Simha Rasi 2025: ద్వాదశ రాశుల్లో సింహ రాశి వారికి 2025 సంవత్సరం ఎలా ఉండబోతోందని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే, ఈ 2025 సంవత్సరంలో సింహ రాశి (Simha Rasi 2025) జాతకులకు అష్టమ శని ప్రారంభం అవుతోందని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో కొన్ని సమస్యల బారిన పడే అవకాశం ఉందని, తగిన పరిహారాలు పాటించడం వల్ల వాటి నుంచి దూరం కావచ్చని చెబుతున్నారు.
సింహరాశి ఫలితాలు 2025
మఖ 1, 2, 3, 4 పాదాలు
పుబ్బ 1, 2, 3, 4 పాదాలు
ఉత్తర 1వ పాదం
ఈ సంవత్సరం సింహరాశి జాతకులకు
ఆదాయం 11
వ్యయం 11
రాజపూజ్యం 3
అవమానం 6
సింహరాశి జాతకులకు ఈ సంవత్సరం అష్టమ శని ప్రారంభం అవుతుంది. కష్టాలు తప్పవు. విద్యార్థులకు చాలా చాలా సమస్యలు ఉండబోతున్నాయి. వీసా రిజెక్ట్ అవుతుంది. ఉత్తీర్ణత శాతం తగ్గడం, బ్యాక్ లాగ్స్ ఉండటం, ఫెయిల్ అవ్వడం, జాబ్ రాకపోవడం, ఇంట్లో మానసికంగా టార్చర్ ఉంటుంది. బయట దేశాల్లో ఉన్న విద్యార్థులకు ఉద్యోగం రాకపోవడం, స్టడీస్ కంప్లీట్ అయిన తర్వాత పర్మినెంట్ ఉద్యోగాలు రాకుండా ఖాళీగా ఉండటం, పేపర్ల విషయంలో సమస్యలు, తిరిగి సొంత దేశానికి రావాల్సి వస్తుంది. చెడు అలవాట్లు, చెడు స్నేహితుల వల్ల కుటుంబంలో సమస్యలు, చెడ్డ పేరు వస్తుంది.
భార్యా భర్తల మధ్య గొడవలు అవుతాయని గోచరిస్తోంది. విభేదాలు తీవ్ర స్థాయికి చేరి ఇద్దరూ దూరం అయ్యే అవకాశం కనిపిస్తోంది. రక్త సంబంధీకులకు సంబంధించి భార్య తరఫు లేదా తల్లిదండ్రుల తరఫున గానీ శూతకం పట్టాల్సి రావచ్చు. వీళ్ల ఎవరైనా ఒకరు మరణించే అవకాశం కనిపిస్తోంది.
ఉద్యోగులకు ఈ సంవత్సరం ఏ మాత్రం కలిసిరాదు. ట్రాన్స్ ఫర్లు జరగవు. ప్రమోషన్లు ఉండవు. పై అధికారుల టార్చర్ పెరుగుతుంది. ప్రభుత్వ ఉద్యోగం చేసే వాళ్లకు ఏసీబీ రైడ్స్ జరిగే అవకాశం కనిపిస్తోంది. ఐఏఎస్, ఐపీఎస్ లాంటి వారికి ఏసీబీ, సీబీఐ, ఈడీ లాంటి కేసులు బాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీడియాకు ఎక్కాల్సి రావచ్చు.
సినిమా రంగంలో ఉండే వారికి చాలా అనుకూలంగా కనిపిస్తోంది. నూతన అవకాశాలు వెతుక్కుంటూ రావచ్చు. కానీ ఆర్థికంగా రూపాయి వస్తే రూ.10 ఖర్చు కనిపిస్తోంది. డబ్బు ఖర్చుచేసేటప్పుడు జాగ్రత్త.
స్నేహితుల వల్ల, స్త్రీ మూలకంగా, (ఆడవాళ్లయితే ఆడవాళ్ల వల్ల, మగవాళ్లయితే మగవాళ్ల వల్ల) సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. మీరు నమ్మిన వ్యక్తులు మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంది. పోలీసు, కోర్టు కేసులు ఏర్పడే అవకాశం ఉంది.
రైతులకు ఈ సంవత్సరం దిగుబడి, రాబడి తక్కువగా ఉండే అవకాశం. మొదటి పంట నష్టపోయే అవకాశం, రెండో పంటలో దిగుబడి తగ్గే అవకాశం ఉంది. జాగ్రత్తగా అడుగులు వేయాలి.
క్రీడాకారులకు రాజకీయాల వల్ల అవకాశాలు దక్కక పోవచ్చు. మీకు దక్కాల్సిన అవకాశాలు వేరే వాళ్లకు దక్కొచ్చు.
రాజకీయ నాయకులకు చాలా నెగిటివ్ గోచరిస్తోంది. డబ్బు విపరీతంగా ఖర్చు అవుతుంది. అనుకున్న పదవులేమీ దక్కక పోవచ్చు. ఈ సంవత్సరం పోటీ చేసే వారు ఓడిపోయే అవకాశం ఉంది.
శని వార నియమాన్ని పాటించండి. శనివారం రాత్రి పూట భోజనం చేయకుండా టిఫిన్ మాత్రమే చేస్తూ ఉండాలి. వీలైతే శనివారం రోజున బ్లూ కలర్ దుస్తులు వేసుకునే ప్రయత్నం చేయాలి. గురువారం నాడు ఎల్లో కలర్ బట్టలు వేసుకోండి. వీటి వల్ల చాలా వరకు దోషాలు తగ్గుతాయి. తిరునల్లార్ శనైశ్చర ఆలయంలో ప్రత్యేక శనిపూజ నిర్వహించుకోండి. దీని ద్వారా సమస్యల నుంచి బయట పడతారు.
ఇవీ చదవండి: Karkataka Rasi 2025: కర్కాటక రాశి 2025 ఫలితాలు.. చిన్న చిన్న సమస్యలు మినహా..!
Mithuna Rasi 2025: మిథున రాశి 2025 ఫలితాలు.. మూడేళ్ల కష్టాలకు చెల్లు చీటీ!
2025 Rasi Phalalu: విశ్వావసు నామ సంవత్సరం 2025 రాశి ఫలాలు
