HomeAndhra PradeshNimmala Rama Naidu: ఇరిగేషన్‌లో ఈ దుస్థితికి కారణం జగనే

Nimmala Rama Naidu: ఇరిగేషన్‌లో ఈ దుస్థితికి కారణం జగనే

Nimmala Rama Naidu: గత ఐదేళ్ల వైయస్సార్ సీపీ పాలన పాపాల ఫలితాలు ఇప్పుడు ప్రజలు అందరూ అనుభవిస్తున్నారని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు మండిపడ్డారు. జలవనరులే జాతికి జీవనాధారంగా చంద్రబాబు ఆనాడు పనిచేస్తే.. ఇరిగేషన్ వ్యవస్థే విధ్వంసంగా జగన్ పనిచేశారని దుయ్యబట్టారు. దాని పర్యావసనమే ఇరిగేషన్ లో ఈ దుస్థితి అని చెప్పారు. శాసనసభ సమావేశాల్లో ఆయన మాట్లాడారు. (Nimmala Rama Naidu)

‘‘గత ప్రభుత్వం రైతులను దగా చేసింది. గత వైయస్ఆర్సీపీ ప్రభుత్వం ఇరిగేషన్ కు కేవలం రూ.48వేల కోట్లు మాత్రమే కేటాయించింది. 2014-19 మధ్యలో ఇరిగేషన్ ప్రాజెక్టులపై రూ.1.20లక్షల కోట్లు ఖర్చు చేసింది. 2014-19 మధ్యలో పోలవరం పనులు 72శాతానికి పైగా పూర్తి. ఐదేళ్లలో పోలవరం విధ్వంసానికి గురైంది. ఐదేళ్ల విధ్వంసంతో గత పాలన పోలవరాన్ని 20ఏళ్లు వెనక్కి తీసుకెళ్లింది.

జగన్ అవినీతి కర పత్రికలో రోజూ అసత్యాలు, అబద్దాలు రాస్తున్నారు. వాళ్ల బ్రతుకే అబద్ధాల బతుకు. తెలుగుజాతికి ఇంత ద్రోహం చేసి, పోలవరాన్ని ముంచేసి..మళ్లీ పోలవరం గురించి మాట్లాడటం దొంగే దొంగ అన్నట్లు ఉంది. సమాధానం చెప్పలేక జగన్ అసెంబ్లీకి ముఖం చాటేశారు. పోలవరాన్ని విధ్వంసం చేసిన వ్యక్తికి పోలవరం గురించి మాట్లాడే అర్హత ఎక్కడుంది?

డయాఫ్రంవాల్ ను జగన్ విధ్వంసం చేసి, ఇవాళ వెయ్యి కోట్లు భారం పెట్టిన వ్యక్తికి పోలవరం గురించి మాట్లాడే అర్హత ఎక్కడుందని రైతాంగం ప్రశ్నిస్తుంది? నువ్వు సీఎంగా ఉండగా..2020ఆగస్టులో వచ్చిన వరదలకు డయాఫ్రం వాల్ దెబ్బతిందని సాక్షాత్తూ ఐఐటీ హైదరాబాద్ నిపుణులు చెప్పారు. ఇదే అసెంబ్లీ సాక్షిగా ..2022 జూన్ కి, 2022 డిసెంబర్ కి పోలవరం పూర్తి చేస్తామని అంటే డయాఫ్రం వాల్ పోయిన తర్వాత కూడా .. డయాఫ్రం వాల్ ఉందో లేదో తెలియని అసమర్ధ ముఖ్యమంత్రివి..

పోలవరం రీయింబర్స్ నిధులు రూ.3,385 కోట్లను కూడా దారి మళ్లించిన వ్యక్తి జగన్. 2019కి ముందు పోలవరం ఫేజ్-1, ఫేజ్-2 అని లేదు..కేవలం పోలవరం ప్రాజెక్టు అనే చంద్రబాబు సారథ్యంలో రూ.50వేల కోట్లతో ఆమోంది పొందింది. తర్వాత జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఫేజ్-1 41.15 అని, ఫేజ్-2 45.72అని తీసుకొచ్చి ఫేజ్ లు గురించి మాట్లాడటం చాలా ఆశ్చర్యం. చంద్రబాబు స్కీమ్ 45.72.. చంద్రబాబు స్కీమ్ నదుల అనుసంధానం.. 45.72కి పోలవరాన్ని పూర్తి చేసుకుని గోదావరి జలాలు ఉత్తరాంధ్ర, రాయలసీమకు తీసుకెళ్తాం.’’ అని రామానాయుడు వ్యాఖ్యానించారు.

ఇవీ చదవండి: Polavaram Project: చంద్రబాబు నిర్ణయాలే పోలవరానికి శాపం
Polavaram: పోలవరాన్ని 41.15 మీటర్లకు కుదించి బ్యారేజీగా మార్చే కుట్ర
Polavaram: పోలవరానికి రూ.12,500 కోట్లు ఇచ్చేందుకు కేంద్రం సుముఖత
Chandrababu: మూర్ఖత్వం, చేతగానితనం వల్లే పోలవరం ఆపేశారు
CM Jagan At Polavaram: చిన్న సమస్యను విపత్తుగా చూపే దౌర్భాగ్యమైన మీడియా..! సీఎం జగన్‌ ఫైర్‌

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు