HomeAndhra PradeshMP Gurumuthy: కలిచేడు, తలుపూరు స్కూళ్లకు కొత్త భవనాలు

MP Gurumuthy: కలిచేడు, తలుపూరు స్కూళ్లకు కొత్త భవనాలు

MP Gurumuthy: తిరుపతి పార్లమెంట్ పరిధిలోని వెంకటగిరి నియోజకవర్గం, సైదాపురం మండలం, కలిచేడు, తలుపూరు గ్రామాలలో మైకా మైన్స్ లేబర్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ (ఎం.ఎం.ఎల్.డబ్ల్యూ.ఓ) పాఠశాల కొత్త భవనాల నిర్మాణం గూర్చి తిరుమతి ఎంపీ డాక్టర్ మద్దిల గురుమూర్తి నేడు పార్లమెంటులో ప్రశ్నించారు.

ఈ ప్రశ్నకు సమాధానంగా కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్షుక్ మాండవీయ రాతపూర్వకంగా సమాధానం ఇస్తూ కలిచేడు, తలుపూరు గ్రామంలోని పాఠశాల భవనాలు 67 సంవత్సరాలకు పైగా పాతబడినవని శిథిలావస్థలో ఉన్నాయని, భవన నిర్మాణాన్ని బాగు చేసేందుకు ప్రత్యేకంగా మరమ్మతులు చేపట్టలేమని కేంద్ర పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ (సిపిడబ్ల్యూడి) పరిశీలన అనంతరం తెలియజేసిందని ఆయన తెలిపారు.

సీపీడబ్ల్యూడీ సిఫార్సుల ప్రకారం పాఠశాల భవనాల స్థానంలో కొత్త భవనాల నిర్మాణం చేపట్టేందుకు ప్రస్తుతం శిధిలావస్థలో ఉన్న భవనాలను కూల్చి వేయాలని తెలిపారని అన్నారు. కొత్త పాఠశాల భవనాల నిర్మాణం కొరకు ప్రిలిమినరీ డ్రాయింగ్ ఇచ్చిందని తెలియజేసారు. కొత్త భవనాలు నిర్మించే లోపు తాత్కాలికంగా తరగతులు నిర్వహించేందుకు ఏర్పాట్ల కోసం కేంద్ర మంత్రిత్వ శాఖ రాష్ట్ర ప్రభుత్వాన్ని అభ్యర్థించిందని ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వం స్పందన కోసం వేచి ఉందని ఆయన తెలియజేశారు.

ఇవీ చదవండి: MPs of YSRCP: పోలవరం ఎత్తు, ప్రత్యేక హోదా, వక్ఫ్‌ బిల్లుపై పార్లమెంటులో గళం
YSRCP: నల్ల బాలు.. మెంటల్‌ సర్టిఫికెట్‌ తెచ్చుకున్నదెవరో గుర్తు చేసుకో
YSRCP SM: సోషల్‌ మీడియా కార్యకర్తలకు తోడుగా నిలబడతాం
YSRCP Social Media: వైసీపీ సోషల్ మీడియాపై సీఎం చంద్రబాబు హాట్ కామెంట్స్
CBN on YSRCP: జగన్ నిర్ణయాలపై చంద్రబాబు ఆగ్రహం.. కేబినెట్ తర్వాత ఏమన్నారంటే..
YSRCP News: అందుకే అదే పనిగా బురద.. అవాస్తవాలతో తప్పుదోవ!
Operation YSRCP: వైసీపీని ఖాళీ చేయించే దిశగా టీడీపీ చీఫ్ అడుగులు.. మరోసారి ఆపరేషన్ ఆకర్ష్!
YS Jagan with YSRCP Social Media: వైఎస్సార్‌ సీపీ సోషల్‌ మీడియా సైనికులతో సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు!

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు