Telangana News: చెస్ క్రీడలో అరుదైన ప్రపంచ స్థాయి మైలురాయిగా ‘లైవ్ చెస్ రేటింగ్స్‌లో 2800 పాయింట్ల మార్కు’ను దాటేసిన తెలంగాణ (Telangana News) గ్రాండ్ మాస్టర్ అర్జున్ ఎరిగైసిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందించారు.
సెర్బియా వేదికగా జరిగిన యూరోపియన్ చెస్ క్లబ్ కప్ టోర్నీలో అద్భుతమైన ఆటతీరుతో అర్జున్ సాధించిన ఈ ఫీట్ అందరికీ స్ఫూర్తినిస్తుందని ఈ సందర్భంగా సీఎం రేవంత్ అన్నారు.
వెటరన్ గ్రాండ్ మాస్టర్, ఐదుసార్లు ప్రపంచ ఛాంపియన్ విశ్వనాథన్ ఆనంద్ తర్వాత లైవ్ చెస్ రేటింగ్ 2,800 పాయింట్స్ దాటిన రెండో భారతీయుడిగా వరంగల్ యువతేజం అర్జున్ ఎరిగైసి రికార్డు నెలకొల్పడం సంతోషకరమని వ్యాఖ్యానించారు. ప్రపంచంలో ఇప్పటిదాకా ఈ ఫీట్ సాధించినవారు కేవలం 16 మందే ఉండటం విశేషమని సీఎం పేర్కొన్నారు.
కొద్ది రోజుల కిందట బుడాపెస్ట్ వేదికగా జరిగిన 45వ చెస్ ఒలింపియాడ్ లో భారత్ స్వర్ణం గెలవడంలో అర్జున్ గారు కీలక పాత్ర పోషించడం, టీమ్ అందరూ ముఖ్యమంత్రిని కలిసిన సందర్భంలో తెలంగాణ ప్రభుత్వం తలా రూ.25 లక్షల ప్రోత్సాహకాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఇవీ చదవండి: Telangana CM: సీఎస్ఎంపీ, మూసీ, సీనరేజీ ట్రీట్‌మెంట్ ప్లాంట్ల నిర్మాణానికి సహకరించండి
Telangana: వరద బాధితుల సహాయార్థం తెలంగాణ సీఎంఆర్ఎఫ్‌కు విరాళాలు
Telangana DSC Results: తెలంగాణ డీఎస్సీ ఫలితాల విడుదల
Telangana: వరద బాధితుల కోసం సినీ నటి రూ.50 లక్షల విరాళం
Telangana: తెలంగాణ అధికారిక చిహ్నం మార్పుపై వెనక్కి తగ్గిన రేవంత్ సర్కార్
Telangana: తెలంగాణలో రెండు వారాలపాటు సినిమా ప్రదర్శనలు నిలిపివేత
Telangana Voters: తెలంగాణలో ఫైనల్ ఓటర్ల జాబితాను ప్రకటించిన ఈసీ.. మొత్తం ఓటర్లు ఎంతమంది అంటే…
Revanth Reddy on YS Jagan: జగన్‌కు మైలేజీ పెంచుతున్న రేవంత్‌రెడ్డి..
CM Revanth on Auto drivers: ఆటో డ్రైవర్లకు సీఎం రేవంత్‌రెడ్డి అభయం.. వారి కోసం ఏం చేస్తారంటే..
TG DSC 2024: తెలంగాణ డీఎస్సీ జాబ్స్ సాధించిన వారికి సర్కారు ఝలక్..!
