Zarashatavari: టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, శాండిల్ వుడ్.. ఏ సినిమా ఇండస్ట్రీలోని హీరోయిన్ అయినా సరే.. ఈ అమ్మడి ముందు దిగదుడుపేనంటోంది. ఆమె మరెవరో కాదు.. ఏఐ భామ జారశతావరి. (Zarashatavari) ఏఐ రూపొందించిన ఈ అపురూపమైన భామ నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది.

Fanvue ద్వారా నిర్వహించిన AI రూపొందించిన మోడల్‌ల కోసం ప్రపంచంలోని మొట్టమొదటి అందాల పోటీలో జరా శతవరి టాప్ 10 ఫైనలిస్ట్‌లలో నిలిచింది. ఫోర్బ్స్ ప్రకారం, 1,500 కంటే ఎక్కువ అంతర్జాతీయ ఎంట్రీల నుంచి శాతవరిని ఎంపిక చేశారు. జారా శతావరి ఫుడ్డీ. జర్నీ లవర్. ఫ్యాషన్ లవర్.

ఆరోగ్యం, కెరీర్ డెవలప్‌మెంట్ మరియు తాజా ఫ్యాషన్ పోకడలపై ఆమె ఫోకస్ ద్వారా వ్యక్తులు తమ ఉత్తమ జీవితాలను గడపడానికి హెల్ప్ చేయడం కోసం పని చేస్తుంది. తన వెబ్‌సైట్ ప్రకారం తన అనుచరులతో లోతుగా కనెక్ట్ అవ్వాలని, ప్రతిరోజూ వారిని ప్రేరేపించాలని కోరుకుంటుంది.

జరా శతవరి ఎవరంటే..
జరా శతవరి భారతీయ మొబైల్ యాడ్ ఏజెన్సీ సహ వ్యవస్థాపకుడు రాహుల్ చౌదరిచేత సృష్టించబడింది. ఈ “డిజిటల్ దివా” ఆమె ఆరోగ్యం, ఫ్యాషన్ పోకడలపై బ్లాగులను ప్రచురించే వెబ్‌సైట్‌ను నిర్వహిస్తోంది.
ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో 23,300 మంది ఫాలోవర్లను కూడా కలిగి ఉంది. సోషల్ మీడియా ఫీడ్‌లో ఇటీవల వైరల్ అయ్యింది. ఆమె యోగా, ప్రశాంతమైన స్పాలో బయట విశ్రాంతి తీసుకోవడం, ఆదివారం ఉదయం తీరికగా షీట్‌ల కింద పడుకోవడం వంటి పనులు చేస్తున్న చిత్రాలను సోషల్ మీడియాలో పంచుకుంటుంది.

అందమైన ఫొటోలు, రీల్స్ ను పంచుకుంటుంది. సోషల్ మీడియాను షేక్ చేస్తూ కుర్రకారును ఆకట్టుకుంటోంది. ఫ్యాషన్ మాత్రమే కాదు.. ట్రెడిషనల్ లుక్స్ తోనూ జార శతవరి అదరగొడుతోంది.

గణేష్ ప్రతిమలతో సంప్రదాయ దుస్తులు ధరించి ఫొటోలకు పోజులిచ్చింది. అంతేనా.. ఏ హీరోయిన్ ఏ డ్రెస్ వేసుకుంటే ఆ డ్రెస్ ఈ అమ్మడికి బాగా నప్పుతోంది. అదే పోజులతో హీరోయిన్ల కంటే మెరుగ్గా అందంగా దర్శనమిస్తోంది.

“ఆరోగ్యం, కెరీర్ డెవలప్‌మెంట్, తాజా ఫ్యాషన్ ట్రెండ్‌లపై విలువైన దృష్టి, చిట్కాలను పంచుకోవడం ద్వారా వ్యక్తులు వారి ఉత్తమ జీవితాన్ని గడపడానికి సాయం చేయడమే తన లక్ష్యమంటోంది. సహజమైన భారతీయ రూపం, మానవ స్పర్శతో, తన ఫాలోయర్లతో లోతుగా కనెక్ట్ అవ్వడం, స్ఫూర్తిని పొందడం తన ఉద్దేశమంటోంది.

ఇవీ చదవండి: Meenakshii Chaudhary: రెడ్ డ్రెస్‌లో మీనాక్షి చౌదరి.. ఫొటో గ్యాలరీ
Mrunal Thakur hot: బాత్ టబ్బులో మృణాల్ హాట్ పోజులు.. విషయం అదా?
Mrunal Thakur: మృణాల్ ఠాకూర్ జోరు.. రెమ్యునరేషన్ పెంచేసిందిగా.. వయ్యారి భామ ఫొటో గ్యాలరీ
Kavya Thapar: టాలీవుడ్ స్టార్ హీరోయిన్.. గ్లామర్ షో.. సోషల్ మీడియాలో హాట్ ఫొటోలు వైరల్
Nikki Tamboli: శిల్పం లాంటి అందం.. నిక్కీ తంబోలి ఫొటో గ్యాలరీ
Tamannaah Latest: తమన్నా భాటియా లేటెస్ట్ హాట్ ఫొటో షూట్
Mahima Nambiar: మహిమ నంబియార్ క్యూట్ పోజులు.. ఎవరీ చిన్నది?
Tripti Dimri: బాలీవుడ్‌లో ఎంత మంది అందగత్తెలున్నా.. త్రిప్తి డిమ్రీ అందం వేరయా!
