HomeAndhra PradeshAir pollution in vizag: విశాఖ తీరంలో వాయుకాలుష్యం.. మండలిలో కీలక పరిణామం

Air pollution in vizag: విశాఖ తీరంలో వాయుకాలుష్యం.. మండలిలో కీలక పరిణామం

Air pollution in vizag: విశాఖ తీరంలో వాయు కాలుష్యంపై ఏపీ శాసన మండలిలో ప్రశ్నోత్తరాలు జరిగాయి. మండలి సభ్యుల ప్రశ్నలకు ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సమాధానం ఇచ్చారు. విశాఖ తీరంలో వాయు కాలుష్య స్థాయి (Air pollution in vizag) 7 రెట్లు పెరిగిందని ఈ సందర్భంగా పవన్ వెల్లడించారు.

వాయుకాలుష్యం జరగకుండా పరిస్థితి మెరుగుకు చర్యలు తీసుకుంటామన్నారు. పారిశ్రామిక వృద్ధి ప్రోత్సాహానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. విశాఖలో భారీ పెట్టుబడుల ఆకర్షణపై ప్రభుత్వం దృష్టి పెట్టిందని తెలిపారు. పర్యావరణ క్షీణత, కాలుష్య ప్రభావం తగ్గించేందుకు చర్యలు చేపడతామన్నారు. విశాఖలో కాలుష్య తీవ్రత, నివారణపై పీసీబీ అధ్యయనం చేస్తోందన్నారు. 2025 జనవరి నాటికి పీసీబీ అధ్యయన నివేదిక వస్తుందని తెలిపారు.

నివేదిక రాగానే విశాఖలో కాలుష్య నివారణకు కార్యాచరణ చేపడతామన్నారు. గ్రీన్ ఎనర్జీని రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని, కంప్రెస్డ్ బయో గ్యాస్ వినియోగంతో కాలుష్యం తగ్గిస్తామని పవన్ తెలిపారు. థర్మల్ పవర్ ప్రాజెక్టుల ఫ్లైయాష్ కూడా కాలుష్యానికి కారణమని పవన్ తెలిపారు. సిమెంట్ తయారీకి ఫ్లైయాష్ వాడి కాలుష్యం కట్టడికి చర్యలు తీసుకుంటామన్నారు.

విశాఖ, గుంటూరులో ఘన వ్యర్థాలతో విద్యుత్ తయారీ చేపడతామన్న పవన్.. ఘన వ్యర్థాలతో విద్యుత్ తయారీని ఇతర ప్రాంతాలకు విస్తరిస్తామని హామీ ఇచ్చారు. ఎన్జీవోల భాగస్వామ్యంతో కాలుష్య నివారణకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. డిసెంబర్ లో క్షేత్రస్థాయిలో పర్యటించి కాలుష్య కారాణాలు అన్వేషిస్తామని తెలిపారు. విశాఖలో కాలుష్య నివారణ చర్యలపై సమీక్షించి తగు చర్యలు తీసుకుంటామని పవన్ జవాబిచ్చారు.

ఇవీ చదవండి: Vizag steel plant: విశాఖ ఉక్కుపై మండలిలో మంటలు.. పవన్ ఏమన్నాడంటే
Polluted City: ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరం? ఢిల్లీకంటే 6 రెట్లు అధ్వానం!
Vizag Crime news: నగ్న వీడియోలు చూపి.. సామూహిక అత్యాచారం
Vizag: రైల్లో అసౌకర్యం.. విశాఖ ప్రయాణికుడికి రూ.30 వేలు చెల్లించాలని ఆదేశం
Visakhapatnam: విశాఖ‌లో 2 ద‌శ‌ల్లో 4 కారిడార్ల‌లో మెట్రో రైల్ ప్రాజెక్ట్

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు