Train: సాధారణంగా మనం రైల్లో (Train) ప్రయాణించేటప్పుడు విండో సైడ్ సీట్ అంటే చాలా మంది ఇష్టపడుతుంటారు. బయట ప్రకృతి అందాలను తిలకించడానికి వీలుగా విండో సీట్‌ను ఎక్కువ మంది ప్రిఫర్ చేస్తుంటారు. ఈ నేపథ్యంలో అసలు ట్రైన్‌లో విండో దగ్గర ఇనుప కడ్డీలు అడ్డంగానే ఎందుకు ఉంటాయో చాలా మందికి తెలియదు. నిలువుగా ఎందుకు ఉండవనే విషయాన్ని ఈ కథనంలో చూడండి..
రైల్లో (Train) వెళ్లేటప్పుడు బయట నుంచి ఏవైనా తినుబండారాలు కొనుక్కోవాలనుకుంటే వాటిని మనం రైలు దిగకుండానే కిటికీ ఇనుక కడ్డీల మధ్యలో తేలిగా తీసుకోవచ్చు. సాధారణంగా జైళ్లలో నిలువు ఇనుప చువ్వలు అమర్చి ఉంటారు. అలాగే నిలువు కడ్డీలు అమర్చడం వల్ల అందులో మనం బంధీ అయినట్లు ఫీలింగ్ కలుగుతుంది. జైలు చువ్వలు, పక్షుల పంజరాలు, ఇంటి ఫెన్సింగ్ లాంటివి నిలువు కడ్డీలతో అమరుస్తారు.
అడ్డంగా కడ్డీలు ఉండటం వల్ల ఏవైనా ప్రమాదాలు జరిగినప్పుడు కూడా తొందరగా బయట పడే అవకాశాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. నిలువు కడ్డీల కంటే అడ్డు కడ్డీలను తొందరగా వంచి ప్రమాద సమయాల్లో తప్పించుకోవచ్చని చెబుతున్నారు. నిలువు కడ్డీల కంటే అడ్డు కడ్డీలే తొందరగా వంగుతాయని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రైళ్లలో ఎక్కువగా అడ్డంగా కడ్డీలు అమర్చి ఉంటారు.
మరోవైపు రైలు బోగీల్లో ప్రవేశ ద్వారం పక్కనే ఉన్న కిటీకీ చువ్వలు మిగిలిన కిటికీల చువ్వల కంటే ఎక్కువగా ఉంటాయి. ఈ తేడాను చాలా మంది గమనించి ఉండరు. ఇందుకు కూడా కారణాలు ఉన్నాయి. ప్రవేశ ద్వారం దిగిన వెంటనే చాలా మంది దొంగతనాలు చేస్తుంటారు. కిటికీ పక్కనే ఉండటంతో దిగేటప్పుడు ప్రయాణికుల సామాగ్రిని ఎత్తుకెళ్లే అవకాశాలుంటాయి. ఇలాంటి దొంగతనాలను అరికట్టేందుకు రైల్వే శాఖ మెయిన్ డోర్ పక్కన ఉన్న విండోకు ఎక్కువ కడ్డీలు అమర్చి ఉంటుంది.
ఇండియా నలుమూలలా రైలు మార్గాలు..
రైలు మార్గాలు భారతదేశం నలుమూలలా విస్తరించి ఉన్నాయి. భారతీయ రైలు మార్గాలపై ప్రభుత్వానికి ఏకఛత్రాధిపత్యం ఉంది. ఇండియన్ రైల్వేలు ప్రపంచంలోనే అత్యంత రద్దీ కలిగిన రైలు మార్గాలుగా పేరుగాంచాయి. రైలు మార్గాలు మొత్తం దూరం సుమారుగా 1,14,500 కిలోమీటర్లు ఇది సుమారు 65,000 కి.మీ రూటు ఉంటుంది. 7,500 స్టేషన్లు మన ఇండియాలో ఉన్నాయి. 2011 నాటికి రైల్వేల వద్ద 2,40,000 వాగన్లు, 69,000 కోచ్ లు, 9000 ఇంజిన్లు ఉన్నాయి.
ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో ఉద్యోగులను కలిగిన్న సంస్థల్లో భారతీయ రైల్వేది రెండో స్థానం భారతీయ రైల్వే కంప్యూటరీకరణలో అన్నిటిలో మొదటి స్థానంలోనే ఉంది. ముందస్తుగా ప్రయాణం ఖరారు చేసుకునేందుకు, మార్పులు చేసుకునేందుకు సౌకర్యం ఉంది. ఈ విభాగం భారతీయ రైల్వే ఆహార నిర్వహణ, పర్యాటక సంస్థ నిర్వహిస్తోంది. ఇది భారతీయ రైల్వే మంత్రిత్వ శాఖ కింద పనిచేస్తూ భారత రైల్వే రవాణా వ్యవస్థను నిర్వహిస్తోంది. రైల్వే మంత్రిత్వ శాఖ కేంద్ర రైల్వే మంత్రి నిర్వహణలో ఉండే రైల్వే విభాగం, రైల్వే బోర్డు కింద పనిచేస్తుంది. దీన్ని పరిపాలన సౌలభ్యం కోసం 18 జోన్లుగా విభజించారు.
Read Also : Gold Rates Today (14-06-2023): గోల్డ్‌పై ఫెడ్ ప్రభావం.. ఇవాళ్టి పసిడి, వెండి ధరలు ఇవీ..