్ వినిపించారు.

‘‘ఆస్తుల వివాదం గురించి విజయమ్మ గారు మాట్లాడతారో లేదో విజయమ్మ గారే డిసైడ్ చేసుకోవాలి. నిన్న సుబ్బారెడ్డి గారు మీడియా ముందు మాట్లాడారు. ఇప్పుడిప్పుడే ప్రజలు కల్తీ లడ్డూ గురించి మర్చిపోతున్నారు. మరి ఇప్పుడు సుబ్బారెడ్డి గారు నా గురించి ఎందుకు మాట్లాడతారా అనుకున్నా. నిజానికి సుబ్బారెడ్డి గారు ఏం మాట్లాడారో ఒకసారి చూసి చెబుతా. సుబ్బారెడ్డి గారు ఎవరు? సుబ్బారెడ్డి గారు జగన్ మోహన్ రెడ్డి గారు మోచేతి నీళ్లు తాగేవాళ్లు. సుబ్బారెడ్డి గారు జగన్ మోహన్ రెడ్డి గారి పక్కన ఉన్నారు. జగన్ మోహన్ రెడ్డి గారు పదవులిస్తే అనుభవిస్తున్నారు. మరి ఆయన ఇలా కాక ఎలా మాట్లాడతారు. (YS Sharmila)

సుబ్బారెడ్డి గారు, ఆయన కొడుకు ఆర్థికంగా కూడా జగన్ మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో గొప్పగా లాభపడ్డారు. ఇలా కాకుండా ఎలా మాట్లాడతారు? ఒక సుబ్బారెడ్డి గారే కాదు. రేపు సాయిరెడ్డి గారు కూడా మాట్లాడొచ్చు. ఎందుకంటే సాయిరెడ్డి గారు కూడా వాళ్ల టీమ్ లోనే ఉన్నాడు. వాళ్ల మోచేతి కిందే ఉన్నాడు. రేపు వాళ్లు మాట్లాడిన ఆశ్చర్యపోనవసరం లేదు. కానీ తెలిసి కూడా సుబ్బారెడ్డి గారు అయినా, సాయిరెడ్డి గారు అయినా జగన్ మోహన్ రెడ్డి గారి తరఫున ఉన్నారని తెలిసినా కూడా నిన్న నేను రాసిన లెటర్ లో వాళ్ల పేర్లను చేర్చాను. (YS Sharmila)

ఎందుకంటే వాళ్లలో ఏమైనా నిజాయితీ ఏమైనా మిగిలి ఉందా? అని చూద్దామని, ప్రజలకు అర్థమయ్యేటట్టు చెబుదామని. అమ్మ కూడా చూడాలని. వీళ్లకు మొత్తం నిజం తెలుసు. రాజశేఖరరెడ్డి గారికి తెలుసు. ఆయన మనోభావాలు తెలుసు. ఆశయాలు తెలుసు. అయినా కూడా ఈరోజు ఇంత దిగజారి పోయి మాట్లాడుతున్నారంటే వాళ్ల నిజ స్వరూపం బయట పడాలనే నేను వాళ్లను ఇన్ క్లూడ్ చేశాను. ముఖ్యంగా అమ్మకు అర్థం కావాలని. నా మటుకు నేనైతే నేను చెబుతున్నది నిజం అని నేను ప్రమాణం చేయగలను. సుబ్బారెడ్డి గారు కూడా ఆయన చెబుతున్నది నిజం అని ప్రమాణం చేయగలడా?

రాజశేఖరరెడ్డి బిడ్డ.. తన బిడ్డల మీద ప్రమాణం చేసి చెబుతోంది ఈరోజు. రాజశేఖరరెడ్డి గారు ఉన్నప్పుడు భారతీ సిమెంట్స్, సాక్షి అయితేనేమి ఇలాంటి వాటిలో నలుగురు బిడ్డలకూ సమాన వాటా ఉండాలన్నది రాజశేఖరరెడ్డి గారి మాండేట్.ఇది నిజం అని నా బడ్డల మీద నేను ప్రమాణం చేసి చెబుతున్నా. ఇదే కాదు. రాజశేఖరరెడ్డి గారు బతికుండగా ఆఖరి రోజుల్లో నాన్న ఒకరోజు పాపకి ఇంకా తన ఆస్తులు, షేర్స్ పాప పేరు మీదకు ఇంకా ట్రాన్స్ ఫర్ అవ్వలేదని బాధపడి అడిగితే ఆరోజు జగనన్న గారు మూడు అడుగుల కంటే తక్కువ దూరంలో కూర్చున్న జగనన్న గారు నాన్నకు ఇచ్చిన మాట.. నాన్నా.. ఈ లోకంలో నీ తర్వాత పాప మేలు కోరే వాళ్లలో నేను మొదటి వాడిని అన్నాడు. డోన్ట్ వర్రీ డాడ్ అన్నాడు. ఇది నిజం అని నా బిడ్డల మీద నేను ప్రమాణం చేసి ఈరోజు చెబుతున్నా. (YS Sharmila)

మరి సుబ్బారెడ్డి గారు కూడా తన బిడ్డల మీద, తన మనవళ్ల మీద ప్రమాణం చేసి నిన్న తాను చెప్పిన విషయాలన్నీ నిజం అని చెప్పగలరా? లేదా జగన్ మోహన్ రెడ్డి గారు తన బిడ్డల మీద ప్రమాణం చేసి చెప్పగలరా? సుబ్బారెడ్డి గారు అన్న మాట.. భారతికి అయితేనేమి, జగతికి అయితేనేమి వాళ్ల పేర్లు పెట్టుకున్నారట, వాళ్ల పేర్లు పెట్టుకునేటట్టు ఆరోజు కుదిరింది కాబట్టి ఆ ఆస్తులన్నీ జగన్ మోహన్ రెడ్డి గారివి, భారతి గారివేనట. ఆరోజు ఆ పేర్లు పెట్టుకోగలిగారంటే కారణం మేం అభ్యంతరం చెప్పలేదు కాబట్టి. రాజశేఖరరెడ్డి గారు సరే ఏదో ఈ పేర్లు పెట్టుకుంటామని ముచ్చటపడుతున్నారు కాబట్టి.. పేర్లు పెట్టుకున్నంత మాత్రాన ఏం నష్టములే అని రాజశేఖరరెడ్డి గారు అనుమతించారు కాబట్టి ఆరోజు ఆ పేర్లు పెట్టుకోవడం వీలైంది.

పేర్లు పెట్టుకున్నంత మాత్రాన ఆస్తులు మొత్తం వాళ్లవేనని రూల్ ఏమైనా ఉందా? ఆస్తులన్నీ జగన్ మోహన్ రెడ్డి గారివి కాబట్టే ఆయన జైలుకు వెళ్లాలి కదా అని సుబ్బారెడ్డి గారు అన్నారు. మరి ఆ లెక్కన ఆస్తులు భారతి గారివి అయితే భారతి గారు కూడా జైలుకు వెళ్లాలి కదా.? మరి ఇన్ని రోజులు షేర్లు, ఆస్తులు భారతి గారి పేరు మీద ఉన్నా కూడా ఆమె జైలుకు వెళ్లలేదు కదా. ఆస్తులు ఉన్నంత మాత్రాన జైలుకు వెళ్లాలి అని రూలేం లేదు. ఆపరేషన్స్ ఎవరు చేశారు అనేది చూసి వాళ్ల మీద కేసులు ఉంటే ఉండొచ్చు. సుబ్బారెడ్డి గారు మాట్లాడే ముందు ఒకసారి ఆలోచించి ఉంటే బాగుండేది.

