AP Roads: డబ్బులు ఊరికే రావని సీఎం చంద్రబాబు అన్నారు. ఆ రోజు, ఈరోజు ఒకటే చెబుతున్నా.. డబ్బులు ఊరికే రావు.. సంపద సృష్టిస్తే.. వ్యక్తిగత ఆదాయాలు పెరుగుతాయి.. రాష్ట్ర ఆదాయం పెరుగుతంది. ఆ డబ్బులు ఖర్చుపెట్టి పేదల సాధికారత సాధించవచ్చు. ఇందుకు ఇన్ ఫ్రా స్ట్రక్చర్ అవసరం.. అని చంద్రబాబు పేర్కొన్నారు. రోడ్లపై గుంతలు (AP Roads) పూడ్చే కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. అనకాపల్లి జిల్లా వెన్నెలపాలెం బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడారు.
గుంతలు లేని రోడ్ల కోసం మొదట రూ.290 కోట్లు ఇచ్చాం. మరో రూ.220 కోట్లు ఇచ్చాం.. అది కూడా చాలదంటే మళ్లీ రూ.350 కోట్లు ఇచ్చాం. ఎస్కో బార్ క్రియేట్ చేసిన గుంతలను పూడ్చడానికి మొత్తం రూ.860 కోట్లు ఖర్చు పెడుతున్నాం. రాష్ట్రాన్ని ఎంత విధ్వంసం చేశాడో.. ఎప్పటికప్పుడు మీకు చెప్పాను..మామూలు విధ్వంసం కాదు. ఈ ఐదు నెలల్లో అన్ని డిపార్ట్ మెంట్లను సమీక్షించాను. సమర్ధవంతమైన అధికారులు నిర్వీర్యమయ్యారు. అన్ని శాఖలను ధ్వంసం చేశారు. వాళ్ల పనులు చేసుకోవడానికి పారదర్శకంగా లేకుండా చేసి రాష్ట్రాన్ని ముంచారు. (AP Roads)
రాత్రింబవళ్లు ఒక్కటే ఆలోచిస్తున్నా.. అన్ని వ్యవస్థలను గాడిలో పెట్టి అభివృద్ధి పథంలో నడిపించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాం. జనవరి కల్లా గుంతలనేవి లేకుండా చేస్తాం. ఐదేళ్లలో అన్ని రోడ్లను ఏవిధంగా అభివృద్ధి చేయాలో స్పష్టమైన అవగాహనతో ముందుకు వస్తాం. నేషనల్ హై వే పనులపై ఇప్పటికే సమీక్ష చేశాం. 75 వేల కోట్లు ఖర్చు చేస్తున్నాం. పర్మిషన్లు, ల్యాండ్ అక్విజైషన్ల బాధ్యత నాది.. రెండున్నరేళ్లలో అవి పూర్తి చేయాలి.
ఓఆర్ ఆర్ అమరావతి, విజయవాడ ఈస్ట్రన్ బైపాస్ , కుప్పం – హోసూర్ బెంగళూరు రోడ్డు, భోగాపురం నుంచి మూలపేట వరకు సముద్రం వైపు ఒక రోడ్డు తీసుకుపోవడం కానీ.. సిక్స్ లైన్స్ ను 8 లైన్స్ గా చేయడానికి మరో 50 వేల కోట్లు ఖర్చు చేస్తాం.. రాబోయే ఐదేళ్లలో లక్షా యాబై వేల కోట్లు ఖర్చు చేస్తాం.
ఎంత దుర్మార్గం అంటే.. విభజన చట్టంలో ఒక హామీ ఇచ్చారు. విశాఖ రైల్వే జోన్ ఏర్పాటుకు భూమి ఇవ్వకుండా ఐదేళ్లు వృధా చేశారు. నేను వచ్చిన వెంటనే మడసర్లోవాలో వాళ్లకు భూమి ఇచ్చి రైల్వే జోన్ ఏర్పాటును ముందుకు తీసుకువెళ్లేందుకు కృషి చేస్తున్నా. గత ప్రభుత్వం ధ్యాసంతా దోచుకోవడంపైనే తప్ప అభివృద్ధి చేయడం పై లేదు. అందుకే కేంద్రం నిధులిస్తానన్నా.. వారు ఏమీ చేయలేకపోయారు.
నిన్న మిట్టల్ అనే వ్యక్తి నక్కపల్లి దగ్గర 60-70 వేల కోట్లతో స్టీల్ ఫ్యాక్టరీ పెడతానని ముందుకు వచ్చాడు. నేనే డ్వాక్రా సంఘాలు పెట్టా.. అదే నా మానస పుత్రిక. పొదుపు ఉద్యమాన్ని ప్రోత్సహించా. అప్పుడు నేను చూపించిన చొరవ వల్లే ఇప్పుడు అవి ఇంత బలంగా ఉన్నాయి. నేను ఇచ్చాపురం వెళితే నేను కూడా టీ పెట్టి.. అక్కడ ఉండే ఫ్రెండ్స్ కు ఇచ్చాను. వంట చేయడం చాలా సులభం. ఆడబిడ్డలకు డ్రోన్స్ ఇచ్చి రైతుల పొలాల్లో మందు కొట్టే కార్యక్రమం అప్పజెబుతాం..
నేను ప్రస్తుతం గురించి ఆలోచించను. రాబోయే 20-30 ఏళ్లలో ఏం జరుగుతుందో ముందే ఆలోచించి తదనుగుణంగా ప్రణాళికలు వేస్తా. మొదటి రోజు నాకే అర్థం కాలేదు.. ఈ బురదలో నుంచి రాష్ట్రాన్ని ఎలా బయటికి తీసుకురావాలని ఆలోచించా. వచ్చిన వెంటనే ఇటుక ఇటుక పేర్చి రాష్ఠ్ర పునర్నిర్మాణం చేస్తున్నా. పోలవరం డయా ఫ్రం వాల్ ను విధ్వంసం చేస్తే.. పునర్నిర్మించేందుకు కృషి చేస్తున్నాం. జూన్ లో పోలవరం నీటిని విశాఖకు తెస్తా.. రెండేళ్లలో ప్రాజెక్టును పూర్తి చేస్తాం.
అమరావతిపై.. దుర్మార్గుడు ఆ రోజు మూడు ముక్కలాట ఆడాడు. మూడు రాజధానులు అన్నాడు. అమరావతికి అండగా నిలబడిన విశాఖ, అనకాపల్లి ప్రాంత ప్రజలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. అభివృద్ధే ముద్దు అని మాకు మద్దతు ఇచ్చారు. రాజధాని ముసుగులో వీరు చేసిన పని భూ కబ్జాలు, ప్రజల ఆస్తులు కొట్టేయడం తప్ప.. ఈ దుర్మార్గుడు చేసిన పని చూస్తే..రోడ్ల గుంతలు పూడ్చడానికి డబ్బు లేదు కానీ.. రూ.450 కోట్లతో రుషికొండలో ప్యాలెస్ కట్టుకున్నాడు. ఏమనాలో నాకు తెలియడం లేదు. ఈ దుర్మార్గుడు చేసిన పని చూస్తే.. ఇలాంటి వాళ్లకు ఎలాంటి శిక్ష వేయాలో నాకు తెలియడం లేదు.
నాసిరకం మద్యం.. తాగితే కడుపులో మంట.. హోల్ సేల్, రిటైల్ మ్యాన్యుఫ్యాక్చరింగ్ ఎవరిది.. ఏపీ ఎస్కో బార్ ది..ఇది కాదు.. కొలంబోలో జరిగిన యదార్థ గాధ ఇది. ఒక రౌడీ..ఒక నేరస్తుడు దేశాన్ని ఎలా అతలాకుతలం చేశాడో.. ఒక చరిత్ర.. సుప్రీంకోర్టు జడ్జిలను కూడా చంపేశాడు.. ఆ చరిత్ర తెలుసుకుంటే.. ఏపీ ఎస్కో బార్ గురించి మీకు ఒక అవగాహన వస్తుంది.
కొంతమంది దుర్మార్గులు, నీచులు ఉన్నారు సమాజంలో.. వీరు మనుషులా.. మానవ మృగాలా ? వారిని నడిరోడ్డులో ఉరితీయాలి. మద్యం తాగితే.. గంజాయి తీసుకుంటే మహిళలు ఆడపిల్లల్లా కాకుండా విలాస వస్తువులుగా చూసే వారికి వళ్లు వణికేలా చర్యలు తీసుకుంటా.అలాంటి వాళ్లు కబడ్డార్ జాగ్రత్తగా. ఉండండి. మక్కెలిరిగే విధంగా చట్టాలు తెస్తా.’’ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
ఇవీ చదవండి: Chandrababu: ఆంధ్రా ఎస్కోబార్.. రోడ్లన్నీ నాశనం చేశాడు
Nara Chandrababu Naidu: నా మీటింగ్‌లో ఆర్భాటాలు ఉండవు.. చెట్లు నరకడం ఉండదు
Chandrababu: జనసేన, బీజేపీలతో సమన్వయం చేసుకుని ముందుకెళ్లాలి
Chandrababu: నేను హైదరాబాద్‌ను అభివృద్ధి చేస్తే చాలా మంది విమర్శించారు
