HomeAstrologyKarkataka Rasi 2025: కర్కాటక రాశి 2025 ఫలితాలు.. చిన్న చిన్న సమస్యలు మినహా..!

Karkataka Rasi 2025: కర్కాటక రాశి 2025 ఫలితాలు.. చిన్న చిన్న సమస్యలు మినహా..!

Karkataka Rasi 2025: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం 2025లో కర్కాటక రాశి వారికి చిన్న చిన్న సమస్యలు మినహా అంతా బాగుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. ఈ సంవత్సరం ఈ రాశి వారికి ఆరోగ్య సమస్యల పరంగా కొన్ని ఇబ్బందులు ఉంటాయని, మిగతా అన్ని అంశాల్లోనూ సానుకూలంగా ఉందని ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి వెల్లడించారు. ఆయన చెప్పిన ఈ సంవత్సరం ఈ రాశి వారి ఫలితాలు ఇవీ.. (Karkataka Rasi 2025)

కర్కాటక రాశి ఫలితాలు 2025

పునర్వసు 4వ పాదం
పుష్యమి 1, 2, 3, 4 పాదాలు
ఆశ్లేష 1, 2, 3, 4 పాదాలు

ఈ సంవత్సరం కర్కాటక రాశి జాతకులకు
ఆదాయం 8
వ్యయం 2
రాజపూజ్యం 7
అవమానం 3

గురువు వ్యయం లోకి రాబోతున్నాడు. భాగ్య స్థానంలో ఉన్న గురువు వల్ల సమస్యలు ఉండవు. ఈ సంవత్సరం కర్కాటక రాశి జాతకులకు చెప్పదల్చుకున్న ఒకే ఒక్క పాయింట్.. కాళ్లు, చేతులు విరిగే అవకాశం ఉంటుంది. మెట్లు ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు, లేదా నీళ్లలో తడిగా ఉన్న ప్రదేశాల్లో నడిచేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. సర్జరీలు కూడా జరిగే అవకాశం ఉంది. గొంతు నుంచి బొడ్డు వరకు ఏవైనా సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది. యాంగ్జయిటీ డిజార్డర్, లంగ్స్ రిలేటెడ్ సమస్యలు, లేదా రివర్ కు సంబంధించిన సమస్యలు, ఫ్యాటీ లివర్ సమస్యలు రావొచ్చు.

విద్యార్థులకు పూర్తి స్థాయి అనుకూలమైన ఫలితాలు ఉండబోతున్నాయి. ఈ సంవత్సరం ఉత్తీర్ణత శాతం పెరుగుతుంది. మార్కులు ఎక్కువగా వస్తాయి. అనుకున్న ప్రదేశంలో మీకు సీట్లు దొరుకుతాయి. ఉద్యోగం కోరుకుంటే ఉద్యోగం సిద్ధిస్తుంది. ప్రమోషన్లు ఉంటాయి. విదేశాలకు వెళ్లే వారికి వీసాలు అప్రూవల్ అవుతాయి. విదేశాల్లో చదువు కంప్లీట్ చేసుకున్న వారికి ఉద్యోగాలు వస్తాయి. ఉద్యోగాల్లో ఉండి వ్యాపారం చేయాలనుకునే వారికి అనుకూలమైన పరిస్థితులు గోచరిస్తున్నాయి.

ఉద్యోగులకు సంబంధించి ప్రమోషన్లు ఉంటాయి. అనుకున్న ప్రదేశాలకు ట్రాన్స్ ఫర్లు పొందుతారు. పై అధికారుల మన్ననలు పొందుతారు. ఉద్యోగంలో పై స్థాయికి వెళ్తారు. కళాకారులకు విశేషించి అనుకూలం. సినిమా, టీవీ రంగం, కళాకారులకు అనుకూలం. మరీ ముఖ్యంగా విదేశాల్లో ప్రోగ్రాములు నిర్వహించడం, అవార్డులు, రివార్డులు పొందుతారు.

డాక్టర్లు, యాక్టర్లు, లాయర్లకు విశేషించి అనుకూలం. రాజకీయ నాయకులకు ఆరోగ్యభంగములు కనిపిస్తాయి. చాలా ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఏర్పడతాయి. మిగతా విషయాలు అనుకూలంగా ఉంటాయి.

రైతులకు సంబంధించి రెండు పంటలు అనుకూలం. దిగుబడి విశేషంగా ఉంటుంది. దిగుబడి, రాబడి పెరగడం వల్ల అప్పులు తీరుస్తారు. ప్రభుత్వం మీకు అనుకూలంగా వ్యవహరిస్తుంది. మీకు రావాల్సిన లోన్లు, పంట రుణాలు వస్తాయి. ఎరుపు రంగు పంటలు వేయడం ద్వారా మీకు అనుకూలం.

ఓవరాల్ గా ఈ రాశి వారికి చాలా అనుకూలంగా ఉంది. ఈ సంవత్సరం ఉన్న సమస్య గురువు వ్యయంలో ఉన్నాడు. చిన్న చిన్న సమస్యలు ఉండొచ్చు.

ప్రతి గురువారం నాడు ఎల్లో కలర్, లెమన్ ఎల్లో కలర్ ఉన్న షర్టు, ఆడవాళ్లు అయితే ఎల్లో చుడీదార్ చీర ధరిస్తే మంచిది. గురువారం నాడు శ్రీకాళహస్తిలో గురు దక్షిణామూర్తి వద్ద అర్చన నిర్వహించుకుంటే సమస్యల నుంచి గట్టెక్కుతారు.

ఇవీ చదవండి: Mithuna Rasi 2025: మిథున రాశి 2025 ఫలితాలు.. మూడేళ్ల కష్టాలకు చెల్లు చీటీ!
Vrushabha rasi: వృషభరాశి 2025 ఫలితాలు.. పట్టిందల్లా బంగారమే!
2025 Mesha Rasi: 2025 మేష రాశి ఫలాలు.. 98 శాతం అనుకూలం?
2025 Rasi Phalalu: విశ్వావసు నామ సంవత్సరం 2025 రాశి ఫలాలు

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు