బుధవారం, 21 అక్టోబర్ 2026 --:--:-- | 📍 వాతావరణం తెలుసుకుంటోంది...
Andhra Pradesh

YSRCP: నల్ల బాలు.. మెంటల్‌ సర్టిఫికెట్‌ తెచ్చుకున్నదెవరో గుర్తు చేసుకో

Keerthanaa News Deskప్రచురణ తేదీ: బుధవారం, 13 నవంబర్ 2024

YSRCP: ‘సినిమా సీరియస్‌గా నడుస్తున్నప్పుడు డైవర్షన్‌ కోసం ఒక కమెడియన్‌ వస్తాడు.. అచ్చం అలాగే ఇప్పుడు టీడీపీ ఆఫీసులో ఆనం వెంకటరమణారెడ్డి అనే ఒక కమెడియన్‌ ప్రత్యక్షమయ్యాడు. విచక్షణ లేకుండా మాట్లాడుతున్నాడు’.. అని వైయస్సార్‌సీపీ (YSRCP) రాష్ట్ర అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్‌రెడ్డి ఆక్షేపించారు. ఆనం ఇకనైనా నోరు అదుపులో పెట్టుకోవాలని, లేకపోతే తామూ మాట్లాడగలమని ఆయన స్పష్టంగా తేల్చి చెప్పారు.

తమ అధినేతను ఏకవచనంతో సంబోధిస్తున్న ఆనం వైఖరిని తీవ్రంగా తప్పు పట్టిన, వైయస్సార్‌సీపీ అధికార ప్రతినిధి, అలా తామూ మాట్లాడగలమని, అయితే తమకు సంస్కారం ఉందని చెప్పారు. ఆనాడు చంద్రబాబును ఔరంగజేబుతో పోల్చిన ఎన్టీఆర్‌ మాటలు ప్రస్తావించిన ఆయన, త్వరలో తన తండ్రి చంద్రబాబును కూడా నారా లోకేశ్‌ ఔరంగజేబు మాదిరిగా పక్కకు నెట్టి సీఎం కుర్చీ లాక్కుంటాడని బయట జోరుగా ప్రచారం జరుగుతోందని గుర్తు చేశారు. ఇకనైనా ఆనం తన నోరు అదుపులో పెట్టుకోవాలని, మళ్లీ తమ నాయకులపై పిచ్చిపిచ్చిగా మాట్లాడితే నాలుక చీరేస్తామని శివశంకర్‌రెడ్డి హెచ్చరించారు.

జగన్‌ పై పిచ్చికూతలు కూస్తున్న నల్ల బాలు అనబడే ఆనం వెంకటరమణారెడ్డి, ఆ పార్టీలో ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న హీరో ఇంట్లో కాల్పులు జరిగితే, వైద్యుల నుంచి ఏ సర్టిఫికెట్‌ తీసుకుని, బెయిల్‌ పొందారో గుర్తు చేసుకోవాలని కోరారు. ధైర్యం ఉంటే తాను చెప్పింది వాస్తవమో, కాదో చెప్పాలని కోరారు. అలాగే చంద్రబాబు సొంత తమ్ముడు నారా రామ్మూర్తినాయుడికి మెంటల్‌ అని చెప్పి గొలుసులతో కట్టేసిన విషయాన్ని ఆయన బంధువు నార్నె శ్రీనివాసరావు మీడియా ముందు చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు.

తమ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రావాలా? వద్దా? అనేది తమ పార్టీ శాసనసభాపక్షం నిర్ణయిస్తుందన్న పుత్తా, దీన్ని ప్రశ్నించడానికి ఆనంకు ఏ హక్కు ఉందని నిలదీశారు. అసెంబ్లీకి రాకుండా జీతాలు తీసుకుంటూ, ఏసీ టికెట్లు, ఇంటర్నెట్, కరెంట్‌ బిల్లులు ఉచితంగా పొందుతున్నారని ఆరోపిస్తున్న ఆనం.. నవంబర్‌ 19, 2021 నుంచి కారణం లేకుండా రెండున్నరేళ్లు చంద్రబాబు అసెంబ్లీకి ఎందుకు రాలేదని, అలాగే టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్‌ సైతం ఆగస్టు 13, 1993న అసెంబ్లీ నుంచి బయటకు వెళ్లిన విషయం గుర్తు లేదా? అని ప్రశ్నించారు. మరి వారు ఉచితంగా జీతాలు తీసుకున్నట్లు కాదా? అని పుత్తా శివశంకర్‌రెడ్డి నిలదీశారు.

ఇవీ చదవండి: YSRCP SM: సోషల్‌ మీడియా కార్యకర్తలకు తోడుగా నిలబడతాం
YSRCP Social Media: వైసీపీ సోషల్ మీడియాపై సీఎం చంద్రబాబు హాట్ కామెంట్స్
YSRCP: వైయస్సార్ సీపీ కీలక పిలుపు.. అలా చేద్దామంటూ ప్రకటన

ట్యాగ్స్: , , , , , ,
AIతో కథనాన్ని సంక్షిప్తంగా చదవండి

ఎంపిక చేసిన AI సేవలో ఈ కథనం లింక్‌తో సమ్మరీ తెరుచుకుంటుంది.

Discover more from keerthanaanews.com

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading