Ruhani Sharma: హీరోయిన్ రుహానీ శర్మ రహస్యంగా పెళ్లి చేసుకుందా? ఈ వార్త ఫిల్మ్ సర్కిళ్లలో చక్కర్లు కొడుతోంది. అంతేనా.. కల నిజమైంది.. అంటూ ఈ ముద్దుగుమ్మ చేసిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
రుహానీ శర్మ తొలి సినిమాతోనే నేచురల్ గా నటించి మెప్పించింది. తెలుగు ప్రేక్షకుల మనసు గెలుచుకుంది. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో సుశాంత్ హీరోగా నటించిన చి.ల.సౌ. మూవీతో ఈ భామ టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే.
చి.ల.సౌ. మూవీ మంచి ఫీల్ గుడ్ అనిపించింది. తొలి మూవీతోనే మంచి హిట్ అందుకున్న ఈ అమ్మడు.. నటన పరంగాను మంచి మార్కులు కొట్టేసింది. హిమాచల్ బ్యూటీ అయిన రుహానీ శర్మ.. టాలీవుడ్ లో ఈ మధ్య కాలంలో మూవీ చాన్సులు కొట్టేస్తోంది. అటువైపు పంజాబీ చిత్రాల్లోనూ రాణిస్తోంది. బాలీవుడ్ లోనూ తన అవకాశాలను విస్తృతం చేసుకుంటోందీ చిన్నది. బ్యూటీ చివరికి టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. చి.ల.సౌ సినిమా తర్వాత మరింత పాపులారిటీ సంపాదించుకుంది.
హిట్ సినిమాలో తన నటనతో రుహానీ శర్మ ఆకట్టుకుంది. మరోవైపు డర్టీ హరి.. లాంటి బోల్డ్ చిత్రాల్లో నటించి వావ్ అనిపించింది. చివరిగా రుహానీ శర్మ వెంకటేష్ నటించిన సైందవ్ మూవీలో కనిపించింది. మరోవైపు సామాజిక మాధ్యమాల్లో ఈ ముద్దుగుమ్మ యాక్టివ్ గా ఉంటోంది. ఈ మధ్య కాస్త గ్లామరస్ డోస్ పెంచి అభిమానులను పోగేసుకుంటోంది. వెకేషన్స్ లో అందాలు ఆరబోస్తూ ఫోటోలకు పోజులివ్వడమే కాదు, వాటిని సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటోంది. ఈ అమ్మడి ఫొటోలకు నెట్టింట మంచి క్రేజ్ ఉందంటే అతిశయోక్తి కాదేమో.
తాజాగా తన సోషల్ మీడియా ఖాతాల్లో ఆమె షేర్ చేసిన స్టోరీ కుర్రాళ్ళకు మై గాడ్ అనిపించింది. పెళ్లికూతురు గెటప్ లో ఫోటోను పెట్టిన రుహానీ శర్మ.. తన కల నిజమైందంటూ క్యాప్షన్ రాసింది. దాంతో ఈ బ్యూటీ సీక్రెట్ గా మ్యారేజ్ చేసుకుందంటూ ఫిల్మ్ సర్కిళ్లలో టాక్ నడుస్తోంది. మరి ఇది నిజమా? లేక ఏదైనా షూటింగ్ లో ప్రమోషన్ కథా..? అనేది తెలియాల్సి ఉంది.

ఇవీ చదవండి: Vijay Rashmika: లంచ్ డేట్‌లో విజయ్ దేవరకొండ, రష్మిక.. ఫొటో వైరల్
Meenakshi Chaudhary: నడుము అందాలతో కవ్విస్తున్న మీనాక్షి చౌదరి.. ఫొటోలు
Nargis Fakhri: నర్గీస్ ఫక్రీ ట్రెండీ లుక్స్.. రెడ్ డ్రెస్ హాట్ బ్యూటీ ఫొటో గ్యాలరీ
Mrunal Thakur hot: బాత్ టబ్బులో మృణాల్ హాట్ పోజులు.. విషయం అదా?
