HomeAndhra PradeshAndhra: మూడు సిలిండర్లపై గప్పాలు కొట్టుకుంటున్న కూటమి పార్టీలు

Andhra: మూడు సిలిండర్లపై గప్పాలు కొట్టుకుంటున్న కూటమి పార్టీలు

Andhra: మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తూ పేద కుటుంబాల్లో దీపం పెట్టామని కూటమి పార్టీలు గప్పాలు కొట్టుకుంటున్నాయని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైయస్ షర్మిల మండిపడ్డారు. ఉచిత సిలిండర్ల పేరుతో కూటమి ప్రభుత్వం విద్యుత్ చార్జీలను పెంచి నడ్డి విరుస్తోందన్నారు. ఈ మేరకు ఎక్స్ లో ఆమె ట్వీట్ చేశారు.

‘‘కూటమి సర్కార్… విద్యుత్ సర్దుబాటు చార్జీలతో మరోవైపు వాతలు పెడుతోంది. “ఒక చేత్తో ఇచ్చి మరో చేత్తో లాక్కోవడం అంటే” ఇదే మరి. ఉచిత సిలిండర్ల పథకం కింద ఏడాదికి ఇచ్చేది రూ.2,685 కోట్లు.. ప్రజల దగ్గర నుంచి కరెంటు బిల్లుల రూపంలో ముక్కుపిండి అదనంగా వసూలు చేసేది రూ.6వేల కోట్లు. ఇంకా రూ.3వేల కోట్లు ప్రజలపైనే అధనపు భారం పడుతుంది కదా.

దీపం-2 కింద వెలుగులు పక్కన పెడితే.. కరెంటు బిల్లుల రూపంలో కుటుంబాల్లో కూటమి ప్రభుత్వం నింపేది కారు చీకట్లు. గత వైసీపీ చేసిన పాపమే ఇదని, ఈ ప్రభుత్వానికి సంబంధం లేదని, బిల్లుల వసూళ్లకు అనుమతి ఇచ్చింది APERC తప్ప.. మేము కాదని, చెప్తున్నవి కుంటి సాకులు తప్ప మరోటి కాదు.

గత ప్రభుత్వం 9 సార్లు చార్జీలు పెంచిందని, తాము అధికారంలోకి వచ్చాక.. ఒక్క రూపాయి కూడా అదనపు భారం మోపమని, అవసరం అయితే 35 శాతం చార్జీలు తగ్గిస్తామని హామీలు ఇచ్చారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్లలో 9 సార్లు చార్జీలు పెంచితే, మీరూ మొదలుపెట్టారు కదా.

మీకు వాళ్లకు ఏంటి తేడా? 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం రూ.35 వేల కోట్లు ప్రజలపై భారం మోపితే, మీరు కూడా భారం మోపడం మొదలు పెట్టారు కదా. మీకు వాళ్లకు ఏంటి తేడా. రూ.6 వేల కోట్లు ప్రజలపై మోపడం భావ్యం కాదు. బీజేపీకి మద్దతు ఇస్తున్నారు కదా… సాయం తీసుకురండి. ప్రభుత్వమే ఈ భారం మోయాలని డిమాండ్ చేస్తున్నాం. ప్రజలపై సర్దుబాటు చార్జీల భారాన్ని మోపినందుకు నిరసనగా ఈ నెల 5 న ఏపీ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిస్తోంది.’’ అని షర్మిల పేర్కొన్నారు.

ఇవీ చదవండి: Sharmila: సాయిరెడ్డికి షర్మిల కౌంటర్.. మీ బిడ్డలపై ప్రమాణం చేయగలరా?
YS Sharmila: షర్మిల కంట తడి.. అన్నపై హాట్ కామెంట్స్.. దౌర్భాగ్యుడు, శాడిస్ట్ అంటూ… పూర్తి ప్రసంగం ఇదీ
Sharmila: కరెంటు చార్జీల భారం ఉపసంహరించుకోవాలి
Sharmila on Jagan: షర్మిల కౌంటర్.. ఇది సామాన్యం కాదు జగన్ సార్!

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు