HomeAstrologyKumbha Rasi 2025: కుంభరాశి 2025 ఫలితాలు.. ఏలి నాటి శని ఎఫెక్ట్!

Kumbha Rasi 2025: కుంభరాశి 2025 ఫలితాలు.. ఏలి నాటి శని ఎఫెక్ట్!

Kumbha Rasi 2025: కొత్త సంవత్సరం 2025లో కుంభ రాశి వారికి ఏలినాటి శని ఎఫెక్ట్ కొంత వరకు ఉంటుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. కొన్ని జాగ్రత్తలు పాటిస్తే ఈ సంవత్సరం వీరికి అంతా సజావుగా జరుగుతుందంటున్నారు. (Kumbha Rasi 2025)

కుంభ రాశి ఫలితాలు 2025

ధనిష్ట 3, 4 పాదాలు
శతభిషం 1, 2, 3, 4 పాదాలు
పూర్వాబాధ్ర 1, 2, 3 పాదాలు

ఈ సంవత్సరం కుంభ రాశి జాతకులకు
ఆదాయం 8
వ్యయం 14
రాజపూజ్యం 7
అవమానం 5

ఈ సంవత్సరం ఇంకా ఏలినాటి శని జన్మ శని నుంచి ఏలి నాటి శనికి మారుతోంది. ఈ సంవత్సరం ఏలినాటి శని ఎఫెక్ట్ ఉంటుంది. తల్లి, తండ్రికి సంబంధించిన ఆరోగ్యపరమైన ఇబ్బందులు, కుటుంబంలో సంతనానికి సంబంధించిన ఆరోగ్యపరమైన ఇబ్బందులు, మరీ ముఖ్యంగా కుటుంబంలో మగ సంతానం ఉంటే వాళ్ల ఆరోగ్య పరమైన ఇబ్బందులు, లేదా మగ సంతానానికి వాహన ప్రమాదాలు, యాక్సిడెంట్లు జరిగే అవకాశం ఉంది. ఈ సంవత్సరం ఇంట్లో శుభకార్యాల కోసం, ముఖ్యంగా పెళ్లి కోసం డబ్బు ఎక్కువగా ఖర్చు చేస్తారు.

విద్యార్థులకు సంబంధించి ఉత్తీర్ణత శాతం తగ్గుతుంది. బ్యాక్ లాక్స్ ఉండొచ్చు. మార్కులు తగ్గే అవకాశం ఉంది. చెడు స్నేహాల వల్ల, చెడు అలవాట్ల వల్ల, చెడు సాన్నిహిత్యం వల్ల సమస్యలు ఏర్పడతాయి. ప్రేమ పేరుతో మోసపోయే అవకాశం కనిపిస్తోంది. వీసాలు రిజెక్ట్ అయ్యే అవకాశం, ఉద్యోగాలు రాని పరిస్థితి గోచరిస్తోంది.

ఉద్యోగులకు, ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఏసీబీ, సీబీఐ, ఈడీ లాంటి కేసులు గోచరిస్తున్నాయి. మరీ ముఖ్యంగా ఐఏఎస్, ఐపీఎస్ స్థాయిలో ఉండే వారికి ఈ సంవత్సరం సమస్యలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.

రాజకీయ రంగంలో ఉండే వారికి విశేషించి చాలా సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. సొంత కుటుంబ సభ్యుల వల్ల వ్యతిరేకమైన ఫలితాలు ఉండబోతున్నాయి. సమాజంలో, ప్రజల్లో చెడ్డపేరు, పోటీ చేసిన స్థానంలో ఓడిపోతారు. నామినేటెడ్ పదవులు వస్తాయనుకుంటే అవికూడా దక్కని పరిస్థితి గోచరిస్తోంది.

రైతులకు సంబంధించి మొదటి పంట అనుకూలంగా లేదు. రెండో పంట అనుకూలంగా ఉంటుంది. మొదటి పంటలో నష్టం వచ్చే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాలి. రెండో పంటలో మాత్రం అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. రాబడి, దిగుబడి పెరుగుతాయి.

క్రీడాకారులు, కళాకారులకు తీవ్రమైన సమస్యలుంటాయి. అనుకున్న ఫలితాలు, అవకాశాలు చేజారుతాయి. సమాజంలో సంఘంలో గౌరవం దెబ్బతింటుంది. సొంత వాళ్లే మిమ్మల్ని విమర్శించే పరిస్థితి ఉంటుంది. అప్పులు చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ రాశిలో ఉండే వారికి మానసికమైన ఇబ్బందులు చాలా ఎక్కువగా ఉంటాయి.

వీరికి రెమెడీస్ చూస్తే.. తిరునల్లార్ లో శనైశ్చర ఆలయంలో ప్రత్యేకమైన శనిపూజ నిర్వహించుకోవడం ద్వారా, నలుపు రంగు దుస్తులకు దూరంగా ఉండటం ద్వారా ఈ సంవత్సరం సమస్యల నుంచి బయట పడే అవకాశం కనిపిస్తోంది.

ఇవీ చదవండి: Makara Rasi 2025: మకర రాశి ఫలితలు 2025.. కష్టాల కడలి నుంచి గట్టెక్కుతారు!
Dhanusu Rasi 2025: ధనస్సు రాశి 2025 ఫలితాలు.. సంపాదన పెరుగుతుంది!
Tula Rasi 2025: తులా రాశి 2025 ఫలితాలు.. 100కు 100 మార్కులు!
Simha Rasi 2025: సింహరాశి 2025 ఫలితాలు.. అష్టమ శని ప్రభావంతో వీరికి?
2025 Rasi Phalalu: విశ్వావసు నామ సంవత్సరం 2025 రాశి ఫలాలు

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు