Mithun Chakraborty: బాలీవుడ్ స్టార్ యాక్టర్, రాజ్యసభ ఎంపీ మిథున్ చక్రవర్తికి వింత అనుభవం ఎదురైంది. ఝార్ఖండ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయనకు (Mithun Chakraborty) చేదు అనుభవం కలిగింది. నిర్సా అసెంబ్లీ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి తరఫున మిథున్ చక్రవర్తి ఎన్నికల ప్రచారానికి వెళ్లారు. అయితే, మిథున్ పాల్గొన్న సభలో దొంగలు మత చేతివాటం ప్రదర్శించారు. ఏకంగా మిథున్ చక్రవర్తి వ్యాలెట్ దొంగలించారు.
తన పర్సు పోయిందనే విషయాన్ని గుర్తించిన ఆయన.. నిర్వహకులకు చెప్పారు. వాళ్లు మైకులో పర్స్ తిరిగి ఇచ్చేయాలని చాలా సమయం బతిమలాడారు. అయితే, ఎవరూ ముందుకు రాలేదు. కొట్టేసిన పర్సు ఇవ్వలేదు. దీంతో అసంతృప్తి వ్యక్తం చేసిన మిథున్ చక్రవర్తి.. షెడ్యూల్ లో కేటాయించిన సమయం కన్నా ముందే అక్కడి నుంచి వెళ్లిపోయారు.
బాలీవుడ్‌లో ఒకప్పుడు హీరోగా అద్భుతమైన మూవీస్ ను మిథున్ చక్రవర్తి చేశారు. కొంత కాలం కిందట నుంచి ఎంపిక చేసుకున్న పాత్రల్లో నటిస్తూ వస్తున్నారు. మొన్నా మధ్య తెలుగులో విక్టరీ వెంకటేశ్ నటించిన ‘గోపాల గోపాల’ చిత్రంలో మిథున్ చక్రవర్తి కనిపించారు. ప్రస్తుతం ప్రభాస్ ఫౌజీ (వర్కింగ్ టైటిల్) మూవీలో కీ రోల్ పోషిస్తున్నారు.
ఝార్కండ్ ఎన్నికల ప్రచారం కోసం వెళ్లిన ఆయనకు ఇలా పర్సు కొట్టేసిన అనుభవం ఎదురవడం గమనార్హం. పర్సు పోవడం, ఆ తర్వాత మైకులో అనౌన్స్ చేసినా తిరిగి ఇవ్వకపోవడం.. వింత అనుభవం అని చర్చ జరుగుతోంది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
ఇవీ చదవండి: Cricket Australia: కోహ్లీ కాదు.. ఆస్ట్రేలియా పత్రికల్లో ఇండియన్ ప్లేయర్ డామినేషన్!
Meenakshi Chaudhary: నడుము అందాలతో కవ్విస్తున్న మీనాక్షి చౌదరి.. ఫొటోలు
Nargis Fakhri: నర్గీస్ ఫక్రీ ట్రెండీ లుక్స్.. రెడ్ డ్రెస్ హాట్ బ్యూటీ ఫొటో గ్యాలరీ
Jacqueliene Fernandez: ఐల్యాండ్‌ను కొన్న హాట్ బ్యూటీ.. ఫొటో గ్యాలరీ
Rakul preet: న్యూ లుక్‌లో రకుల్ ప్రీత్ సింగ్.. ఫొటో గ్యాలరీ
