HomeAndhra PradeshPawan Kalyan : పాకిస్తాన్ వెళ్లిపోండి.. పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు!

Pawan Kalyan : పాకిస్తాన్ వెళ్లిపోండి.. పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు!

Pawan Kalyan : పహల్గామ్ టెర్రరిస్ట్ అటాక్ నేపథ్యంలో మృతి చెందిన వారికి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మంగళగిరిలో ఓ కన్వెన్షన్ హాలులో సంతాప కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పవన్ (Pawan Kalyan) మాట్లాడారు.

‘‘పహల్గామ్ (Pagalgam Terror Attack) ప్రకంపనలు దేశమంతా పాకాయి. దేశం మొత్తాన్ని ఈ ఘటన కలచివేసింది. ఐడీ కార్డులు అడిగి హిందువా, ముస్లింవా అని అడిగి క్రూరంగా చంపేశారు. షికారుకు వచ్చినట్లు వచ్చి మనుషుల్ని వేటాడేవారు ఆ రాక్షసులు. పహల్గాం ఉగ్రదాడి ఘటనలో జనసేన కార్యకర్తను కోల్పోయాం. బొట్టు వల్ల తీవ్రవాదులకు దొరికిపోయామని మధు భార్య చెప్పారు. ఉగ్రవాదులు ఎంత క్రూరంగా చంపారో అర్థమవుతోంది.

సరిహద్దు నియంత్రణ వద్ద విధులు చాలా కష్టం. ఉగ్రవాదులను ఎలాంటి పరిస్థితుల్లో ఉపేక్షించవద్దు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలి. దేశంలో ఎప్పుడైనా ముస్లింలపై చిన్నచూపు చూశామా? కాశ్మీర్ పండిట్ లు వలస పోయేలా చేశారు. 1989లో పరిస్థితి దారుణంగా తయారైంది. కాశ్మీర్ భారత్ లో భాగమే. జనసేన ఉన్నది తెలుగు రాష్ట్రాల్లో..కానీ విధానం జాతీయవాదం.

భారత్ లో ఉంటూ పాకిస్తాన్ ను ప్రేమిస్తాం అంటారు. వీళ్లంతా కాంగ్రెస్ నాయకులు. పాకిస్తాన్ పై ప్రేమ ఉంటే భారత్ ను వదిలి వెళ్లండి. మత ప్రాతిపదికన 26 మందిని చంపినా పాక్ కు అనుకూలంగా మాట్లాడటం సరికాదు. పాక్ కు అనుకూలంగా మాట్లాడాలంటే పాకిస్థాన్ కు వెళ్లిపోండి. కాశ్మీర్ మనది కాబట్టే అక్కడికి వెళ్లామని మధు భార్య చెప్పారు. చనిపోయిన మధుసూదన్ రావు ఎవరికి హాని చేశారు.

కుటుంబాన్ని తీసుకుని కాశ్మీర్ కు వెళ్తే చంపేశారు. మత ప్రాతిపదికన చంపడం సరికాదు..సెక్యులరిజం అంటే ఇది కాదు. ఉగ్రవాదం, హింసపై అందరూ ఒకేలా స్పందించాలి. ఇలాంటి విషయాలపై ఓట్లు, సీట్ల కోసం మాట్లాడకూడదు. తప్పు జరిగినప్పుడు తప్పు అని చెప్పాలి. సత్యం మాట్లాడాలంటే చాలా ధైర్యం కావాలి. రేపు యుద్ధ పరిస్థితులు వచ్చినా సిద్ధంగా ఉండాలి. సత్యంపై ఆధారపడి ఉండాలి

మతసామరస్యం చాలా అవసరం. మతకలహాలు సృష్టించేవారిపై అప్రమత్తంగా ఉండి ఎదుర్కోవాలి. ముస్లింలపై వివక్ష చూపిస్తే ఇంతమంది ఇక్కడ ఎలా ఉంటారు. శరణార్థులు దేశానికి అదనపు భారం. జాతీయ సమస్యలు మనవే అనుకోవాలి. హిందువులకు ఉన్న దేశం ఇదొక్కటే. ఇక్కడ కూడా ఉండొద్దంటే ఎక్కడికి పోవాలి. ఇలాంటి సమయంలో ఉగ్రవాదానికి మతం చూడొద్దు.

ఉగ్రవాదులపై మాట్లాడితే ప్రాణాలు పోతాయనే భయం కొంతమంది నేతల్లో ఉంది. నాకు అలాంటి భయం లేదు. ఎవరిపై దాడి జరిగినా ధైర్యంగా చెప్పండి. సోఫాలో కూర్చొని మాట్లాడటం కాదు. సెక్యులరిజంలో ముస్లింలకు నష్టం వస్తే ముందు మాట్లాడేది నేనే. మతం అనేది ఒక విధానం మాత్రమే. ఇదివరకు మాదిరి కాదు..ఇష్టమొచ్చినట్టు చేస్తామంటే కుదరదు. మధుసూదన్ రావు కుటుంబానికి రూ.50 లక్షలు ప్రకటిస్తున్నా.’’ అని పవన్ వ్యాఖ్యానించారు.

ఇవీ చదవండి: DCM Pawan Kalyan: స్కూళ్ల స్థలాలు కబ్జా చేస్తే గూండా యాక్ట్ కింద కేసులు
Pawan warning: వైయస్సార్ సీపీ సోషల్ మీడియాకు పవన్ కల్యాణ్ వార్నింగ్

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు