Inturi: తన భర్త, సోషల్ మీడియా యాక్టివిస్ట్ ఇంటూరి రవికిరణ్‌ను గత నెల 21 నుంచి పోలీసులు వేధిస్తూనే ఉన్నారని ఆయన భార్య వాపోయింది. వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్సార్‌సీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ ఇంటూరి రవికిరణ్ (Inturi) భార్య ఇంటూరి సుజన వైయస్ జగన్‌తో సమావేశమయ్యారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు.
గుడివాడలో రెండు కేసులు, అరండల్‌పేటలో ఒకటి, వైజాగ్‌లో రెండు ఇలా మొత్తం 9 కేసులు తన భర్తపై పెట్టారని ఆమె వాపోయారు. గుడివాడ, గుంటూరు పోలీసులు పీఎస్‌ల చుట్టూ తిప్పిన తర్వాత దువ్వాడ పోలీసులు వచ్చి సంతకం పెట్టాలని తీసుకెళ్ళి పీఎస్‌లో దారుణంగా ప్రవర్తించారన్నారు.
‘‘పోలీసులకు పైనుంచి వస్తున్న ఫోన్లను ఫాలో అయి దానికి సంబంధించినట్లు చేస్తున్నారు. ఒక స్టేషన్‌లో స్టేషన్ బెయిల్ వచ్చి బయటికి రాగానే ఇంకో పీఎస్ పోలీసులు వచ్చి తీసుకెళుతున్నారు. ఎక్కడికి తీసుకెళుతున్నారో కూడా చెప్పరు. ఏ కేసు అనేది చెప్పరు. కేసుల పేరుతో రాష్ట్రమంతా తిప్పుతున్నారు.
రాజమండ్రి సీఐ చాలా దారుణంగా ప్రవర్తించాడు. రవి చెప్పనివి కూడా చెప్పినట్లు రాసి సంతకాలు పెట్టించుకున్నారు. రిమాండ్‌కు తరలించారు. మమ్మల్ని స్టేషన్ల చుట్టూ తిప్పుతున్నారు. జగన్ ను కలిసి ఇదంతా వివరించాను. జగన్ భరోసా ఇచ్చారు. మాకు అండగా ఉంటామన్నారు.
పోలీసులపై నేను కూడా ప్రేవేట్ కేసులు వేస్తాను. రాజమండ్రి పోలీసులు రవికిరణ్‌ను దారుణంగా ప్రవర్తించారు. రాజమండ్రి ప్రకాష్‌నగర్ సీఐ తనను కొట్టారు. నా భర్త ఎలాంటి అసభ్యకరమైన, అశ్లీలమైన పోస్టులు పెట్టలేదు. ఈ కేసులన్నీ న్యాయపరంగా ఎదుర్కొంటాం.’’ అని ఇంటూరి భార్య తెలిపారు.
ఇవీ చదవండి: YSRCP Social Media: వైసీపీ సోషల్ మీడియాపై సీఎం చంద్రబాబు హాట్ కామెంట్స్
Social Media: 16 ఏళ్లలోపు పిల్లలకు ఆస్ట్రేలియాలో సోషల్ మీడియా బ్యాన్!
YS Jagan with YSRCP Social Media: వైఎస్సార్ సీపీ సోషల్ మీడియా సైనికులతో సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు!
Social Media Posts: అసభ్యకర పోస్టులపై ఏపీ సీఐడీ నజర్.. కఠిన చర్యల దిశగా అడుగులు