ఎవరైనా ఒక గిఫ్ట్ ఇచ్చేది ఉంటే ఆ గిఫ్ట్ కోసం ఒక ఎంఓయూ రాసుకుంటారా? అని సుబ్బారెడ్డిని అడుగుతున్నా. మీరు ఎంఓయూ రాశారు అంటే అర్థం ఏమిటి? మీకు ఇవ్వాల్సిన ఆబ్లిగేషన్ ఉంది కాబట్టి ఎంఓయూ రాశారు. మీకు ఇవ్వాల్సిన బాధ్యత ఉంది అని మీకు తెలుసు కాబట్టి మీరు ఎంవోయూ ఇచ్చారు. సుబ్బారెడ్డి గారు సమాధానం చెప్పాలి. అది కూడా తన చేతుల్లో లేని ఆస్తుల గురించి ఎంఓయూ ఇచ్చాడట. ఎవరూ అలా ఇవ్వరు. ఎంఓయూ ఇచ్చారు అంటేనే వాళ్లు ఆబ్లిగేట్ అయ్యారు కాబట్టే ఎంఓయూల మీద సంతకాలు పెట్టడం జరిగింది. వాళ్ల బాధ్యత తెలుసు కాబట్టే ఆరోజు ఎంఓయూ రాయడం, సంతకం పెట్టడం జరిగింది. (YS Sharmila)

అలాగే ఎంఓయూలో ఉన్న క్లాజ్ నంబర్ 4.2లో చాలా స్పష్టంగా సరస్వతి షేర్స్ అటాచ్ కాలేదు కాబట్టి వెంటనే ట్రాన్స్ ఫర్ చేస్తాము.. (ట్రాన్స్ ఫర్ అనే పదాన్ని అండర్ లైన్ చేస్తున్నాను) సైన్ చేస్తున్న ఎంఓయూ రిజిస్ట్రేషన్ అయిన వెంటనే ట్రాన్స్ ఫర్ చేస్తామని ఎందుకు రాశారు? మీకు తెలుసు అది అటాచ్ కాలేదని, ట్రాన్స్ ఫర్ చేయొచ్చు అని, చెయ్య గలము అని, చెయ్యాలి అని, మీ బాధ్యత అని, మీ ఆబ్లిగేషన్ అని మీకు తెలుసు. ఇవన్నీ తెలిసి కాదా ఆరోజు ఎంఓయూ చేసింది మీరు.

చాలా బాధేసింది. జగన్మోహన్ రెడ్డిగారు చాలా సునాయాసంగా.. సులువుగా.. అన్ని ఇళ్లల్లో ఉండేదే.. ఘర్ ఘర్ కీ కహానీ అన్నారు. కన్నతల్లిని కోర్టుకు ఈడ్జడం ఘర్ ఘర్ కీ కహానీనా? ఇది ప్రతి ఇంట్లో జరిగే విషయమా? ఇక్కడ కన్నతల్లి మీద కేసు పెట్టిన దౌర్భాగ్యుడు ఎవరన్నా ఉన్నారా? ఈ గదిలో…

అంత సులభంగా మీరు మాట్లాడగలుగుతున్నారంటే.. మీకు మానవత్వం లేదా? మీకు ఎమోషన్స్.. సెంటిమెంట్స్ లాంటివి లేవా? ఒక సజ్జలగారు మాట్లాడితేనో.. పేర్ని మాట్లాడితేనో.. సాక్షిలో రాస్తేనో నేను పట్టించుకోను.. కానీ నిన్న సుబ్బారెడ్డి చిన్నాన్న మాట్లాడాడంటేనే నా కళ్లల్లో నీళ్లు తిరిగాయి.. నా బిడ్డలు మీ కళ్లముందు పెరగలేదా? వారు మిమ్మల్ని తాతా అని పలకరించలేదా? ఎందుకు నా బిడ్డలకు అన్యాయం చేయాలనుకున్నారు? ఏది నిజమో.. ఏది నిజం కాదో మీకు తెలియదా? ఆత్మపరిశీలన చేసుకోవాలి. దేవుడున్నాడు. చూస్తున్నాడు..నాన్న కూడా స్వర్గంలో బతికున్నాడు.. చూస్తున్నాడు. గుర్తుంచుకోవాలి. (YS Sharmila)

వైసీపీ క్యాడర్ కు కూడా నేనోమాట చెప్పాలనుకున్నా… వైసీపీ నాయకులు, కార్యకర్తలు సమాధానం చెప్పాలి. 2019లో వైసీపీ 175 స్థానాలకు గాను 151 స్థానాల్లో విజయం సాధించింది. అది అఖండ విజయం. ఇది ఎలా సాధ్యమైంది. ఎంతో మంది రాజశేఖర్ రెడ్డి గారి అభిమానులు వైయస్సార్ ఆశయాలు నిలబడతాయని భావించి.. ఎన్నో త్యాగాలు చేస్తే ఈ విజయం సాధ్యమైంది. నేనో.. అమ్మా మాత్రమే త్యాగం చేస్తేనే ఇది సాధ్యమైందని నేను చెప్పడం లేదు.. ఎంతో మంది త్యాగాలు చేశారు. నేను అమ్మా కూడా చేతనైనదానికంటే ఎక్కువ చేశాం..

అమ్మకు మాకాళ్ల నొప్పులున్నాయి.. పాదాలలో నొప్పులున్నాయి.. క్యాంపెయిన్ లో రాత్రులు భరించలేక అమ్మ ఏడ్చేది.. ఏదో ఒక విధంగా మేనేజ్ చేసేది..నేను కూడా 3200 కి.మీ. పాదయాత్ర చేశా. పాదయాత్రకు వెళ్లు అంటేనే వెళ్లిపోయా.. పాదయాత్రకే కాదు.. సూర్యునివరకు వెళ్లు అన్నా… నా ప్రాణాలు పోతాయని తెలిసినా.. నా ప్రాణాలు పోతాయని తెలిసినా నేను వెళ్లిపోయేదాన్ని. జగనన్నఅంటే నాకు అంత ప్రాణం. మరి వైసీపీ నాయకులు, కార్యకర్తలను అడుగుతున్నా…నేను ఏం తక్కువ చేశా? ఏం తప్పు చేశా.? ఒక్క కారణం చెప్పండి.. నేను జగన్మోహన్ రెడ్డిగారి కోసం బై ఎలక్షన్స్ కోసం అమ్మా నేను తిరిగాం. ఎంతో మందిని గెలిపించుకున్నాం.. సమైక్యాంధ్ర కోసం తిరిగాం.. తెలంగాణలో ఓదార్పుయాత్ర కోసం తిరిగాను.. 3200 కి.మీ. పాదయాత్ర చేశా. రెండు ఎలక్షన్స్ లో క్యాంపెయిన్ చేశా..

బైబై బాబు.. క్యాంపెయిన్ అయితే .. ఆ ఎలక్షన్ కు సంబంధించి ద బెస్ట్ క్యాంపెయిన్ ఇన్ ఇండియా అని పీకే గారు అన్నారు. నేను జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఇన్ని చేశాను కదా… మరి నా కోసం జగన్మోహన్ రెడ్డిగారు ఏం చేశారు. ఒక్కటైనా చేశారు? ఒక్క మేలైనా చేశారా? జగన్మోహన్ రెడ్డిగారి జన్మంతటికీ.. తన చెల్లెలి కోసం ఇది చేశానని జగన్మోహన్ రెడ్డిగారు చెప్పగలరా? జగన్మోహన్ రెడ్డిగారు నాకు, నా బిడ్డలకు అన్యాయం చేస్తున్నారన్నది పచ్చి నిజం . ఇది దేవునికి తెలుసు.. అమ్మకు తెలుసు.. నాన్నకు తెలుసు.. చాలా మందికి తెలుసు.

అలాంటి నాయకుడిని మీరు మోస్తున్నారు. అలాంటి జగన్మోహన్ రెడ్డిగారిని వైసీపీ క్యాడర్ ఎత్తి పట్టుకుంది. ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పండి? ఐదేళ్లకు ఎంవోయు నా చేతుల్లో ఉంది. ఎంవోయులో ఈ ఆస్తులు నావి అని వారు సంతకాలు పెట్టారు.. ఐదేళ్లు ఎన్ని అవసరాలు ఉన్నా.. ఎంత కష్టమొచ్చినా వాటిని నేను బయట పెట్టలేదు.. వాడుకోలేదు. అవి బయటికి వస్తే.. నలుగురు వైయస్సార్ కుటుంబం గురించి నాలుగు రకాలుగా మాట్లాడుతారని.. ఎంవోయులో నా చేతిలో ఉన్నా.. ఒక్క మీడియా హౌస్ కి పోలేదు.. కోర్టు మెట్లెక్కలేదు.

అలాంటి ఎంవోయు.. ఈ రోజు ఇంత మంది చేతుల్లో ఉంది అంటే దానికి కారణం ఎవరు? ఈ రోజు విజయమ్మగారిని కోర్టుకు ఈడ్చారు అంటే దానికి కారణం ఎవరు? ఒక కొడుకే తన తల్లిని కోర్టుకు ఈడ్చడం అంటే దుర్మార్గం కాదా? అయినా ఆ తల్లి అలాంటి కొడుకును ఎందుకు కన్నాను.. అలాంటి కొడుకును చంపేస్తే బాగుండేది చిన్నప్పుడు అని ఆమె మాట్లాడడం లేదు. నేను ఇది చూడటానికే బతికున్నానా అని మాట్లాడుతుంది.

జగన్ గారి బెయిల్ రద్దు అవుతుంది కాబట్టి అమ్మను కోర్టుకు ఈడ్చాను అంటున్నారు.. అంటే జగన్ గారికి లబ్ది చేకూరుతుంది అంటే తల్లిని కోర్టుకు ఈడ్చవచ్చా? అదే కదా జగన్ గారు చేసింది.. తనకి లాభం జరుగుతుంది అంటే తల్లిని కోర్టుకు ఈడ్చారు.. అప్పుడు రాజశేఖర్ రెడ్డిగారు పేరు కూడా ఎఫ్ఐఆర్ లో చేర్చకపోతే.. రాజశేఖర్ రెడ్డి గారి పేరు ఛార్జీషీట్ లో లేకపోతే జగన్ గారు బయటపడడం అసాధ్యం అని పొన్నవోలు సుధాకర్ గారు మూడు కోర్టుల చుట్టూ తిరిగి రాజశేఖర్ గారి పేరును సీబీఐ ఛార్జీషీట్ లో చేర్పించారు..

అలాంటి వ్యక్తికి జగన్ గారు సీఎం అయిన వెంటనే ఏఏజీ పదవిని ఇచ్చారు ..ఎందుకంటే జగన్ గారి సూచన మేరకే ఇది జరిగింది కాబట్టి.. అంటే తనకు లాభం జరుగుతుంది అనుకుంటే అమ్మను కోర్టుకు ఈడ్చుతారు. తనకు లాభం జరుగుతుంది అనుకుంటే నాన్న పేరును ఎఫ్ఐఆర్ ఛార్జీషీట్లో చేర్పిస్తారు..ఇది కాదా జగన్ గారు చేసింది.. తనకు మేలు జరుగుతుంది అనుకుంటే చెల్లెల్ని వాడుకుంటారు. తనకు అవసరం లేదు అనుకుంటే తొక్కేస్తారు.. వైయస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజు ఇంతమంది ముందు నిలబడి నేను ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నాను అంటే.. దానికి కారణం తప్పు చేసింది నేను కాదు అని నాకు తెలుసు కాబట్టి.. మరి మీరు వెంబడిస్తున్నవారు జగన్ గారు.. మీ నాయకుడో.. లేక శాడిస్టో మీరు ఆలోచించుకోవాలి.’’ అని వైయస్ షర్మిల కామెంట్స్ చేశారు.

ఇవీ చదవండి: Rachamallu: షర్మిలమ్మా.. నువ్వు చెప్పేవన్నీ అబద్ధాలేనమ్మా!
Sharmila on Jagan: షర్మిల కౌంటర్.. ఇది సామాన్యం కాదు జగన్ సార్!
Jagan vs Sharmila: జగన్ వర్సెస్ షర్మిల.. ఆస్తుల గొడవల్లో అసలేం జరిగింది?
Sharmila: కరెంటు చార్జీల భారం ఉపసంహరించుకోవాలి

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు