Vizag steel plant: విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణపై మండలిలో వాడీవేడి చర్చ జరిగింది. ప్రశ్నోత్తరాలలో సభ్యుల ప్రశ్నలకు మంత్రులు సమాధానం ఇచ్చారు. ప్రైవేటీకరణ చేస్తున్నారంటూ మండలిలో వైఎస్ఆర్ సీపీ సభ్యులు ఆందోళన చేశారు. వైఎస్ఆర్ సీపీ సభ్యుల ఆరోపణలకు మంత్రులు సమాధానం ఇచ్చారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రసక్తే లేదని పవన్ కల్యాణ్, మంత్రులు స్పష్టత ఇచ్చారు. వైఎస్ఆర్ సీపీ సభ్యుల ఆందోళనతో మండలి సమావేశాలు కాసేపు వాయిదా పడ్డాయి.
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేసే ప్రతిపాదన ఏదీ లేదని మంత్రి టీజీ భరత్ చెప్పారు. టాటా భాగస్వామ్యంతో వ్యాపార అభివృద్ధి చేసే యోచన ఉందన్నారు.
స్టీల్ ప్లాంట్ పై తీర్మానం అవసరం లేదని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. వైఎస్ఆర్ సీపీ హయాంలోనూ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రతిపాదన వచ్చిందన్నారు. ప్రైవేటీకరణను నిరసిస్తూ కార్మికులు ఆందోళనలు చేశారన్నారు. గత ప్రభుత్వం ప్రైవేటీకరణను ఆపేందుకు చర్యలు తీసుకోలేదన్నారు. స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ ఆపాలని కేంద్రాన్ని సీఎం చంద్రబాబు కోరారని తెలిపారు. కేంద్రమంత్రి వచ్చి కార్మికులతో చర్చించి ప్రైవేటీకరణ లేదని చెప్పారు. సెయిల్ లో కలిపి ప్రత్యేకంగా గనులు కేటాయించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. విశాఖ ఉక్కును లాభాల బాట పట్టించేందుకు ఎన్డీఏ సర్కారు చర్యలు తీసుకుంటుందన్నారు.
చాలా సమస్యలు: పవన్
స్టీల్ ప్లాంట్ నడపడానికి చాలా సమస్యలు ఉన్నాయని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేయబోమని స్పష్టంగా చెబుతున్నామన్నారు. ప్రైవేటీకరణ చేయవద్దని కేంద్ర హోంమంత్రిని కలిసి కోరానని పవన్ చెప్పారు. గతంలో డ్రెజ్జింగ్ కార్పొరేషన్ ను ప్రైవేటీకరిస్తామంటే మేమే ఆపామని గుర్తు చేశారు. స్టీల్ ప్లాంట్ నడిపే వ్యవహారంలో చాలా సవాళ్లు ఉన్నాయన్న పవన్.. స్టీల్ ఫ్యాక్టరీపై సమగ్రంగా చర్చించి చెబితే చర్యలకు కృషిచేస్తానని మాట ఇచ్చారు.
ఇవీ చదవండి: Vizag: రైల్లో అసౌకర్యం.. విశాఖ ప్రయాణికుడికి రూ.30 వేలు చెల్లించాలని ఆదేశం
Steel Plant: విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణపై మీ విధానం ఏమిటి?
CBN on Vizag Steel: విశాఖ స్టీల్ ప్లాంట్ పై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
Visakha Dairy: విశాఖ డెయిరీ రైతుల సంక్షేమం వదిలి సొంత లాభం చూస్తోంది
