IPL 2025: ఐపీఎల్ 2025 రిటెన్షన్ లో ఓ స్టార్ ప్లేయర్ రూ.20 కోట్లు దక్కించుకోబోతున్నాడట. ఓ నివేదిక ప్రకారం ఈ వార్త ఇప్పుడు వైరల్ గా మారింది. ఇండియన్ ప్లేయర్స్ లో కోహ్లీ, రోహిత్, బుమ్రా కాదు.. ఓ విదేశీ ప్లేయర్ (IPL 2025) ఈ మేరకు గిరాకీ పలకనున్నాడని సమాచారం.
ఓ నివేదిక ప్రకారం, వెస్టిండీస్ వికెట్ కీపర్ బ్యాటర్ నికోలస్ పూరన్‌ను లక్నో సూపర్ జెయింట్స్ రూ. 20 కోట్లకు రిటైన్ చేసుకోవడానికి సిద్ధంగా ఉందని తెలుస్తోంది. LSG తమ మొదటి రిటెన్షన్ పిక్‌గా పూరన్‌ని ఖరారు చేసిందని, పోటీ చరిత్రలో అత్యంత ఖరీదైన రిటెన్షన్‌లలో అతను ఒకడు అవుతాడని నివేదిక పేర్కొంది.
ఎల్‌ఎస్‌జి కెఎల్ రాహుల్‌ను కొనసాగించడం లేదని అనేక రిపోర్టులు ఇప్పటికే పేర్కొన్నాయి. అయితే, అది పూరన్‌ను ఆటోమేటిక్ కెప్టెన్సీ ఎంపికగా మార్చలేదని సమాచారం. LSG ఆ నిర్ణయం తీసుకోవడానికి వేలం కోసం వేచి చూడాలని నిర్ణయించిందట. అతను అందుబాటులోకి వస్తే రిషబ్ పంత్ కోసం కూడా వెళ్లే చాన్స్ ఉందంటున్నారు.
“మెగా వేలానికి ముందు పూరన్‌ను రిటైన్ చేసుకోవడానికి ఎల్‌ఎస్‌జి రూ. 20 కోట్లకు పైగా చెల్లించేందుకు అంగీకరించిందని ఐపీఎల్ సర్కిల్‌ల్లో ప్రచారం జరుగుతోంది. మెంటార్ జహీర్ ఖాన్, కోచ్ జస్టిన్ లాంగర్‌తో సంప్రదింపులు జరిపిన తర్వాత రెండు నిమిషాల్లో రెండు పార్టీల మధ్య ఒప్పందం కుదిరింది’’ అని ఐపీఎల్ వర్గాలు వెల్లడించాయి.
పూరన్‌తో పాటు ఫాస్ట్ బౌలర్ మయాంక్ యాదవ్ మరియు స్పిన్నర్ రవి బిష్ణోయ్‌లు గ్యారెంటీ రిటెన్షన్ లిస్టులో ఉన్నారని నివేదిక పేర్కొంది.

పూరన్, మయాంక్, బిష్ణోయ్ వంటి ఓవర్సీస్, క్యాప్డ్ ప్లేయర్‌లను రిటైన్ చేయడానికి లక్నో రూ. 40 కోట్లు వెచ్చించే అవకాశం ఉందట. ఆయుష్ బదోనీ, మొహ్సిన్ ఖాన్ వంటి అన్‌క్యాప్డ్ ప్లేయర్‌లు ఆటగాళ్లు, ఫ్రాంచైజీతో అవగాహన ప్రకారం తీసుకోవడం జరుగుతుందని ఐపీఎల్ వర్గాల టాక్.
ఇదిలా ఉండగా, సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) ఐపీఎల్ వేలానికి ముందు ఆస్ట్రేలియా బ్యాటర్ ట్రావిస్ హెడ్, యువ భారత ఆల్ రౌండర్ నితీష్ కుమార్ రెడ్డిని తమ చివరి ఇద్దరు క్యాప్డ్ ప్లేయర్‌లుగా ఉంచుకోనుంది.
ESPNcricinfo ప్రకారం, హెడ్‌ని రూ.14 కోట్లకు రిటైన్ చేసుకోగా, నితీష్ రెడ్డి రూ.6 కోట్ల విలువైన డీల్‌ను దక్కించుకుంటాడని చెబుతున్నారు.
ఈ రెండు కీలక నిలుపుదలలతో, SRH ఇప్పుడు వేలానికి ముందు ఐదుగురు క్యాప్డ్ ప్లేయర్‌ల కోటాను ఖరారు చేసినట్లయింది. IPL 2024 ఫైనల్‌కు వారిని ముందుకు నడిపించిన కోర్ టీమ్‌ను పటిష్టం చేసే దిశగా ఎస్ఆర్హెచ్ నిర్ణయం తీసుకుందని సమాచారం.
ఇవీ చదవండి: IPL 2025 Retention: ఆర్సీబీకి కేఎల్ రాహుల్ పునరాగమనం?
IPL 2025: ఐపీఎల్ వేలం.. ఈ ఆటగాళ్ల గిరాకీ పెరిగిందా?
IPL: టీమిండియా క్రికెటర్లకు మరో గుడ్ న్యూస్..
IPL Final 2023: తిరుగులేని మహేంద్రుడు.. ఐదో టైటిల్ విశేషాలు ఇవే..
