Enforcement Directorate: ఈడీ కేసులో మాజీ ఐఏఎస్ అధికారి బీపీ ఆచార్యకు భారీ ఊరట దక్కింది. ఈ మేరకు ఈడీ (Enforcement Directorate) కేసుల విచారణపై సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. జగన్ ఆస్తుల కేసులో ఐఏఎస్ అధికారి బీపీ ఆచార్యకు ఊరట లభించింది. బీపీ ఆచార్యను ముందస్తు అనుమతి లేకుండా విచారించకూడదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
ఉద్యోగ విధుల్లో అధికారులు, న్యాయమూర్తుల నిర్ణయాలపై ముందస్తు అనుమతి లేనిదే విచారించకూడదంది. సీఆర్పీసీ 197(1) మనీలాండరింగ్ కేసులకూ వర్తిస్తుందని సుప్రీం తెలిపింది. బీపీ ఆచార్యను ముందస్తు అనుమతి లేకుండా విచారించకూడదని గతంలో తెలంగాణ హైకోర్టు తీర్పు ఇచ్చింది. తెలంగాణ హైకోర్టు తీర్పును సుప్రీంలో ఈడీ సవాల్ చేసింది. ఈడీ పిటిషన్ ను కొట్టేస్తూ తెలంగాణ హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది. ఈడీ పిటిషన్ ను డిస్మిస్ చేసింది.
ఉద్యోగ విధులు నిర్వహిస్తున్నప్పుడు ఆరోపణలు వచ్చిన నేరాలకు ప్రభుత్వ ఉద్యోగులు, న్యాయమూర్తులను ప్రాసిక్యూట్ చేయడానికి ప్రభుత్వం ముందస్తు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని సుప్రీం తెలిపింది. జస్టిస్ అభయ్ ఓక, జస్టిస్ ఆగస్టీన్ జార్జ్ ఈ మేరకు కీలక తీర్పు వెలువరించారు.
వైయస్ జగన్ కు సంబంధించిన పలు కంపెనీలకు రాయితీలకు భూములు కట్టబెట్టి మేలు చేశారని ఐఏఎస్ అధికారి బీపీ ఆచార్యపై ఈడీ ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వం ముందస్తు అనుమతి లేకుండా పీఎంఎల్ఏ కింద ఆచార్యను ప్రాసిక్యూట్ చేయొద్దని గతంలోనే తెలంగాణ హైకోర్టు తీర్పు ఇచ్చింది. పీఎంఎల్ఏ కోర్టు బీపీ ఆచార్యకు వ్యతిరేకంగా ఇచ్చిన ఉత్తర్వులను 2019లోనే తెలంగాణ హైకోర్టు రద్దు చేసింది.
హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో ఈడీ సవాల్ చేసింది. హైకోర్టు తీర్పును సమర్థిస్తూ ఈడీ పిటిషన్ ను సుప్రీం డిస్మిస్ చేసింది. పీఎంఎల్ఏ సెక్షన్ 65, 71ఎ కింద తమకు ప్రత్యేక అధికారాలు ఉన్నాయని ఈడీ వాదించింది. ఈడీ వాదనలను సుప్రీంకోర్టు తిరస్కరించింది.
ఎవరీ బీపీ ఆచార్య?
1985లో భద్రాచలం సబ్ కలెక్టర్‌గా పనిచేసిన బీపీ ఆచార్య 1993లో వరంగల్ జిల్లా కలెక్టర్ గా పదోన్నతి పొందారు. అనంతరం 2017 డిసెంబరు వరకు తెలంగాణలో ప్లానింగ్ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా చేశారు. 2020లో పదవీ విరమణ చేసిన తర్వాత, మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం డైరెక్టర్ జనరల్ గా, తెలంగాణ రాష్ట్ర సాధారణ పరిపాలన విభాగంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా కూడా పనిచేశారు.
అవినీతి ఆరోపణలు
పబ్లిక్ యాజమాన్యంలోని ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ కు 2005–2010 మధ్యకాలంలో వైస్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్న సమయంలో గచ్చిబౌలిలో ఎమ్మార్ ప్రాపర్టీస్‌తో జాయింట్ డెవలప్‌మెంట్ వెంచర్‌కు సంబంధించి కుట్ర, మోసం, అవినీతి ఆరోపణలు వచ్చాయి. దీనిపై జనవరి 2012లో ఆచార్యను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అరెస్టు చేసింది.
2012, మార్చిలో బెయిల్‌పై బీపీ ఆచార్య రిలీజ్ అయ్యారు. అదే నెలలో బెయిల్‌ను రద్దు చేయడంతో లొంగిపోయారు. 2016 ప్రారంభంలో కోర్టు నుంచి స్టే తెచ్చుకున్నారు. ఆచార్యపై ఉన్న అభియోగాన్ని ఆ తర్వాత తెలంగాణ హైకోర్టు రద్దు చేసింది. 2019 జూన్ లో అభియోగాలు మోపిన 15 మందిలో ఆచార్య, మరో సీనియర్ ఐఏఎస్ అధికారి పేర్లు లేవు.
ఇవీ చదవండి: YS Jagan Clarity: ఫ్యామిలీ ఆస్తుల గొడవపై స్పష్టత ఇచ్చిన జగన్!
YS Jagan: వేంకటేశ్వర స్వామితో ఆడుకుంటున్నారు.. జాగ్రత్త!
The Wire Story on Viveka murder case: వివేకా హత్యకేసుపై “ది వైర్” సంచలన కథనం.. సీబీఐ విచారణ తీరు ప్రస్తావన!
YS Jagan bail: జగన్ బెయిల్ రద్దు ప్రమాదం!
