HomeAndhra PradeshNara Lokesh with Satya Nadella: సత్య నాదెళ్లతో నారా లోకేష్ భేటీ.. ఏం మాట్లాడారంటే

Nara Lokesh with Satya Nadella: సత్య నాదెళ్లతో నారా లోకేష్ భేటీ.. ఏం మాట్లాడారంటే

Nara Lokesh with Satya Nadella: మైక్రో సాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్లతో రెడ్ మండ్‌లోని సంస్థ ప్రధాన కార్యాలయంలో ఏపీ మంత్రి నారా లోకేష్ (Nara Lokesh with Satya Nadella) భేటీ అయ్యారు. 4వసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబునాయుడు ఏపీని టెక్నాలజీ రంగంలో అగ్రగామిగా తీర్చిదిద్దేందుకు రాష్ట్రవ్యాప్తంగా కొత్త ఐటీ హబ్‌లు, ఇన్నోవేషన్ పార్కులను నిర్మిస్తున్నారని ఈ సందర్భంగా తెలిపినట్లు లోకేష్ ఎక్స్ వేదికగా ప్రకటించారు. ఈ హబ్‌లను ప్రపంచ స్థాయి సాంకేతిక కేంద్రాలుగా తీర్చిదిద్దడంలో మైక్రోసాఫ్ట్ సహకారం కావాలని కోరినట్లు తెలిపారు.

“క్లౌడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, డేటా సెంటర్‌ల ఏర్పాటుతో ఆంధ్రప్రదేశ్ ప్రపంచస్థాయి సంస్థలకు ప్రాంతీయ కేంద్రంగా మారే అవకాశాలు ఉన్నాయి. ఈ రంగంలో పెట్టుబడులకు అనుకూలమైన విధానాలు, భూమి మావద్ద అందుబాటులో ఉంది. క్లౌడ్ సేవల్లో మైక్రోసాఫ్ట్ నాయకత్వంతో కలిసి పనిచేద్దాం” అని ప్రతిపాదించినట్లు లోకేష్ వెల్లడించారు.

ఏపీలో ఐటీ, ఇంజనీరింగ్ టాలెంట్ పై దృష్టి సారించాలని కోరినట్లు లోకేష్ తెలిపారు. ఏపీలో అగ్రిటెక్‌కు ఏఐని అనుసంధానించడం వల్ల వ్యవసాయ రంగంలో విప్లవాత్మకమైన మార్పులు వస్తాయని, మైక్రోసాఫ్ట్ సాంకేతిక నైపుణ్యంతో ఉత్పాదకతను పెంచే వ్యవసాయ విధానాలను అభివృద్ధి చేయాలని భావిస్తున్నామని లోకేష్ తెలిపారు.

స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో భాగంగా స్ట్రీమ్‌లైన్డ్ అప్రూవల్స్, ఫాస్ట్-ట్రాక్ ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్, ప్రో-బిజినెస్ పాలసీలతోపాటు మంచి ఎకో సిస్టం ఉందని వివరించారు. క్లౌడ్-ఆధారిత ప్లాట్‌ఫాంలను అమలు చేయడం, డేటా అనలిటిక్స్ కోసం ఏఐని ఉపయోగించడం, సైబర్‌ సెక్యూరిటీని మెరుగుపరచడం, స్మార్ట్ సిటీ కార్యక్రమాలను అభివృద్ధి చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుసరించే డిజిటల్ గవర్నెన్స్ విధానాలకు మైక్రో సాఫ్ట్ సహకారాన్ని కోరినట్లు లోకేష్ వెల్లడించారు.

అమరావతిని ఏఐ క్యాపిటల్ గా తయారు చేసేందుకు ఏఐ యూనివర్సిటీని ఏర్పాటు చేయబోతున్నామన్నారు. దీనికి మైక్రోసాఫ్ట్ సహకారం కావాలని ఏపీ ప్రభుత్వం కోరుకుంటోందని లోకేష్ వెల్లడించారు. ఏపీలో డిజిటల్ ట్రాన్ఫార్మేషన్, ఏఐ రంగాల అభివృద్ధికి సహకరిస్తామని సత్య నాదెళ్ల మాట ఇచ్చారని లోకేష్ ఈ సందర్భంగా వివరించారు.

ఇవీ చదవండి: Nara Lokesh in USA: ఏవియేషన్, మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల్లో పెట్టుబడుల ఆహ్వానం
Nara Lokesh: ఏఐ చాన్సుల వినియోగం.. వేగంగా ఏపీ అభివృద్ధి
Nara Lokesh: 43వ రోజు ప్రజా దర్బార్.. మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు
Nara Lokesh: వైకాపా వాళ్లు నన్ను చూసి ఇన్‌స్పైర్ అవుతున్నారు: లోకేష్

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు