HomeAndhra PradeshApar Generation: అపార్ జనరేషన్ కరెక్షన్స్‌కు 2025 మార్చి 31 వరకు గడువు

Apar Generation: అపార్ జనరేషన్ కరెక్షన్స్‌కు 2025 మార్చి 31 వరకు గడువు

Apar Generation: అపార్ జనరేషన్ లో కరెక్షన్ కు మార్చి 31-2025 వరకు సమయం ఇచ్చారని తెలుస్తోంది. (Apar Generation) రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే దాదాపు 70 శాతం పూర్తి అయిందని సమాచారం. మిగిలిన వాటికి ఆధార్, డేట్ ఆఫ్ బర్త్ మొదలైన కారణాలతో సమయం పడుతుందని అధికార వర్గాలు తెలిపాయి.

కానీ పూర్తి చేయాలని అన్ని స్థాయిల అధికారుల నుంచి HMs పై వస్తున్న తీవ్ర ఒత్తిడిని తగ్గించే విధంగా ఉన్నతాధికారులకు తగిన ఆదేశాలివ్వాలని ఉపాధ్యాయులు కోరారు. అయితే, ఏవైతే అవ్వలేదో వాటిని అంశాల వారిగా లిఖిత పూర్వకంగా ఇచ్చినట్లయితే ఆ సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని కమిషనర్ చెప్పినట్లు సమాచారం. దీనిపై ప్రధానోపాధ్యాయులు ఎటువంటి ఆందోళన చెందనవసరం లేదని, అధికారులకు తాము కూడా స్పష్టమైన ఆదేశాలు ఇస్తామని చెప్పారు.

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో ఇంకా వేలాది మంది విద్యార్థులు తెలుగు మీడియంలో చదువుతున్నారని కాబట్టి వారందరికీ 2025 మార్చిలో జరిగే SSC ఎస్‌ఎస్‌సి పరీక్షలను తెలుగు మాధ్యమంలో రాసుకోవడానికి అవకాశం ఇవ్వాలని అన్ని సంఘాల సభ్యులందరూ కోరారు. దీంతో ఆయన పరిశీలిస్తామని హామీ ఇచ్చారు.

2025 ఎస్‌ఎస్‌సి నామినల్ రోల్ సబ్మిషన్ గడువును పెంచాలని కోరారు. వారం రోజులు పెంచుతామని హామీ ఇచ్చారు.

వెకేషన్ డిపార్ట్మెంట్ అయిన విద్యా శాఖలో 2023 మరియు 2024 వేసవి సెలవుల్లో SSC పరీక్షా ఫలితాల తర్వాత సప్లిమెంటరీ పరీక్షలకు సంబంధించి విధులు నిర్వహించిన ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బందికి సంపాదిత సెలవులు మంజూరు చేయటానికి కమిషనర్ ఉత్తర్వులు లేవని పేర్కొన్నారు.

క్లారిఫికేషన్ కోసం రాశామనే కారణంతో కొన్ని జిల్లాల్లో అధికారులు ఇబ్బంది పెడుతున్నారని, దీనివలన రిటైర్డ్ అయిన ప్రధానోపాధ్యాయులు సరెండర్ లీవు బిల్లులు చేసుకోవటానికి ఇబ్బంది పడుతున్నారన్నారు.

ఈ సమస్యపై వెంటనే ఒక స్టాండర్డ్ ఇన్స్ట్రక్షన్స్ అన్ని జిల్లాల వారికి ఇవ్వాలని ప్రధానోపాధ్యాయ సంఘం తరఫున కోరింది. వారికి ఇంతకు ముందే ఆదేశాలు ఇచ్చామని, వెంటనే మరల వారికి తగిన ఆదేశాలు ఇస్తామని CSE అడ్మిన్ పార్వతి తెలియచేశారు.

ఈ సమావేశంలో అడ్మిన్ CSE పార్వతి, అడిషనల్ డైరెక్టర్ సర్వీసెస్ A.సుబ్బారెడ్డి, డిప్యూటీ డైరెక్టర్ S.అబ్రహం, డిప్యూటీ డైరెక్టర్ శైలజ పాల్గొన్నారు. గుర్తింపు పొందిన సంఘాల ప్రధాన బాధ్యులు పై అంశాలను చర్చించి తమ అభిప్రాయాలను తెలియజేశారు.

ఇవీ చదవండి: Education: కూటమి పాలనలో విద్యావ్యవస్థ సర్వనాశనం
Education: పిల్లలకు బడిపై ఆసక్తి పెంచేవి వృత్తి విద్యా కోర్సులు
Foreign Education: విద్యా విధానం టఫ్‌గా ఉండే దేశాలు ఇవీ.. ఆలోచించి నిర్ణయం తీసుకోవాలండోయ్‌!

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు