HomeAndhra PradeshRushikonda: అద్భుతమైన భవనాలు కడితే దుర్మార్గం.. ఏమీ కట్టకపోతే అమోఘం!

Rushikonda: అద్భుతమైన భవనాలు కడితే దుర్మార్గం.. ఏమీ కట్టకపోతే అమోఘం!

Rushikonda: రుషికొండపై గత ప్రభుత్వంలో నాటి సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి నిర్మించిన భవనాలపై ఎన్నికల ఫలితాలు రాగానే పెద్ద రచ్చే జరిగింది. ప్యాలెస్ లు కట్టుకున్నాడంటూ జగన్ పై అనేక ఆరోపణలు, విమర్శలు చేశారు. టీడీపీ, బీజేపీ, జనసేన నేతలు అవేదో జగన్ సొంత బిల్డింగుల్లా ప్రచారం చేశారు. ఇప్పుడు నాలుగు నెలల తర్వాత సీఎం చంద్రబాబు రుషికొండను (Rushikonda) సందర్శించిన ముఖ్యమంత్రి.. జగన్ పై చేసిన వ్యాఖ్యలను చూసిన ప్రజానీకం నివ్వెరపోతోంది.

2014లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు.. అమరావతిని రాజధానిగా చేశారు. ఐదేళ్లు అధికారంలో ఉండి కూడా కనీసం నాలుగైదు ఐకానిక్ భవనాలు నిర్మించలేకపోయారు. పైగా వేలాది ఎకరాలు భూసమీకరణ చేశారు. మూడు పంటలు పండే భూములను బీళ్లుగా మార్చారన్న అపవాదు మూటగట్టుకున్నారు. తాత్కాలిక భవనాల పేరిట చిన్న వర్షం వచ్చినా నీళ్లు కారిపోయే టెంపరరీ సెక్రటేరియట్, టెంపరరీ హైకోర్టు భవనాలు నిర్మించి మమ అనిపించారన్న ఆరోపణలు ఉన్నాయి. వర్షం వస్తే బురదమయంగా మారిపోయే పరిస్థితిని సృష్టించారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి.

నిర్మించిన తాత్కాలిక భవనాలకు తన మీడియాలో భారీ ఎత్తున ప్రచారం చేయించుకున్న ఘనత బాబుగారిదన్న పేరుంది. ఇంతకు ముందు తన 14 సంవత్సరాల పరిపాలనలోనూ ఇదే పంథా అనుసరించిన చంద్రబాబు.. ఇప్పుడు కూడా ఆ పద్ధతి విడనాడటం లేదు. హైటెక్ సిటీ, హైదరాబాద్ రింగ్ రోడ్డు, ఇతర నిర్మాణాలను తానే చేపట్టానని, అసలు హైదరాబాద్ నగరాన్ని ప్రపంచ పటంలో తానే పెట్టానంటూ చంద్రబాబు చెప్పుకుంటారు. దీనిపై ఇప్పటికీ ఆయనను ట్రోల్ చేసే వారి సంఖ్య అధికంగానే ఉంది.

రాష్ట్ర విభజన అనంతరం 2014లో అధికారంలోకి వచ్చాక అమరావతి నిర్మాణంపై గ్రాఫిక్స్ లతో కాలం గడిపేశారు. ఏ దేశ పర్యటనకు వెళ్తే ఆ దేశ రాజధాని టెక్నాలజీని అమరావతికి తీసుకొస్తామన్న వ్యాఖ్యలు రాజధాని అంటేనే అభాసుపాలు చేశాయి. అభివృద్ధి, సంక్షేమం విషయంలోనూ చంద్రబాబుది అదో రకమైన స్టైల్. హుద్ హుద్ తుపాను వచ్చిన సమయంలో ఓ రంపం చేతబూని చెట్టును కోస్తూ ఫొటోలు, వీడియోలకు పోజులిచ్చారని అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. పబ్లిసిటీ చేసుకోవడంలో చంద్రబాబును మించిన నాయకుడు మరొకరు లేరనేది చాలా మంది ప్రముఖులు చెప్పే మాట.

ఇప్పుడు కూడా రోడ్లమీద గుంతలు పూడ్చే కార్యక్రమంలో భాగంగా రోడ్డు రోలర్ ని నడుపుతున్నట్టు ఫొటో దిగారు. తన అనుకూల పత్రికలు, టీవీల్లో ఇవి ప్రముఖంగా ప్రచారం వచ్చేలా చేసుకుంటారు. ఒక వర్గం మీడియా చెప్పినట్లు ఆయన వినడం, ఈయన చెప్పినట్టల్లా ఆ మీడియా మసలుకోవడం చాలా ఏళ్లుగా షరా మామూలే అన్నట్లు నడుస్తోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

పబ్లిసిటీ చేసుకోలేని జగన్
చంద్రబాబు అధికారం చేజారిన తర్వాత 2019లో వైయస్ జగన్ పగ్గాలు చేపట్టారు. వచ్చీ రాగానే గ్రామ, వార్డు సచివాలయాల ఏర్పాటు, 1.35 లక్షల మంది శాశ్వత ప్రభుత్వ ఉద్యోగులను నియమించారు. 2.6 లక్షల వాలంటీర్లను నియమించారు. విలేజ్ క్లినిక్ లు, రైతు భరోసా కేంద్రాలు, పేద అక్కచెల్లెమ్మలకు 31 లక్షల ఇళ్ల పట్టాలు, వాటిలో 22 లక్షల ఇంటి నిర్మాణాలు చేపట్టారు. నాడు నేడు కార్యక్రమం కింద రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ బడులను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దే బృహత్తర కార్యక్రమాన్ని మొదలు పెట్టారు. ప్రభుత్వాస్పత్రులకు మహర్దశ తీసుకొచ్చారు. 17 మెడికల్ కాలేజీలను మొదలు పెట్టి వాటిలో 5 పూర్తి చేసి ప్రారంభించారు.

4 పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. భోగాపురం ఎయిర్ పోర్టు, గిరిజన విశ్వవిద్యాలయం, కర్నూలులో న్యాయ విశ్వవిద్యాలయం, ఐటీ సెంటర్ గా విశాఖ అభివృద్ధి, రాయలసీమలోని కొప్పర్తిలో ఇండస్ట్రియల్ హబ్.. ఇలా రాష్ట్రంలో మూడు ప్రాంతాలూ సమానంగా అభివృద్ధి చెందాలని కాంక్షించడమే కాదు.. ఆ మేరకు అడుగులు కూడా వేగంగా వేశారు. అయితే, వీటన్నింటినీ కేవలం జగన్ తన స్పీచులో ప్రతిబింబిచేలా చేశారు తప్ప.. క్షేత్రస్థాయిలో ప్రచారం చేసుకోవడంలో, ప్రజలకు విడమరిచి చెప్పడంలో జగన్ ఫెయిల్ అయ్యారన్న వాదన ఉంది.

రుషికొండ భవనాల మాదిరిగా మీరూ కట్టలేరా?
రుషికొండపై (Rushikonda) తన ప్యాలెస్ నిర్మించుకున్నారన్న ప్రస్తుత ప్రభుత్వ పెద్దల మాటలు వారి ప్రవర్తనకు నిదర్శనం అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అమరావతిలో గానీ, రాష్ట్రంలోని ఏ ప్రాంతంలో గానీ ఎన్నడూ ఇలాంటి బిల్డింగులు కట్టలేకపోయిన చంద్రబాబు.. ఇతర నేతలు.. ఇప్పుడు జగన్ అద్భుతమైన భవనాలు నిర్మించి చేసి చూపిస్తే అది వినాశనం ఎలా అవుతుందన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రజా అవసరాల కోసం వినియోగించుకోవడం చేతగాక జగన్ విధ్వంసం అంటూ మాటలు మాట్లాడటం ఏమిటని మేధావులు ప్రశ్నిస్తున్నారు. తాను కట్టడు, మరొకరు కడితే ఒప్పుకోడు.. అన్నట్లు ప్రభుత్వాధినేత తీరు ఉందంటున్నారు. ఏనాడూ కట్టని మీ తీరు అద్భుతం, అమోఘం.. కానీ అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో మంచి ప్రభుత్వ భవనాలు నిర్మిస్తే వంకలు పెట్టడం ఏమిటని మేధావులు మండిపడుతున్నారు.

ఇవీ చదవండి: AP Roads: జనవరి కల్లా గుంతలనేవి లేకుండా చేస్తాం: CBN
Diwali Wishes: ఆనందాల దీపాలు వెలగాలి.. సీబీఎన్, జగన్ దీపావళి విషెస్
YS Jagan in Pithapuram: పిఠాపురంలో సీఎం జగన్ మాస్‌ స్పీచ్.. ఇక్కడ చదవండి
World tourism day 2023: టూరిజంలో నంబర్‌ వన్‌ అవుదాం.. ప్రపంచ పర్యాటక దినోత్సవంలో మంత్రి రోజా
Dwaraka Tirumala: వాళ్లకంటే బాగా చేసి చూపిస్తున్నాం.. జగన్నాథపురంలో పవన్

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు