HomeAstrologyMeena Rasi 2025: మీనరాశి 2025 ఫలితాలు.. శనైశ్చరునికి ప్రత్యేక పూజలతో ఉపశమనం

Meena Rasi 2025: మీనరాశి 2025 ఫలితాలు.. శనైశ్చరునికి ప్రత్యేక పూజలతో ఉపశమనం

Meena Rasi 2025: మీన రాశి వారికి ఈ సంవత్సరం అత్యధికంగా కష్టాలు వెంటాడతాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఈ సంవత్సరం ఈ రాశి జాతకులకు అన్ని రంగాల్లోనూ ఇబ్బందులు తప్పవని సూచిస్తున్నారు. అయితే, శనైశ్చర స్వామి నియమాలు పాటించడం, పరిహారాలు చేసుకోవడం వల్ల సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చని చెబుతున్నారు. (Meena Rasi 2025)

మీన రాశి ఫలితాలు 2025

పూర్వాబాధ్ర 4వ పాదం
ఉత్తరాబాధ్ర 1, 2, 3, 4 పాదాలు
రేవతి 1, 2, 3, 4 పాదాలు

ఈ సంవత్సరం మీన రాశి జాతకులకు
ఆదాయం 5
వ్యయం 5
రాజపూజ్యం 3
అవమానం 1

ఈ సంవత్సరం 12 రాశుల్లో అతి కష్టమైన రాశి, చాలా సమస్యల బారిన పడే రాశి మీన రాశి. షష్టగ్రహ కూటమి 2025 మార్చి 29వ తేదీన ఈ రాశిలో ఏర్పడుతోంది. ఏవైనా కష్టాలున్నాయంటే ఈ సంవత్సరం ఈ రాశికే ఉన్నాయి. మీన రాశి వారికి మీ జీవితంలో అతి భయంకరమైన సంవత్సరంగా, కష్టకాలంగా, పరీక్ష కాలంగా, ప్రశ్నా కాలంగా చెప్పాల్సిన సంవత్సరం.

విద్యార్థులకు, ఉద్యోగులకు, వ్యాపారస్తులకు, రైతులకు, రాజకీయ నాయకులకు, కళాకారులకు, క్రీడాకారులకు.. అందరికీ చాలా నెగిటివ్ రిజల్ట్స్ ఇవ్వబోయే సంవత్సరం. 2025 సంవత్సరం అన్ని రంగాల వారికీ మీన రాశి వారికి ఆరోగ్య భంగాలు.

కుటుంబంలో భార్యా భర్తల మధ్య గొడవలు. గొడవలు ఉన్న భార్యా భర్తలు విడిపోవడం, విద్యార్థులకు మార్కుల శాతం, ఉత్తీర్ణత శాతంతగ్గడం, బ్యాక్ లాక్స్ ఉండటం, ఉద్యోగం రాకపోవడం, చెడు స్నేహాలు, ప్రేమల వల్ల జీవితంలో నష్టపోవడం, వీసాలు రాకపోవడం, పేపర్ వర్క్ సరిగా చేయకపోవడం వల్ల విదేశాల్లో వీసాలు రాకపోవడం, విదేశాల్లో ఉండే వారికి ఉద్యోగాలు రాకపోవడం, వ్యాపారం పేరుతో డబ్బులు నష్టపోవడం, వ్యాపార రంగంలో ఉండే వారికి సేల్స్ ట్యాక్స్, జీఎస్టీ, కమర్షియల్ ట్యాక్స్ వల్ల నష్టాలు, ఐటీ రైడ్స్ వల్ల నష్టాలు.

ఉద్యోగులకు, గవర్నమెంట్ రంగంలో ఉన్న వారికి ఐఏఎస్, ఐపీఎస్ లాంటి వారికి ఏసీబీ, సీబీఐ, ఈడీ లాంటి కేసులు, కారాగార వాసం ఉన్నాయి. చాలా చాలా కష్టాలు కనిపిస్తున్నాయి.

స్త్రీలకు భర్తతో గొడవలు, పెళ్లి చేస్తే అల్లుడు కూతురు, కొడుకు కోడలు తగాదాలు, తల్లి, తండ్రికి సంబంధించిన ఆరోగ్య భంగాలు, చాలా రకాల సమస్యలు ఈ సంవత్సరం మీన రాశి వారిని చుట్టుముడతాయి. పోలీసు కేసులు, కోర్టు కేసులు, మీడియాకు ఎక్కడం కనిపిస్తున్నాయి.

రెమెడీల విషయానికి వస్తే.. త్రయంబకేశ్వరంలో రాహు కేతు పూజ నిర్వహించుకోండి. తిరునల్లార్ శనైశ్చర ఆలయంలో ప్రత్యేకమైన పూజ నిర్వహించుకోండి. నల్లరంగు దుస్తులకు దూరంగా ఉండాలి. ప్రతి శుక్రవారం ఎల్లో కలర్ షర్టు గానీ, దుస్తులు గానీ వేసుకోండి. శుక్రవారం నాన్ వెజ్, లిక్కర్ తీసుకోకండి. దీని వల్ల సమస్యల నుంచి బయట పడతారు.

ఇవీ చదవండి: Kumbha Rasi 2025: కుంభరాశి 2025 ఫలితాలు.. ఏలి నాటి శని ఎఫెక్ట్!
Makara Rasi 2025: మకర రాశి ఫలితలు 2025.. కష్టాల కడలి నుంచి గట్టెక్కుతారు!
Dhanusu Rasi 2025: ధనస్సు రాశి 2025 ఫలితాలు.. సంపాదన పెరుగుతుంది!
Vrushabha rasi: వృషభరాశి 2025 ఫలితాలు.. పట్టిందల్లా బంగారమే!
2025 Rasi Phalalu: విశ్వావసు నామ సంవత్సరం 2025 రాశి ఫలాలు

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు