Balineni Srinivasa Reddy: వైయస్ రాజశేఖరరెడ్డి ఫ్యామిలీ అంటే జగన్ ఒక్కరేనా? విజయమ్మ, షర్మిల కాదా? అని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి (Balineni Srinivasa Reddy) ప్రశ్నించారు. సెకీ ఒప్పందం వ్యవహారంలో తనపై వస్తున్న విమర్శలు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆరోపణలపై ఆయన రియాక్ట్ అయ్యారు. ఈరోజు హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడిన బాలినేని.. జగన్ కు నేరుగా ప్రశ్నలు గుప్పించారు.
‘‘సెకీ ఒప్పందంపై నాతో ఎప్పుడైనా మాట్లాడారా? అని జగన్ నే ప్రశ్నిస్తున్నా. సెకీ ఒప్పందంతో నాకు అసలు సంబంధం లేదు. నా దగ్గరకు ఫైల్ పంపించారు దానిని నేను ఫార్వార్డ్ చేశాను. మంత్రిని కూడా ప్రభావితం చేసే పెద్ద కాంట్రాక్టర్ సీఎంవో ఆఫీసులో ఉన్నాడు. వైయస్ కుటుంబం అంటే ఒక్క జగనేనా? షర్మిల, విజయమ్మ కాదా? షర్మిల, విజయమ్మపై పోస్టులు పెడితే జగన్ పట్టించుకోరా?
ఆరోజు నేను చెప్పింది ఏంటంటే.. సెకీతో మాట్లాడింది నాకు తెలిదు. సీఎం ఆఫీస్ నుంచి ఫైల్ మూవ్ చేశారు. ఫైల్ నా దగ్గరకు వచ్చింది. అర్ధరాత్రి నాకు ఫోన్ చేసి ఆ ఫైల్ మీద సంతకం చేయమన్నారు. ఆరోజు నైట్ నేను రిజెక్ట్ చేస్తే కేబినెట్ మీటింగ్ లో పెడతానన్నారు. కేబినెట్ కి పంపించారు అదే నేను మీడియాకు చెప్పాను. నిన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఆయనకు ట్రాన్స్ పోర్ట్ మీద ఉన్నంత అవగహన కేబినెట్ లో జరిగే విషయాలపై ఉండదు. ఏదేదో మాట్లాడుతున్నాడు. చెవిరెడ్డి నేను సంతకం పెట్టానని మాట్లాడుతున్నాడు. ఆ రోజు నేను క్లియర్ గా చెప్పా కేబినెట్ కి పంపించానని.. నేను సంతకం పెడితే కేబినెట్ కి పోయింది “నేను ఒప్పందం మీద సంతకం పెట్టలేదు కానీ.. కేబినెట్ కి పంపడానికి సంతకం పెట్టా” నా డిజిటల్ సంతకంతో ఫైల్ కేబినెట్ కి పోయింది. దానికి ఏదో నేను సంతకం పెట్టానని డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నారు. (Balineni Srinivasa Reddy)
నా సంతకం లేకుండా కేబినెట్ కి పోదు కదా! దానికి ఏదో సంతకం పెట్టా.. పెట్టా అంటున్నారు.. “నేను కేబినెట్ కి పంపించా కేబినెట్ డెసిషన్ తీసుకుంది” లేకపోతే 1,700 కోట్లలో నేను ముడుపులు తీసుకున్నానని చెప్పాలా వాట్ ఈస్ దిస్? అసలు సెకి వాళ్ళు వచ్చినప్పుడు నన్ను మీటింగ్ కి పిలిచారా? నేను తప్పు మాట్లాడితే సెక్రటరీ శ్రీకాంత్ ని అడగండి.. శ్రీకాంత్ మీద నమ్మకంతో కేబినెట్ కి పంపించండి సర్ అంటే కేబినెట్ కి పంపించా.. దాని కూడా వక్రీకరించి మాట్లాడుతున్నారు.
నువ్వు రాజశేఖర్ కుటుంబం వల్లే పైకి వచ్చావంటూ మాట్లాడుతున్నారు.. నేను జనసేన పార్టీలో చేరేటప్పుడు కూడా పవన్ కల్యాణ్ తో చెప్పా.. సర్ నాకు రాజకీయ భిక్ష పెట్టింది రాజశేఖర్ రెడ్డి. నేను విలువలు లేని, దొంగ రాజకీయాలు చేయను. ఎప్పటికి వైఎస్ఆర్ పై నాకు గౌరవం ఉంటుంది. రాజశేఖర్ రెడ్డి మీద గౌరవంతోనే ఆనాడు నేను జగన్ పార్టీ పెడితే మంత్రి పదవికి రాజీనామా చేసి ఆ పార్టీలో చేరా.. “అప్పుడు ఎవడు ఈ భాస్కర్ రెడ్డి? అప్పుడు ఏమి చేస్తున్నాడు” ఆతను కూడా నా గురించి మాట్లాడతాడా?
నేను ఓపెన్ గా అడుగుతున్నా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి.. నేను ఏదో పవన్, చంద్రబాబు మెప్పు కోసం.. ఎమ్మెల్సీ పదవి కోసం విమర్శలు చేస్తున్నానని.. ఈటీవీ వాళ్ళు అడిగితేనే నేను ఉన్నది ఉన్నట్టు చెప్పాను. నేను అడుగుతున్నా ఎంపీగా ఉన్నా మాగుంట శ్రీనివాసుల రెడ్డికి ఎందుకు టికెట్ ఇవ్వలేదు? ఎందుకు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని తీసుకొచ్చి పెట్టారు? మాగుంట చంద్రబాబుని తిట్టలేదు కాబట్టి టికెట్ ఇవ్వలేదు. అంటే తిడితేనే టికెట్ల ఇస్తారా? భారతదేశంలో ఎక్కడనైనా ఒక జిల్లా అధ్యక్షుడిని తీసుకొచ్చి వేరే జిల్లాలో పెడతారా? అంటే ప్రకాశం జిల్లాలో నాయకులు లేరా?
రాజశేఖర్ రెడ్డి కుటుంబం అంటే ఒక జగనేనా.. ఏ విజయమ్మ కదా, షర్మిల కదా? రాజశేఖర్ రెడ్డి మీద గౌరవం ఉంటే షర్మిల, విజయమ్మ మీద సోషల్ మీడియాలో పోస్టులు ఎందుకు పెట్టిస్తున్నారు? ఇది కరెక్టా? స్వేచ్ఛ గురించి చెవిరెడ్డి మాట్లాడుతున్నాడు. ఫ్రెండ్స్ తో రష్యా పోవడం కూడా..స్వేచ్ఛనా? ఏం మాట్లాడ్తావు? చెవిరెడ్డి ఎన్ని సార్లు అమెరికాకు పోయి ఏం చేస్తారో అందరికీ తెలుసు. నీ వ్యక్తిగత విషయం మొదలుపెట్టాను అనుకో చరిత్ర ఉంది.
నా జోలికి వచ్చావు కాబట్టి చెబుతున్నా నువ్వు పబ్లిక్ లోకి రా. ఓపెన్ గా కూర్చుందాం ఐదేళ్లలో ఏం జరిగింది? నేను పార్టీ నుంచి బయటకు ఎందుకు పోవాల్సింది అన్ని చెబుతా… నువ్వు కూడా చెప్పుకో నువ్వు ఎలా దగ్గరయ్యావో చెప్పుకో.. దమ్ముంటే డిబేట్ కి రా పబ్లిక్ గా చూసుకుందాం. నేను మంత్రి పదవులు వదులుకున్నా. పవన్ తో చెప్పాను… సర్ నేను అక్కడ ఇబ్బందులు పడ్డాను. మీరు నాకు పదవి ఇచ్చినా, ఇవ్వకపోయినా మీతో ప్రయాణం చేస్తానని చెప్పాను. నన్ను పవన్ మర్యాదగా చూసుకున్నారు.
నాకు సెకీ తో ఒప్పందం గురించి అసలు తెలియదు. దానికి సంబంధించి ఎనర్జీ సెక్రటరీ శ్రీకాంత్ ని అడగండి ఆయన చెబుతారు. నాకు చిన్న అనుమానం వీళ్లు ఏమైనా డిజిటల్ సైన్స్ చేస్తారేమోనని.. సెకీ ఒప్పందంతో నాకు అసలు సంబంధం లేదు. నేను వాళ్లతో మాట్లాడం కానీ ఏమీ లేదు. నా దగ్గరకు ఫైల్ పంపించారు దానిని నేను ఫార్వార్డ్ చేశాను. CMDలు అపాయింట్ చేసిన ఫైల్ నా దగ్గరకి కూడా రాలేదు. సీఎంవో లోనే CMDలను అపాయింట్ చేశారు. మంత్రిని కూడా ప్రభావితం చేసే పెద్ద కాంట్రాక్టర్ సీఎంవో ఆఫీసులో ఉన్నాడు.
నేను కోరుకునేది గౌరవం మాత్రమే అది అక్కడ లేదు. ఒప్పందాల విషయంలో నాకు అసలు సంబంధం లేదు. అలాంటిది ఏమైనా ఉందంటే నేను దేనికైనా సిద్ధం. జగన్ ని అడుగుతున్నా..సెకీకి సంబంధించిన దానిలో నాతో ఎప్పుడైనా చర్చించారా ? ఒక శ్రీకాంత్ వచ్చారు ఇలా ఒప్పందం చేసుకుంటున్నారు సర్ మీరు..అని చెప్పారు తప్ప వాళ్లతో చర్చలు ఎక్కడా జరగలేదు. సంతకాలు పెట్టమని పంపించారు ఆ రోజు నైట్ పెట్టనని మా పీఎస్ తో చెప్పా. మార్నింగ్ అయితే క్యాబినెట్ లో పెడతామని అన్నారు. క్యాబినెట్ లో ఫార్వార్డ్ చేసుకున్నారు. చెవిరెడ్డి నన్ను విమర్శిస్తున్నాడు ఎందుకంటే జగన్ మెప్పు కోసం. నేను చంద్రబాబు, పవన్ కల్యాణ్ మెప్పు కోసం మాట్లాడలేదు. నేను గతంలో ఆ శాఖకు మంత్రిగా చేశాను కాబట్టి నన్ను అడిగారు కాబట్టి నేను చెప్పాల్సి వచ్చింది.
జగన్ సీఎంగా ఉన్నారని ఆయనకే అందరూ సపోర్ట్ గా మాట్లాడారు. కుటుంబంలో ఏ తల్లి అయినా సరే.. ఇద్దరు పిల్లల్లో ఒకరు బాగుండి మరొకరు బాగోకపోతే.. బాగోలేనివాళ్లకు ఏ తల్లి అయినా సపోర్ట్ చేస్తారు. జగన్ సీఎంగా ఉన్నారు. షర్మిల ఇబ్బందుల్లో ఉందని విజయమ్మ సపోర్టు చేసి ఉండొచ్చు. అలా అని చెప్పి తల్లి మీద కూడా ఇవన్నీ పెట్టడం కరెక్ట్ కాదు కదా? వాళ్ల ఫ్యామిలీ మ్యాటర్స్ వాళ్లు తేల్చుకోవాలి. విజయమ్మ వాళ్లిద్దరితో మాట్లాడాలి. దానికి మనం చేసేదేమీ లేదు. రాజశేఖర్ కుటుంబం కాబట్టి మనకు సింపతీ.
రాజశేఖర్ రెడ్డి ఫ్యామిలీ గురించి ఎవరూ మాట్లాడవద్దు అని ప్రెస్ మీట్ పెట్టి చెప్పాను. ఇద్దరికి పెద్ద విజయమ్మ. విజయమ్మ డెసీషన్ తీసుకుంటారు? మిగతా ఎవరూ ఆ ఫ్యామిలీ గురించి మాట్లాడొద్దు అని చెప్పాను. అందరూ జగన్ సీఎంగా ఉన్నారని ఆయనకు సపోర్ట్ గా మాట్లాడారు. ఈరోజు నాకు చాలా అన్యాయం జరిగింది. ఓపెన్ గా డిబేట్ కు వస్తే అన్నీ చెప్తాను.’’ అని బాలినేని శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యానించారు.
ఇవీ చదవండి: Balineni: బాలినేని జనసేనలోకి ఎంట్రీ వెనుక పొలిటికల్ స్ట్రాటజీ?
Chevireddy bhaskar reddy: స్వార్థం కోసం జగన్ పై నిందలా? బాలినేనిపై చెవిరెడ్డి ఫైర్
Adani court case: అమెరికా కోర్టులో అదానీపై కేసు.. మధ్యలో జగన్? వాస్తవం ఏంటి?
Adani Enterprises: అదానీ ఎంటర్‌ప్రైజెస్ రికార్డు.. మార్చి త్రైమాసికంలో 137.5 శాతం లాభం
